E-Paper
Advertisement

Prasanth varma: ప్రశాంత్ వర్మకు రూ.1000 కోట్ల ఆఫర్.. కానీ..!

Prasanth varma: ప్రశాంత్ వర్మకు రూ.1000 కోట్ల ఆఫర్.. కానీ..!
Advertisement

Prasanth varma: ‘హనుమాన్’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఈ మూవీతో ఆయన పేరు ప్రతీ భాషలోనూ మారుమోగిపోతోంది. కేవలం రూ.40 కోట్ల బడ్జెట్‌తో సినిమాను తెరకెక్కించి దాదాపు రూ.250 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చేలా చేశాడు. ఆయన క్రియేటివిటీకి సినీ ప్రియులు మంత్రముగ్దులయ్యారు. సినిమా వీక్షించినవారంతా.. ఇంత చిన్న బడ్జెట్‌లో వండర్‌ ఫుల్‌గా గ్రాఫిక్స్ ఎలా తీయగలిగారు అంటూ ప్రశాంత్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

దీంతో అతడి చేతిలో ఏదో తెలియని మేజిక్ ఉందని.. దానిని క్యాష్ చేసుకునేందుకు చాలా మంది చూస్తున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు ఆయన వద్దకు చాలా ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. వంద, రెండు వందల కోట్ల బడ్జెట్‌ పెట్టి ఆయనతో సినిమా తీయాలని చూస్తున్నారట. ఇలాంటి సమయంలోనే ఎవరూ ఊహించని ఒక ఆఫర్ ఆయన వద్దకు వచ్చినట్లు తెలుస్తోంది.

Advertisement

సినిమా తీస్తే వెయ్యి కోట్ల బడ్జెట్ పెడతానంటూ దర్శకుడు ప్రశాంత్‌కు ఓ ఆఫర్ వచ్చిందట. ఈ విషయాన్ని అతడే స్వయంగా బయటపెట్టాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అతడు మాట్లాడుతూ.. తనకు వంద కోట్లు, రెండు వందల కోట్లు ఆఫర్లు ఉన్నాయని అన్నాడు. అయితే మొన్న ఒక వ్యక్తి ఏకంగా వెయ్యి కోట్లు ఆఫర్ చేశారని తెలిపాడు. హనుమాన్ మూవీ చూసిన ఓ ఎన్నారై వైద్యుడు తనకు ఈ ఆఫర్ ఇచ్చినట్లు చెప్పాడు. ‘‘మన ఇతిహాసాన్ని ఇలా చెబితే కనుక రేపు పొద్దునే వెయ్యి కోట్లు పంపిస్తాను.. సినిమా చేయమని ఆఫర్ ఇచ్చారు’’ అని తెలిపాడు.

అయితే ఇక్కడ ఎంత పెడుతున్నామో ముఖ్యం కాదని.. పెట్టిన పెట్టుబడికి క్వాలిటీ చూపించామా లేదా అనేదే ముఖ్యం అని అన్నాడు. ఈ మేరకు తనకు రూ.30 కోట్ల బడ్జెట్ ఇస్తే.. దాన్ని రూ.50 కోట్ల సినిమాగా మలుస్తానని.. రూ.50 కోట్ల బడ్జెట్ ఇస్తే.. రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాగా తయారుచేస్తానని ప్రశాంత్ అంటున్నాడు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×