E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode November 16th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్నను పెళ్లి చేసుకోమని సూరజ్ కు చెప్పిన మాలిని

Karthika Deepam 2 Serial Today Episode November 16th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్నను పెళ్లి చేసుకోమని సూరజ్ కు చెప్పిన మాలిని
Advertisement

Karthika Deepam 2 serial today Episode: టిఫిన్‌ బండి దగ్గర శివనారాయణతో డబ్బులు అవసరం ఉందని తీసుకున్న జ్యోత్స్న సూరజ్‌ కాల్‌ చేయడంతో మాట్లాడి ఇప్పుడే వస్తున్నాను అంటూ చెప్పి వెళ్లిపోతుంది. జ్యోత్స్న వెళ్లి సూరజ్‌ కారు ఎక్కడం.. సూరజ్‌ తో కలిసి వెళ్లడం చూస్తుంది పారిజాతం. వెంటనే వెళ్లి శివానారాయణకు చెప్పాలనుకుంటుంది. కానీ మాలిని మనిషి పారిజాతాన్ని తీసుకెళ్తాడు.

జ్యోత్స్నను తీసుకెళ్లిన సూరజ్‌ తమ జీవితాలకు సంబంధించిన నిర్ణయం తీసుకుంటున్నానని నేనే నిర్ణయం తీసుకున్నా నువ్వు కట్టుబడి ఉండాలని చెప్తాడు. మన జీవితాలా..? అంటే ఎవరివి సార్‌ అని జ్యోత్స్న అడుగుతుంది. మనవి అంటే నీది నాది.. మన జీవితాల్లో ఒక సంఘటన జరగబోతుంది. అది మా అమ్మకు చెప్పి చేస్తాను అంటాడు సూరజ్‌. ఓహో మీ అమ్మ పర్మిషన్‌ తీసుకుంటావా..? సార్‌ అని జ్యోత్స్న వెటకారంగా అడిడితే.. పర్మిషన్‌ కాదు ఇన్ఫర్మేషన్‌ ఇస్తాను ఎందుకంటే నా కోసం బతుకుతున్న ఒకే ఒక్క మనిషి మా అమ్మ.. నేను జవాబు చెప్పుకోవాల్సింది కేవలం మా అమ్మే అంటూ సూరజ్‌ చెప్పగానే.. మీ అమ్మే ఉందా..? ఇంకెవరూ లేరా..? అంటూ జ్యోత్స్న అడిగితే.. నీ ఈ ప్రశ్నకే ఇవాళ సమాధానం ఇవ్వాలి అనుకుంటున్నా అంటూ సూరజ్‌ చెబితే.. సరే సార్‌ కానీ నన్నెందుకు ఇక్కడకు తీసుకొచ్చినట్టు అంటూ జ్యోత్స్న అడిగితే రేపు నా నిర్ణయం చెప్పిన తర్వాత నువ్వు నో చెప్తావేమోనని ముందే నీకు విషయం చెప్తున్నా అయినా మ అమ్మకు చెప్పాకే నీకు చెప్తాను.. అంటూ సూరజ్ ఇక వెళ్దామా..? అంటూ జ్యోత్స్నను తీసుకుని వెళ్లిపోతాడు.

