BigTV English

Madhya Pradesh : దేవాలయంలో ఓ వ్యక్తి ఆత్మహత్య.. మధ్యప్రదేశ్‌‌లో కలకలం..

Madhya Pradesh : దేవాలయంలో ఓ వ్యక్తి ఆత్మహత్య.. మధ్యప్రదేశ్‌‌లో కలకలం..

Madhya Pradesh : దేవాలయంలో ఓ భక్తుడు గొంతుకోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లోని మహర్‌ జిల్లా కేంద్రంలో కలకలం సృష్టించింది. దేవాలయంలో మృతి చెందిన వ్యక్తిని ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ జిల్లాకు చెందిన లల్లారామ్‌(37)గా గుర్తించారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహర్‌ జిల్లా కేంద్రంలోని ఓ కొండపై శారదా మాతా దేవాలయం ఉంది. సోమవారం రాత్రి లల్లారామ్‌ ఒంటిరిగా దేవాలయనికి చేరుకుని.. తన వద్ద ఉన్న కత్తితో గొంతుకోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

దేవాలయంలో ఓ వ్యక్తి రక్తపు మడుగులో ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. అక్కడున్న పరిస్థితుల ఆధారంగా లల్లారామ్ గొంతు కోసుకొని బలవన్మరణం చెందినట్లు నిర్ధారించారు. అయితే ఈ ఘటనను ఎవరూ గమణించలేదని మహర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌ఛార్జి అనిమేష్‌ ద్వివేది తెలిపారు.


దేవాలయంలో అతడు పడి ఉన్న కొంచెం దూరంలో కత్తిని గుర్తించామని పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.ఈ దేవాలయంలో గతంలో కొందరు భక్తులు తమ నాలుకను కోసుకునేందుకు కూడా ప్రయత్నించిన సందర్భాలు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ దేవాలయానికి నిత్యం వందలాది మంది భక్తులు వస్తుంటారని స్థానికులు పేర్కొన్నారు.

Related News

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Tamilnadu Crime: రాజకీయ నేత ఫామ్‌హౌస్.. ఎస్ఐని చంపేశారు, ఏం జరిగింది?

Karimnagar Crime: యూట్యూబ్ చూసి డైరెక్షన్ ఇచ్చింది.. పనంతా ప్రియుడు చేశాడు, చివరకు ఏమైంది?

Big Stories

×