E-Paper
Advertisement

తనిష్క్‌లో 10 కేజీల గోల్డ్ చోరీ కేసులో బిగ్ ట్విస్ట్.. ఇన్‌ఫ్లుయెన్సర్ మీనాక్షి అరెస్ట్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!

తనిష్క్‌లో 10 కేజీల గోల్డ్ చోరీ కేసులో బిగ్ ట్విస్ట్.. ఇన్‌ఫ్లుయెన్సర్ మీనాక్షి అరెస్ట్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!
Advertisement

Tanishq Robbery: తమిళనాడులోని మధురైలో గల తనిష్క్ జ్యువెలరీ షోరూమ్‌లో జరిగిన ఆభరణాల దోపిడీ కేసు ఊహించని మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నిశాంత్‌కు సన్నిహితురాలైన ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్ మీనాక్షిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెతో పాటు నిశాంత్ తండ్రి అశోక్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు నిశాంత్ కోసం ప్రత్యేక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి.

ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షకు పైగా ఫాలోవర్లను సంపాదించుకున్న మీనాక్షి.. 10 లక్షల మంది ఫాలోవర్లు ఉన్న ‘టెక్ బాస్ ఇండియా’ (techbossIndia) అనే పేజీతోనూ కలిసి పనిచేసింది. ప్రధాన నిందితుడు నిశాంత్ వృత్తిరీత్యా వీడియో ఎడిటర్ కాగా అతడికి కూడా ట్రావెల్ వీడియోలకు సంబంధించిన ప్రత్యేక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఉంది. వీరిద్దరూ కలిసి పలు వీడియోలలో కూడా నటించారు. అయితే నిశాంత్ దోపిడీకి ముందు పలుమార్లు షోరూమ్‌కు వచ్చి రెక్కీ నిర్వహించి, పక్కా ప్రణాళికతో ఈ చోరీకి పాల్పడినట్లు మధురై నగర సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.

Advertisement

మొదట సీసీటీవీ ఫుటేజీని పరిశీలించినప్పుడు మాస్క్ ధరించిన ఒక్క వ్యక్తి మాత్రమే షోరూమ్‌లోకి ప్రవేశించి నగలతో పరారైనట్లు కనిపించింది. అయితే దర్యాప్తులో భాగంగా ఇతర సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలను పరిశీలించగా.. ఈ చోరీలో మీనాక్షి, అశోక్‌ల ప్రమేయం ఉన్నట్లు తేలింది. దోచుకున్న సొత్తును ఎక్కడ దాచారో మీనాక్షికి పూర్తిగా తెలుసని పోలీసులు వెల్లడించారు. అంతేకాకుండా ఆమె చూపించిన ప్రాంతంలో తవ్వి బంగారు నగలని రికవరీ కూడా చేసినట్లు పేర్కొన్నారు.

Advertisement

సెప్టెంబర్ 4వ తేదీ రాత్రి తనిష్క్ షోరూమ్ నుంచి సుమారు 10.5 కిలోల బంగారు ఆభరణాలు, ఒక కిలో వజ్రాభరణాలు చోరీకి గురయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన మధురై పోలీసులు.. తొమ్మిది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక దర్యాప్తులో భాగంగా ఆ షోరూమ్‌ను ఇటీవలే ప్రారంభించారని, అక్కడ ఇంకా కొన్ని నిర్మాణ పనులు జరుగుతున్నాయని గుర్తించారు. ఈ క్రమంలోనే అక్కడ కొన్ని భద్రతా లోపాలు ఉండటాన్ని నిందితులు తమకు అనుకూలంగా మార్చుకున్నట్లు విచారణలో తేలింది.

Also Read: జియోలో దుమ్మురేపే ఫ్యామిలీ ప్లాన్.. రూ.749కే 100GB, అపరిమిత 5G, నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్!

అరెస్ట్ అనంతరం పోలీసులు తమదైన శైలిలో విచారించగా దోచుకున్న ఆభరణాలను దాచిన ప్రదేశం గురించి మీనాక్షి బయటపెట్టింది. ఆమె ఇచ్చిన సమాచారంతో నిర్మానుష్య ప్రదేశంలో భూమిలో పాతిపెట్టి దాచిన 5 కిలోలకు పైగా ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన మీనాక్షి, అశోక్‌లను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచనుండగా మిగిలిన సొత్తు కోసం, పరారీలో ఉన్న నిశాంత్‌ను పట్టుకునేందుకు పోలీసులు వేట కొనసాగిస్తున్నారు.

Also Read: Brahmamudi Serial Today Episode November 15th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు సంతకం చేస్తే రాజు ఏం చేశాడో తెలుసా..?

Tags

Related News

బైక్‌పై వెళుతున్న ఇద్దరు వ్యక్తులపై దూకిన కోతి.. ఇద్దరూ మృతి.. ఎలాగంటే

దేశ రాజకీయాల్లో దుమారం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ అంశం.. ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ సవాల్!

తమిళనాడు బాలికల లైంగిక దాడి కేసులో బిగ్ ట్విస్ట్.. యజమాని ఇంట్లో సోదాలు!

విడాకుల కోసం భారీగా డబ్బు డిమాండ్ చేసిన భార్య.. ఇచ్చాక మాట తప్పిందని కోర్టుకెక్కిన భర్త

అస్సాంలో ఘోర ప్రమాదం.. ట్రక్కును ఢీకొట్టిన బస్సు, 23 మందికి పైగా మృతి!

మద్యం మత్తులో వేధింపులు.. కత్తితో పొడిచి పొడిచి భర్తను చంపిన భార్య

200 కి.మీ. వేగం.. ఊడిపడిన ఇంజిన్.. ద్వారకా టన్నెల్‌లో భయానక ప్రమాదం!

Big Stories

Advertisement
×