E-Paper
Advertisement

ఘోర ప్రమాదం.. ట్యాంకర్ నుంచి లీకైన హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఊరి మొత్తాన్ని కమ్మేసింది

ఘోర ప్రమాదం.. ట్యాంకర్ నుంచి లీకైన హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఊరి మొత్తాన్ని కమ్మేసింది
Advertisement

Road Accident: రోడ్ల మీద వెళ్లేటప్పుడు పదేపదే జాగ్రత్తలు చెబుతున్నా వాహనదారులు ఏ మాత్రం పట్టించుకోలేదు. ప్రమాదానికి గురైన ఓ ట్యాంకర్ నుంచి ఏకంగా హైడ్రోక్లోరిక్ యాసిడ్ లీకైంది. అంతేకాదు ఆ యాసిడ్ సమీప ప్రాంతాలను చుట్టేసింది. దీంతో కంగారు పడిన స్థానికులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటన తమిళనాడులో వెలుగుచూసింది.

తమిళనాడులో ఘోర ప్రమాదం

తమిళనాడు ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దుండిగల్ జిల్లా తూత్తుకుడి నుండి కరూర్‌కు వెళ్తోంది ఓ ట్యాంకర్ లారీ. దాని నిండా సుమారు 25 వేల లీటర్ల హైడ్రో క్లోరిక్ యాసిడ్ తీసుకెళ్తోంది. ఆ ట్యాంకర్ ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో దిండిగల్-కరూర్ జాతీయ రహదారిపై కలెక్టర్ కార్యాలయం సమీపంలోని ప్రమాదానికి గురైంది. తెల్లవారుజామున కావడంతో ట్యాంకర్ డ్రైవర్ నిద్ర మత్తులో నియంత్రణ కోల్పోవడంతో రోడ్డు పక్కకు దూసుకెళ్లింది.

ట్యాంకర్ నుంచి లీకైన యాసిడ్, ఆ ఊరిని కమ్మేసింది

Advertisement

అదే సమయంలో తూత్తుకుడి నుండి నామక్కల్‌ కు సున్నపురాయిని తీసుకెళ్తున్న మరో లారీ, యాసిడ్ ట్యాంకర్ ముందు భాగాన్ని బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో యాసిడ్ లారీ ట్యాంక్ వాల్వ్ పూర్తిగా విరిగిపోయింది. ప్రమాదం సమయంలో లారీలోని దాదాపు 25 వేల లీటర్ల హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంది. ట్యాంకర్ నుంచి లీకైన హైడ్రో క్లోరిక్ యాసిడ్, హైవేతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలను కమ్మేసింది. తెల్లవారు జామున సమయంలో ఘటన జరగడంతో చాలామంది ఆ ప్రాంత ప్రజలు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందులు పడ్డారు.

ప్రమాదం గురించి తెలియగానే తడికొంబు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తక్షణం ట్రాఫిక్‌ను నియంత్రించారు.  వెంటనే పోలీసులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఆ సిబ్బంది రంగంలోకి దిగి యాసిడ్ తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేశారు. పొగ మిగతా ప్రాంతాలకు వ్యాపించకుండా అదుపులోకి తీసుకురావడానికి నాలుగైదు గంటలు పట్టింది. నిరంతరాయంగా నీటిని రోడ్డుపై పిచికారీ చేశారు. ముందుజాగ్రత్త చర్యగా ప్రమాద ప్రాంతంలోకి ఇతర వాహనాలను అనుమతించ లేదు అధికారులు.

Advertisement

ALSO READ: తనిష్క్‌లో 10 కేజీల గోల్డ్ చోరీ కేసులో బిగ్ ట్విస్ట్.. ఇన్‌ఫ్లుయెన్సర్ మీనాక్షి అరెస్ట్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!

రహదారికి ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పాటు చేశారు. కేసు నమోదు చేసి ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు. యాసిడ్ పొగను పీల్చినవారికి గొంతు బొంగురు పోవడం, కళ్లలో మంట, ఒంటిపై దురద వంటి సమస్యలు తలెత్తాయి. ఆ ప్రాంతంలో భద్రతా జాగ్రత్తలు తీసుకున్నారు.

 

Related News

తనిష్క్‌లో 10 కేజీల గోల్డ్ చోరీ కేసులో బిగ్ ట్విస్ట్.. ఇన్‌ఫ్లుయెన్సర్ మీనాక్షి అరెస్ట్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!

బైక్‌పై వెళుతున్న ఇద్దరు వ్యక్తులపై దూకిన కోతి.. ఇద్దరూ మృతి.. ఎలాగంటే

దేశ రాజకీయాల్లో దుమారం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ అంశం.. ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ సవాల్!

తమిళనాడు బాలికల లైంగిక దాడి కేసులో బిగ్ ట్విస్ట్.. యజమాని ఇంట్లో సోదాలు!

విడాకుల కోసం భారీగా డబ్బు డిమాండ్ చేసిన భార్య.. ఇచ్చాక మాట తప్పిందని కోర్టుకెక్కిన భర్త

అస్సాంలో ఘోర ప్రమాదం.. ట్రక్కును ఢీకొట్టిన బస్సు, 23 మందికి పైగా మృతి!

మద్యం మత్తులో వేధింపులు.. కత్తితో పొడిచి పొడిచి భర్తను చంపిన భార్య

Big Stories

Advertisement
×