Biker Saves Kitten: రద్దీగా ఉన్న రహదారిపై వేగంగా దూసుకొస్తున్న వాహనాలను ఆపి పిల్లిని కాపాడిన ఓ బైకర్ పై నెట్టింట ప్రశంసలు కురుస్తున్నాయి. బైకర్ చేసిన మంచి పనిని నెటిజన్లు అభినందిస్తున్నారు. రోడ్డుపై సమయస్ఫూర్తితో అతడు వ్యవహరించిన తీరును ప్రశంసిస్తున్నారు. బైకర్ పిల్లిని కాపాడిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
‘రాద్వాన్ అన్‌ఫిల్టర్డ్’ అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ బైక్ పై రద్దీగా ఉన్న రోడ్డుపై వెళ్తున్నాడు. ఈ క్రమంలో రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తున్న చిన్న పిల్లి అతని కంటపడింది. వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటంతో ఆ పిల్లి ప్రమాదంలో పడుతుందని గ్రహించిన అతడు.. ఏమాత్రం ఆలోచించకుండా బైక్ ను రోడ్డు మధ్యలో ఆపాడు. చేతులు ఊపుతూ వేగంగా వస్తున్న వాహనాలను ఆపాడు.
అయితే అప్పటికే ప్రాణభయంతో ఉన్న పిల్లి.. రోడ్డుపై ఆగిన ఓ కారు కిందకు దూరింది. దానిని గమనించిన బైకర్.. వెంటనే కారు వద్దకు వెళ్లి పిల్లిని బయటకు తీసే ప్రయత్నం చేశాడు. ఇది గమనించిన కొందరు పాదచారులు, వాహనదారులు కూడా అతనికి సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఎట్టకేలకు పిల్లిని సురక్షితంగా బయటకు తీసిన బైకర్.. ఎంతో ప్రేమతో దాన్ని అక్కున చేర్చుకున్నాడు. తను ధరించిన కుర్తా జేబులో పెట్టుకుని అక్కడి నుంచి బైక్‌పై బయలుదేరాడు. కొద్ది దూరం వచ్చాక బైక్ ను రోడ్డు పక్కన ఆపి.. పిల్లికి పాలు పోశాడు. ఓ చిన్న ప్రాణం నిలిచిందంటూ సదరు బైకర్ సంతోషం వ్యక్తం చేశారు.
Also Read: జియో బంపరాఫర్.. రూ.649 కే అపరిమిత 5G, హాట్‌స్టార్.. గూగుల్ జెమిని, కాన్వా ప్రో సైతం ఫ్రీ!
పిల్లిని కాపాడిన వీడియో వైరల్ కావడంతో బైకర్ పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘ఈ రోజుల్లో చాలామంది జంతువులను పట్టించుకోకుండా వాహనాలు నడుపుతున్నారు. ఈ మంచి పనికి సహకరించిన ప్రతి ఒక్కరికీ దేవుడి ఆశీస్సులు ఉండాలి’ అని ఒక యూజర్ కామెంట్ చేశారు. ‘హీరోలందరూ మాస్కులు (స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ తరహాలో) వేసుకోరు. కొందరు హెల్మెట్లు కూడా ధరిస్తారు’ అంటూ మరో నెటిజన్ బైకర్‌పై ప్రశంసలు కురిపించారు.
?utm_source=ig_embed&ig_rid=ARwoyk-8zFqUe4m-7-G86_5
Also Read: ఒక్క రీఛార్జ్‌తో 84 రోజుల వ్యాలిడిటీ, 4 ఓటీటీలు, రూ.4,000 విలువైన ప్రీమియం బెనిఫిట్స్ ఫ్రీ!