BigTV English

Phone : ఓ అబ్బాయిలు.. మొబైల్ ఫోన్ అతిగా వాడితే ‘అది’ మాటష్ అంట..!

Phone : టెక్నాలజీ అభివృద్ది చెందుతుందని సంబరపడాలో.. దాని వల్ల సంభవిస్తున్న దుష్ఫలితాలను చూసి భయపడాలో తెలియని పరిస్థితి మానవుడిది. చిన్న పిల్లాడి నుంచి ముసలాడి వరకు స్మార్ట్ ఫోన్ కామన్. అది లేదంటే రోజంగా బోర్. పూటగడవని పరిస్థితి. గంటలు తరబడి మాట్లాడే యువతీ యువకులు ఫోన్ వలయంలో చిక్కుకుపోతున్నారు. ఫోన్ లేకుంటే శరీరంలో ఒక అవయవం లేనట్లే. కానీ, మొబైల్ అతిగా వాడితే.. ఒక అవయవం పనికిరాకుండా పోతుందట. నమ్మబుద్ధి కావడం లేదా? అయితే నిపుణులు ఏం చెబుతున్నారో చూడండి.

Phone : ఓ అబ్బాయిలు.. మొబైల్ ఫోన్ అతిగా వాడితే ‘అది’ మాటష్ అంట..!

Phone : టెక్నాలజీ అభివృద్ది చెందుతుందని సంబరపడాలో.. దాని వల్ల సంభవిస్తున్న దుష్ఫలితాలను చూసి భయపడాలో తెలియని పరిస్థితి మానవుడిది. చిన్న పిల్లాడి నుంచి ముసలాడి వరకు స్మార్ట్ ఫోన్ కామన్. అది లేదంటే రోజంతా బోర్. పూటగడవని పరిస్థితి. గంటలు తరబడి మాట్లాడే యువతీ యువకులు ఫోన్ వలయంలో చిక్కుకుపోతున్నారు. ఫోన్ లేకుంటే శరీరంలో ఒక అవయవం లేనట్లుగా మారింది. కానీ మొబైల్ అతిగా వాడితే.. ఒక అవయవం పనికిరాకుండా పోతుందట. నమ్మబుద్ధి కావడం లేదా..? అయితే నిపుణులు ఏం చెబుతున్నారో చూడండి.


దక్షిణ కొరియాకు చెందిన స్పెర్మ్ నిపుణులు అలన్ సేఫీ తరచూ ఫోన్లు మాట్లాడే వారిపై, ఫోన్ కింద జేబులో పెట్టుకునే వారిపై, ఫోన్లలో ఆటలాడే వారిపై పరిశోధనలు జరిపారు. ఈ పరిశోధనలు మొత్తం 18 అధ్యయనాల్లో 4,280 స్పెర్మ్ నమూనాలపై చేశారు. ఫోన్ నుంచి విడులయ్యే విద్యుదయస్కాంత తరంగాలు పురుషుల మగతనానికే ప్రమాదమని తేలింది. ఈ తరంగాలు స్పెర్మ్‌ను దెబ్బతీస్తున్నాయి. పురుషులు మగతనాన్ని కోల్పోకూడదంటే ఫోన్ వినియోగాన్ని తగ్గించుకోవాలని సూచించారు.

ఫోన్ అతి వినియోగం పురుషుల స్పెర్మ్‌కు అస్సలు మంచిది కాదు. ముఖ్యంగా మొబైల్ ఫోన్‌ వల్లే వారికి లైంగిక సమస్యలు వస్తున్నాయి. ఫోన్లను జేబుల్లో కాకుండా బ్యాగ్‌లో ఉంచుకోవాలి. సంతాన సమస్యలతో బాధపడుతున్న పురుషులు మొబైల్ వినియోగాన్ని తగ్గించి స్పెర్మ్ నాణ్యతను కాపాడుకోవాలని నిపుణులు చెబుతున్నారు.


పుసాన్ నేషనల్ యూనివర్శిటీకి చెందిన ప్రముఖ పరిశోధకుడు డాక్టర్ యున్ హక్ కిమ్ మాట్లాడుతూ.. ఫోన్ ఉపయోగించే వినియోగదారులు తమ స్పెర్మ్ నాణ్యతను కాపాడుకోవడానికి మొబైల్ ఫోన్ వినియోగాన్ని తగ్గించాలి. ఇప్పుడు ఉన్న ఫోన్ల నుంచి వెలువడే విద్యుదయస్కాంత తరంగాలు స్పెర్మ్ కౌంట్‌పై చూపే ప్రభావంపై గురించి లోతైన పరిశోధన అవసరమని తెలిపారు.

