BigTV English

Mamata Banerjee : సీపీఎంను క్షమించను.. అందుకే కాంగ్రెస్ తో కటీఫ్..

Mamata Banerjee : సీపీఎంను తాను ఎప్పటికీ క్షమించబోనన్న పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ అన్నారు. కాంగ్రెస్ తన ప్రతిపాదనను తిరస్కరించడం వల్లే రాష్ట్రంలో ఆ పార్టీతో కలిసి పనిచేయడం లేదన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని బలోపేతం చేసేందుకే సీపీఎంతో కలిసి కాంగ్రెస్‌ పనిచేస్తోందని ఆరోపించారు. తాను ప్రతిపాదించిన రెండు స్థానాల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్‌ నిరాకరించడంతోనే రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించామని తెలిపారు.

మూడున్నర దశాబ్దాల పాటు రాష్ట్రాన్ని పాలించిన సీపీఎం.. ప్రజలను ఎంతో వేదనకు గురి చేసిందని మమతా బెనర్జీ విమర్శలు గుప్పించారు. అందుకే ఆ పార్టీని తాను ఎన్నడూ క్షమించనన్నారు. అసెంబ్లీలో కాంగ్రెస్‌ పార్టీకి కనీసం ఒక్క ఎమ్మెల్యే కూడా లేరని మమతా బెనర్జీ అన్నారు. అయినప్పటికీ కాంగ్రెస్ కు రెండు లోక్‌సభ స్థానాలు ఇచ్చేందుకు సిద్ధమయ్యానన్నారు. కానీ, వాళ్లు మరిన్ని కావాలని అడగడంతో ఒక్క సీటు కూడా ఇచ్చేది లేదని తేల్చి చెప్పానన్నారు. రాష్ట్రంలో బీజేపీని రాజకీయంగా ఎదుర్కొనే సామర్థ్యం టీఎంసీకి ఉందని మమతా బెనర్జీ పేర్కొన్నారు.

వివిధ పథకాల కింద కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన పెండింగు బకాయిలపైనా మమతా బెనర్జీ స్పందించారు. రాష్ట్రానికి రూ.7వేల కోట్లు రావాల్సి ఉందని పేర్కొన్నారు. ఆ మొత్తాన్ని ఫిబ్రవరి 1 నాటికి విడుదల చేయకుంటే ధర్నా చేస్తానని ఆమె హెచ్చరించారు. ఉద్యమం ద్వారా తమ వాటాను ఎలా సాధించాలో తనకు తెలుసునన్నారు. ఫిబ్రవరి 2న నిర్వహించే ధర్నాలో అందరూ పాల్గొనాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు మమతా బెనర్జీ పిలుపునిచ్చారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×