BigTV English

Trainee IAS Mother: రైతులను తుపాకీతో బెదిరిస్తూ ట్రైనీ ఐఏఎస్ అధికారి తల్లి హల్‌చల్‌

Trainee IAS Mother: రైతులను తుపాకీతో బెదిరిస్తూ ట్రైనీ ఐఏఎస్ అధికారి తల్లి హల్‌చల్‌

Trainee IAS Pooja Khedkar Mother issue(Live tv news telugu): సాధారణంగా ఐఏఎస్ అధికారులు ఏం చేస్తారు.రూల్‌ని పాటిస్తూ ప్రజలకు న్యాయం చేయాలి.కానీ ఇక్కడ ఓ ట్రైనీ ఐఏఎస్ అధికారిణి మాత్రం అలా చేయలేదు.చట్టాన్ని చేతిలోకి తీసుకొని రైతులను భయభ్రాంతులకు గురిచేస్తోంది.ఇంతకీ ఎవరా ట్రైనీ ఐఏఎస్ అధికారిణి అంటే మహారాష్ట్రకు చెందిన ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్‌.జరిగిన ఈ ఘటనతో తనపై విచారణ జరిపేందుకు కేంద్రం ఒక ప్యానెల్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది.ఈ ప్యానెల్ ఏర్పాటు చేసిన రోజు అనంతరం భూ వివాదం విషయంలో పూణెలో ఆమె తల్లి తుపాకీని చూపి రైతును బెదిరిస్తున్న వీడియో క్లిప్‌ ఉంది. అంతేకాకుండా ఖేద్కర్ ఇంట్లో ఉన్న అల్మారా నుండి అస్థిపంజరాలు బయటకు పడిపోయాయి.దీంతో అక్కడున్న వారంతా కంగుతిన్నారు.ఒక్కసారిగా అక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి.


ఈ ఘటన జరిగి దాదాపుగా ఒక సంవత్సరం కింద జరిగిందిగా తెలుస్తోంది. కానీ ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇందులో పూజ తల్లి మనోరమా ఖేద్కర్ తన చేతిలో పాకెట్ పిస్టల్‌తో ఒక రైతును గన్‌తో కొట్టడం మనం గమనించవచ్చు.రెండు నిమిషాల పాటు కొనసాగే ఈ వీడియోలో శ్రీమతి మనోరమ,తన బౌన్సర్‌లతో కలిసి పూణేలోని ముల్షి తహసీల్‌లోని ఒక స్థలంపై రైతుతో వాగ్వాదానికి దిగారు.నాకు సాత్బారా భూమి రికార్డులు చూపించు.ఈ భూమికి సంబంధించిన పత్రాలు నా పేరు మీద కూడా ఉన్నాయని ఈ క్లిప్‌లో శ్రీమతి మనోరమ ఆ వ్యక్తిపై మరాఠీలో అరవడం వినిపిస్తోంది.అయితే ఆ భూమికి సంబంధించిన డాక్యుమెంట్స్‌ తన పేరు మీద ఉందని ఆ వ్యక్తి నిరసనలు వ్యక్తం చేస్తున్నప్పటికీ ఆమె తన ఆవేదనని ఏం మాత్రం పట్టించుకోలేదు.అప్పుడు ఆ బాధితుడు తనకి సంబంధించిన రికార్డుకి సంబంధించిన పత్రాలన్నీ కోర్టులో ఉన్నవని చెప్పాడు.దీంతో ఆగ్రహానికి గురయిన శ్రీమతి మనోరమ ఆ వ్యక్తికి వార్నింగ్‌ ఇస్తూ నాకు నీతులు నేర్పించవద్దని హెచ్చరించినట్లు తెలుస్తోంది.

Also Read: కంగనా రనౌత్ కండీషన్స్‌పై కాంగ్రెస్ ఫైర్


అసలు ఈ ల్యాండ్‌కి ఓనర్ నువ్వే కావచ్చు.కానీ ఈ స్థలం నా పేరు మీదనే ఉంది.కాబట్టి ఆ ల్యాండ్ పత్రాలు మర్యాదగా తనకి ఇవ్వాలని హెచ్చరించింది. ఈ ల్యాండ్ విషయం కోర్టులో ఉంటే..? నాకేంటీ మీరు ప్రతిదీ ల్యాండ్ పత్రాలు ఎలా తీసుకుంటారో నేను చూస్తాను.నేనెవరికీ భయపడనని ఆమె సదరు రైతు బాధితుడిని హెచ్చరించడం మనకు ఈ వీడియోలో స్పష్టంగా వినిపిస్తోంది.ఇక ట్రైనీ ఐఏఎస్ అధికారిణి శ్రీమతి పూజ తండ్రి రిటైర్డ్ ప్రభుత్వోద్యోగి దీలీప్ ఖేద్కర్. గతంలో తన తండ్రి కూడా కోట్లు విలువైన ఆస్తిని కూడబెట్టారని ఆరోపణలు ఉన్నాయి. పూణేలోని ముల్షి తాలూకాలోని 25 ఎకరాలతో సహా పలు ప్రాంతాల్లో భూమిని బెదిరించి రైతుల నుండి కొనుగోలు చేశారని అక్కడి రైతులు చెబుతున్నారు. శ్రీమతి మనోరమ అత్యున్నత ప్రవర్తనపై రైతులు, పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించగా, వారి గోడును ఎవరుకూడా పట్టించుకోలేదని పోలీసులు ఫిర్యాదు చేసేందుకు నిరాకరించారని వారు ఆరోపించారు. అయితే..శ్రీమతి పూజ ఇప్పుడు సేమ్ టు సేమ్ స్కామ్‌‌లో ఉండటంతో మళ్లీ అలాంటి ఆరోపణలు ఎదుర్కొంటోంది.

ప్రస్తుతం ఈ ఘటనపై పూణే రూరల్ పోలీసులు వీడియో క్లిప్‌ను విచారించాలని నిర్ణయించుకున్నారు. అధికారులు క్లిప్‌ను పరిశీలించారని,కేసు యొక్క వాస్తవాలను నిర్ధారించే పనిలో పడ్డారని ఉన్నతాధికారులు చెప్పారు.శ్రీమతి మనోరమకు తుపాకీని కలిగి ఉండటానికి లైసెన్స్ ఉందా లేదా అనే దానిపై దర్యాప్తు చేస్తామని ఉన్నతాధికారులు చెప్పగా, ఆమె వద్ద తుపాకీ ఉందని ఆమె న్యాయవాది ధృవీకరించారు.వాదన జరిగిన రోజున ఆమె తన భద్రత కోసం దానిని వెంట తీసుకువెళ్లారని సదరు ఆమె తరపు లాయర్ వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఐఏఎస్ కాకముందే ఇన్ని కబ్జాలు చేస్తే ట్రైనింగ్ కంప్లీట్ చేస్తే ఇంకేమన్నా ఉందా తల్లికూతుళ్లు ఈ రాష్ట్రాన్ని దోచుకుతింటారంటూ రకరకాల కామెంట్స్ చేస్తూ ఇద్దరి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలంటే విచారణ జరిపి ఆమెని పర్మినెంట్‌గా విధుల్లో నుంచి తొలగించాలంటూ హైకోర్టు జడ్జికి, ఉన్నతాధికారులకు రైతులు వారి తరపు లాయర్లు కోరుతున్నారు.

Tags

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×