ఈ రోజుల్లో అంతా టైట్ జీన్స్‌నే ఇష్టపడుతున్నారు. ఇది సంతాన సమస్యలను తెచ్చిపెడుతుంది. మీ ఇన్నర్స్ నుంచి ఫ్యాంట్ల వరకు ప్రతిదీ వదులుగా ఉండేలా చూసుకోండి. గాలి ఆడకపోవడం వల్ల వీర్య కణాల నాణ్యత తగ్గిపోతుంది. టైట్‌గా ఉండే దుస్తులను ధరించడం వల్ల వృషణాలలో ఏర్పడే వేడి బయటకు వెళ్లలేదు. కాటన్‌తో తయారు చేసిన ఇన్నర్స్, ఫ్యాంట్స్ లేదా షార్ట్స్‌ను మాత్రమే ధరించండి.

వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఈ రోజుల్లో అంతా ఎక్కువ సేపు కూర్చొని వర్క్ చేస్తున్నారు. ఉన్న ప్లేస్ నుంచి కదలకుండా ఒకే చోటులో దొర్లుతున్నారు. ఇది కూడా స్పెర్మ్ నాణ్యతను ప్రభావితం చేస్తుంది. ఒకే చోట కూర్చోవడం వల్ల మర్మాంగాల వద్ద వేడి పెరుగుతుంది. దీనివల్ల వీర్య కణాలను ఉత్పత్తి చేసే వృషణాలు వేడెక్కుతాయి. కాబట్టి ఎక్కువసేపు కూర్చోకుండా.. మధ్య మధ్యలో అటూ ఇటూ తిరగండి.

ఐటీ, మీడియా తదితర రంగాల్లో పనిచేసే ఉద్యోగులు ల్యాప్‌టాప్‌ల్లోనే పనిచేస్తున్నారు. చాలా మందికి ల్యాప్‌టాప్‌లను ఒడిలో పెట్టుకుని పనిచేయడం అలవాటుగా మారింది. ల్యాప్ టాప్‌లో నుంచి విడుదలయ్యే వేడిగాలి నేరుగా వృషణాలను తాకుతుంది. దీని కారణంగా స్పెర్మ్ దెబ్బ తింటుంది. అలానే వంట చేస్తున్నప్పుడు స్టవ్ నుంచి ఉత్పత్తయ్యే వేడి, జిరాక్స్ లేదా ఫొటోస్టాట్‌ల వద్ద నిలుచోవడం కూడా అంత మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్లాస్టిక్ వస్తువుల తేలికైనవని, చౌకగా లభిస్తాయని వాటిని ఎక్కువగా వినియోగిస్తున్నారు. తినే ఆహారాన్ని కూడా ప్లాస్టిక్ పాత్రల్లోనే నిలువ ఉంచుతున్నారు. ప్లాస్టిక్ వాడకం పురుషాంగాన్ని దెబ్బతీస్తాయి. ఎందుకంటే అవి ఈస్ట్రోజెన్‌లా పనిచేస్తాయి. ఆహారాన్ని మంటపై వేడి చేస్తున్నప్పుడు క్లాంగ్ ఫిల్మ్‌ని ఉపయోగించకూడదు.

ప్లాస్టిక్‌ పాత్రలో ఆహారాన్ని అస్సలు వేడి చేయొద్దు.ఈ వేడి వల్ల వాటిలోని రసాయనాలు మీ ఆహారంలోకి ప్రవేశిస్తాయి. ప్లాస్టిక్‌కు బదులుగా గాజు లేదా స్టెయిన్‌లెస్ స్టీల్ కంటైనర్‌లలో ఆహారాన్ని నిల్వ చేయండి. ప్లాస్టిక్ వాటర్ బాటిల్ కూడా వాడొద్దు.

ధూమపానం వల్ల స్పెర్మ్‌లోని జన్యు పదార్థం దెబ్బతింటుంది. ధూమపానం వల్ల గర్భస్రావం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ ఆల్కహాల్ తాగే వారి శరీరంలో వేడి పెరుగుతుంది.ఇది స్పెర్మ్ ఉత్పత్తిపై ప్రభావం చూపుతుంది. ఈస్ట్రోజెన్ స్థాయిలతో అసమతుల్యత ఏర్పడుతుంది. టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గిపోతాయి.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×