E-Paper
Advertisement

LPG Ships Crossed Hormuz: భారత్ కు గుడ్ న్యూస్.. హర్మూజ్ దాటిన రెండు ఎల్పీజీ నౌకలు

LPG Ships Crossed Hormuz: భారత్ కు గుడ్ న్యూస్.. హర్మూజ్ దాటిన రెండు ఎల్పీజీ నౌకలు
Advertisement

LPG Ships Crossed Hormuz: ఎల్పీజీ ఇబ్బందుల వేళ.. భారత్ కు గుడ్ న్యూస్ అందింది. రెండు ఎల్పీజీ నౌకలు హర్మూజ్ జలసంధి దాటాయని భారత ప్రభుత్వం ప్రకటించింది. హర్మూజ్‌ జలసంధి మార్గంలో భారత నౌకలు వెళ్లేందుకు అనుమతిస్తామని ఇరాన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రెండు భారత జెండాలున్న ఎల్పీజీ నౌకలు శనివారం ఉదయం హర్మూజ్‌ జలసంధిని దాటాయి. ‘శివాలిక్‌’, ‘నందాదేవి’ పేరు గల ఎల్పీజీ నౌకలు గుజరాత్‌లోని ముంద్రా, కాండ్లా పోర్టుల వైపు వస్తున్నాయని షిప్పింగ్‌ మంత్రిత్వశాఖ పేర్కొంది.

ఈ భారీ నౌకల్లో సుమారు 92 వేల టన్నుల ఎల్పీజీ ఉందని ఉందని మంత్రిత్వశాఖ తెలిపింది. మార్చి 16 లేదా 17వ తేదీన ఇవి భారత్‌కు చేరుకునే అవకాశం ఉందని వెల్లడించింది. దేశంలో ఎల్పీజీ సరఫరాపై ఆందోళన వ్యక్తమవుతున్న సమయంలో రెండు నౌకలు వస్తుండడంతో ఊరట కలిగించే అంశం.

మార్చి 16,17 నాటికి

Advertisement

“పర్షియన్ గల్ఫ్‌లో భారతీయ జెండాతో ఉన్న 24 నౌకల్లో LPG క్యారియర్లు శివాలిక్, నందా దేవి శనివారం ఉదయం హర్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటి భారతదేశానికి వస్తున్నాయివెళ్తున్నాయి” అని షిప్పింగ్‌ మంత్రిత్వశాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్‌కుమార్‌ సిన్హా పేర్కొన్నారు. రెండు నౌకల్లో దాదాపు 46,000 మెట్రిక్ టన్నుల వంట గ్యాస్‌ను కలిగి ఉన్నాయని, మొత్తం 92,712 మెట్రిక్ టన్నులు ఉన్నాయని సిన్హా తెలిపారు. శివాలిక్ మార్చి 16 నాటికి గుజరాత్ ముంద్రా పోర్టుకు చేరుకోనుంది. నందా దేవి మార్చి 17న కాండ్లా పోర్టుకు చేరుకుంటుందని అధికారులు తెలిపారు.

ఇంకా 22 నౌకలు

రెండు నౌకల హర్మూజ్ దాటటంతో.. మరో 22 భారత నౌకలు జలసంధి పశ్చిమ భాగంలో సిద్ధంగా ఉన్నాయి. వీటిల్లో 611 మంది సిబ్బంది ఉన్నారు. 22 నౌకల్లో, ఆరు నౌకల్లో ఎల్పీజీ, ఒక ట్యాంకర్ సహజ వాయువు క్యారియర్ గా తెలుస్తోంది. నాలుగు ట్యాంకర్లలో ముడి చమురు, ఒకటి రసాయన ఉత్పత్తుల ట్యాంకర్. మిగిలిన వాటిలో మూడు కంటైనర్ నౌకలు, ఒకటి డ్రెడ్జర్, ఒకటి ఖాళీ చేసే బ్యాలస్ట్, రెండు బల్క్ క్యారియర్లు, మూడు డ్రై డాక్‌లు అని విదేశాంగ శాఖ తెలిపింది.

Advertisement

ఆఫ్రికాకు వెళ్లే జగ్ ప్రకాష్ జలసంధి నుంచి వచ్చేందుకు మరో మూడు నౌకలు సిద్ధంగా ఉన్నాయని సీనియర్ అధికారి గురువారం తెలియజేశారు. నిరంతర ఇంధన సరఫరా కోసం ప్రాధాన్యత ఇస్తు్న్నామని అధికారులు తెలిపారు. ఇప్పటికే భారత విదేశాంగ మంత్రి జయ శంకర్.. ఇరాన్ అధికారులతో ద్వైపాక్షిత సమీక్షలు జరుపుతున్నారు. దీంతో హర్మూజ్ నుంచి భారత నౌకలకు వెళ్లేందుకు ఇరాన్ అనుమతినిచ్చింది.

Also Read:  సిలిండర్ అయిపోయినా నో టెన్షన్.. ఈ గ్యాస్ ప్రత్యామ్నాయాలతో వంట చేసేయండి!

ఎల్పీజీ ఇబ్బందులు లేవు

వంట గ్యాస్ సిలిండర్ల విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అవసరం లేకున్నా చాలామంది ముందస్తుగా బుకింగ్‌ చేస్తున్నారని తెలిపింది. బ్లాక్‌ మార్కెట్‌ను అరికట్టాలని రాష్ట్రాలను కేంద్రం కోరింది. కమర్షియల్ సిలిండర్లను ప్రాధాన్యత క్రమంలో సప్లై చేస్తున్నామని అధికారులు తెలిపారు. వంట గ్యాస్ సరఫరాలో ప్రస్తుతానికి ఇబ్బందులు లేవన్నారు. అక్రమంగా నిల్వ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని హెచ్చరించారు. ఎల్పీజీ సరఫరాలో గృహాలు, ఆసుపత్రులు, హాస్టళ్లకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ఎల్పీజీ బుకింగ్‌కు గ్రామాల్లో 45 రోజులు, పట్టణాల్లో 25 రోజుల కనీస గడువు ఉందని పెట్రోలియం శాఖ అధికారులు తెలిపారు.

Related News

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

రన్నింగ్‌ బస్సులో జుట్టు పట్టుకొని కొట్టుకున్న లేడి కండక్టర్, మహిళా ప్యాసింజర్.. ఇదిగో వీడియో!

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్.. ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..

కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

Big Stories

Advertisement
×