BigTV English

IAS Krishna Teja: ఏపీకి రానున్న ఐఏఎస్ కృష్ణతేజ.. పవర్‌ఫుల్ ఆఫీసర్ అని తెలుసా?

IAS Krishna Teja: ఏపీకి రానున్న ఐఏఎస్ కృష్ణతేజ.. పవర్‌ఫుల్ ఆఫీసర్ అని తెలుసా?

IAS Krishna Teja To AP: ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సమయంలోనే కేరళ కేడర్‌కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ కృష్ణతేజ పేరు తెరపైకి వచ్చింది. త్రిస్సూర్‌ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న ఆయన బాలల రక్షణలో త్రిస్సూర్‌ను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపారు. ఏపీకి చెందిన ఐఏఎస్ అధికారిగా ఆయన చేసిన కృషికి జాతీయ బాల రక్షణ కమిషన్ పురస్కారం వరించింది.ఈ మేరకు డిప్యూటీ సీఎం ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. అప్పటినుంచి ఆయన పేరు మార్మోగుతోంది.


కేరళ కేడర్‌కు చెందిన కృష్ణతేజ.ఏపీకి డిప్యూటేషన్‌పై వస్తారని, కీలక బాధ్యతలు తీసుకుంటారనే ప్రచారం జోరుగా సాగింది. తాజాగా, 2015 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ మైలవరపు కృష్ణతేజను డిప్యూటేషన్‌పై ఏపీకి పంపేందుకు కేంద్రం అమోదముద్ర వేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు సైతం విడుదలయ్యాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఈ మేరకు పంచాయతీ రాజ్ బాధ్యతలను కృష్ణతేజకు అప్పగించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.

ఏపీ ప్రభుత్వం నుంచి అందిన రిక్వెస్ట్ మేరకు కేంద్రం కృష్ణతేజను మూడేళ్ల పాటు ఏపీకి పంపేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం కృష్ణతేజ కేరళలోని త్రిస్సూర్ జిల్లా కలెక్టర్‌గా ఉన్నారు. కాగా, అంతకుముందు సచివాలయంలో డిప్యూటీ సీఎం పవన్‌రల్యాణ్‌తో ఐఏఎస్ కృష్ణతేజ సమావేశమైన సంగతి తెలిసిందే.


Also Read: ఏపీ ప్రజలకు శుభవార్త చెప్పిన కేంద్రమంత్రి.. అనంతపురంలో విమానాశ్రయం

గుంటూరులోని పల్పాడు (డీ) చిలకలూరిపేటకు చెందిన మైలవరపు కృష్ణతేజ 2014 సివిల్స్‌లో 66వ ర్యాంక్ సాధించారు. ఐఏఎస్‌లో చేరిన తర్వాత వెనుకబడిన తరగతుల అభ్యున్నతి, మహిళా సాధికారత, నాణ్యమైన విద్య వంటి అంశాలపై దృష్టి పెట్టారు. ప్రజలకు సేవ చేయడమే తన జీవిత ధ్యేయంగా భావిస్తూ..అందుకు కృషి చేస్తున్నారు. 2018లో కేరళలో వరదలు ప్రళయం సృష్టించిన సమయంలో అలెప్పీ సబ్ కలెక్టర్‌గా ఉన్న కృష్ణతేజ 2.50లక్షలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అలాగే సరస్సును ఆక్రమించి నిర్మించిన 54 ఖరీదైన విల్లాలను నేలమట్టం చేయించారు.

Tags

Related News

AP Railways: ఏపీలో కొత్తగా 11 రైల్వే లైన్లు.. 26 ప్రాజెక్టులు, ఆ శాఖ గ్రీన్ సిగ్నల్

Amaravati News: ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. జగన్ హాజరు‌పై ఉత్కంఠ, సాయంత్రం నిర్ణయం?

Anchor Shyamala: ఏం చెప్పారు శ్యామలగారు.. భూమనను మించిపోయారుగా!

Tirumala News: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ నెల దర్శన కోటా విడుదల వివరాలు ఇవే

Iconic Cable Bridge: కృష్ణానదిపై ఐకానిక్‌ కేబుల్‌ బ్రిడ్జి.. సీఎం చంద్ర‌బాబు అదిరిపోయే ప్లాన్‌

AP Assembly Sessions 2025: రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

AP Liquor Scam: ఏపీ లిక్కర్ కేసు.. తెరపైకి కొత్త పేర్లు, నేతల గుండెల్లో గుబులు

Vivekananda Case: అవినాష్‌రెడ్డి మెడకు ఉచ్చు.. మళ్లీ రంగంలోకి సీబీఐ?

Big Stories

×