Kuldeep Yadav wedding: టీమిండియాలో వరుసగా క్రికెటర్లు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఈ మధ్యకాలంలో చాలా మంది క్రికెటర్లు పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా టీమిండియా స్టార్ ఆటగాడు, లెజెండరీ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ( kuldeep yadav) కూడా పెళ్లి పీటలు ఎక్కాడు. తన చిన్ననాటి స్నేహితురాలు వన్షిక చద్దా ( vanshika chaddha ) ను పెళ్లి చేసుకున్నాడు కుల్దీప్ యాదవ్ ( Kuldeep Yadav wedding). ఉత్తరాంఖడ్ లోని ముస్సోరీలో కుల్దీప్ యాదవ్ అలాగే వన్షిక చద్దా పెళ్లి జరిగింది. ఈ పెళ్లి గ్రాండ్ గా జరగగా… నూతన వధూవరుల ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు స్టేజ్ పైనే తన భార్య వన్షిక చద్దా ( vanshika chaddha )కు కిస్ పెట్టి.. తన ప్రేమను చాటుకున్నాడు కుల్దీప్ యాదవ్. ఈ వీడియో కూడా వైరల్ అవుతోంది.
Also Read: RCB VS SRH: కావ్యా పాపపై దారుణంగా పోస్టులు..సన్ రైజర్స్ ను పాకిస్తాన్ గా ఫోటోలు మార్ఫింగ్ చేసి
టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఓ ఇంటివాడు అయ్యాడు. తన చిన్నప్పటి స్నేహితురాలు వన్షిక చద్దా ( vanshika chaddha ) ను పెళ్లి ఆడాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హిల్ స్టేషన్ ముస్సోరి వేదికగా కుల్దీప్ యాదవ్ అలాగే వివాహం మార్చి 14 అంటే శనివారం జరిగింది. ఈ పెళ్లి వేడుకకు రాజకీయ ప్రముఖులు, సినీ యాక్టర్లు అలాగే క్రికెటర్లు కూడా వచ్చారు. ముఖ్యంగా యుజ్వేంద్ర చాహల్, మాజీ క్రికెటర్ సురేష్ రైనా, రింకూ సింగ్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ హాజరైనట్లు సమాచారం అందుతోంది. అయితే మార్చి 13వ తేదీన హల్దీ అలాగే సంగీత్ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు మాత్రం చాహల్, రింకు సింగ్ హాజరై సందడి చేశారు. కాగా శనివారం రోజున కుల్దీప ్ యాదవ్, వన్షిక చద్దా పెళ్లి జరగగా మార్చి 17వ తేదీన లక్నో వేదికగా రిసెప్షన్ కూడా ఉంటుంది. ఈ సందర్భంగా పెళ్లి వీడియోలు, స్టేజ్ పైన తన భార్య వన్షిక చద్దాకు కిస్ ఇచ్చిన కుల్దీప్ యాదవ్ వీడియో వైరల్ అవుతోంది.
టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ పెళ్లి చేసుకున్న వన్షిక చద్దా.. అతని చిన్ననాటి స్నేహితురాలు. చిన్నప్పటి నుంచి కుల్దీప్ యాదవ్ అలాగే వన్షిక చద్దా మధ్య రిలేషన్ ఉన్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఎల్ఐసి సంస్థలో మేనేజర్ హోదాలో వన్షిక చద్దా పని చేస్తున్నట్లు సమాచారం. ఆమె కాన్పూర్ లోనే జన్మించారు. అక్కడే జాబ్ కూడా చేస్తున్నారు వన్షిక చద్దా. ఇరు కుటుంబాల ఒప్పందం ప్రకారమే వన్షిక చద్దా, కుల్దీప్ యాదవ్ పెళ్లి జరిగింది.
Kuldeep Yadav and his wife made a grand entry at their wedding ceremony.🙌❤️
Congratulations both of you 💐 pic.twitter.com/dpXGZp4sDO
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) March 14, 2026
Congratulations Kuldeep and Vanshika ❤.
Happy Married Life to both of you 🧿2026 me duniya ka to pata nhi but yehan par bahut logon ka shadi hote hue dekhe. #KuldeepYadav #Married pic.twitter.com/5wNY0T9tii
— ViratUniverse👑🚩 (@DipanshuV19) March 14, 2026