Advertisement

పారిజాతాన్ని మాలిని దగ్గరకు తీసుకెళ్తాడు కిడ్నాప్‌ చేసిన వ్యక్తి. మాలినిని చూడగానే.. నువ్వేనా నన్ను ఎత్తుకొచ్చింది.. అసలు నన్ను ఎందుకు ఎత్తుకొచ్చారు అంటూ అడుగుతుంది పారిజాతం. మాలిని కోపంగా అసలు ఆ జ్యోత్సన్ నీ మనవరాలేనా..? నీ మీద ప్రేమ లేదా దానికి అంటూ అడిగితే.. ఈ పారు అంటే దానికి ఎనలేని ప్రేమ ఉంది. కానీ నీ కొడుకే వచ్చి దాన్ని కారులో ఎక్కించుకుని వెళ్తున్నాడు. జ్యోత్స్న వాడినే ప్రేమిస్తుంది. సూరజ్‌ కూడా జ్యోత్స్నను ప్రేమిస్తున్నాడని చెప్తుంది పారిజాతం. అందుకు మాలిని కోపంగా నా కొడుకు అలాంటి వాడు కాదు నేను గీసిన గీత దాటడు.. నేను ఎవరి మెడలో తాళి కట్టమంటే వారి మెడలో తాళి కడతాడు.. కానీ నీ మనవరాలి పరిస్థితి ఏంటి..? సూరజ్‌ ను నీ మనవరాలు మర్చిపోకపోతే దాని జీవితం ఏమౌతుందో నేను చెప్పలేను అంటూ వార్నింగ్‌ ఇస్తుంది. అందుకు పారిజాతం తాను చెప్పినా జ్యోత్స్న వినదని చెప్తుంది. అందుకు మాలినికి డబ్బులు ఇచ్చి ఇప్పుడు నేను చెప్పినట్టు చేయ్‌ వింటుంది అని చెప్తుంది. డబ్బును చూడగానే పారిజాతం కూల్‌ అయిపోతుంది.

తర్వాత జ్యోత్స్న దగ్గరకు వెళ్లి సూరజ్‌ను మర్చిపోమ్మని చెప్తుంది పారిజాతం. నువ్వు నీలాగే ఉండు ఇంతకుముందు జ్యోత్స్న ఎలా ఉండేదో అలాగే ఉండమని చెప్తుంది. అందుకు జ్యోత్స్న తాను ఇంతకుముందులాగే ఉన్నానని చెప్తుంది. ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. జ్యోత్స్న ఎన్ని చెప్పినా సూరజ్‌ను మర్చిపోనని చెప్తుంది. పారిజాతం చివరకు భయపెడుతుంది. నువ్వు సూరజ్‌ను మర్చిపోకపోతే ఆ మాలిని నిన్ను ఏమైనా చేస్తుంది చెప్పినా జ్యోత్స్న వినకుండా పారిజాతాన్ని వెళ్లిపోమ్మని చెప్తుంది.

Advertisement

ఆఫీసులో తాళి పట్టుకుని జ్యోత్స్న గురించి ఆలోచిస్తున్న సూరజ్‌ దగ్గరకు మాలిని వెళ్లి నువ్వు జ్యోత్స్నను పెళ్లి చేసుకోవాలనుకుంటే చేసుకో కానీ మీ నాన్న చావుకు కారణం అయిన సుమిత్ర కూతురు జ్యోత్స్న అన్న విషయం మర్చిపోవద్దు.. నీకోసం నేను అన్ని మర్చిపోతాను అంటూ చెప్తూనే.. జ్యోత్స్న గురించి ఏదో చెప్పబోతూ ఆగిపోతుంది. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Illu Illalu Pillalu Today Episodes: అంజలి పై వల్లికి అనుమానం.. భద్రకు దిమ్మతిరిగే షాక్.. రామరాజు ఫుల్ హ్యాపీ..

Intinti Ramayanam Today Episode: రమ్యకు బిగ్ షాక్.. ప్రణతి ప్లాన్ సక్సెస్.. అర్ధరాత్రి పల్లవి హంగామా..

Brahmamudi Serial Today Episode November 16th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందును స్టాల్ ను బ్యాడ్ చేయాలనుకున్న ఐషు

Karthika Deepam2 : డాక్టర్ బాబు అవుట్.. క్రేజీ హీరో ఎంట్రీ..

Telugu TV Serials: టీవీ సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. గుండెనిండా గుడిగంటలు అవుట్..

Nindu Noorella Saavasam Serial Today Episode November 16th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: రొమాంటిక్‌ మూడ్ లో అమర్‌ – డిస్సపాయింట్‌ చేసిన మిస్సమ్మ

Monday TV Movies : సోమవారం మూవీ లవర్స్ కు పండగే.. ఆ రెండు వెరీ స్పెషల్..

Big Stories

Advertisement
×