BigTV English

Supreme Court : చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై ఉత్కంఠ.. నేడే కీలక తీర్పు..

Supreme Court : ఇవాళ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువడనుంది. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం ఇవ్వనున్న తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. స్కిల్ స్కాం కేసులో తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని కోరుతూ చంద్రబాబు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై అక్టోబర్ 20న సుప్రీంకోర్టు తుది విచారణ జరిపి తీర్పును జనవరి 16కు వాయిదా వేసింది.

స్కిల్‌ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. ఆ తర్వాత చంద్రబాబుపై సీఐడీ పలు కేసులు నమోదు చేసింది. అయితే తన కేసుల విషయంలో సీఐడీ నిబంధనలు పాటించలేదని చంద్రబాబు క్వాష్ పిటిషన్ వేశారు. 17ఏ ప్రకారం కేసు నమోదు చేయాలంటే.. గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని చంద్రబాబు తరుఫు న్యాయవాదలు కోర్టుకు తెలిపారు. కానీ.. సీఐడీ గవర్నర్ అనుమతి తీసుకోలేదని వివరించారు. నిబంధనలకు విరుద్దంగా ఉన్న ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ రద్దు చేయాలని కోరారు.

అయితే.. సీఐడీ వాదనలు మాత్రం మరోలా ఉన్నాయి. 2021 సెప్టెంబరు 3న జారీ అయిన సర్క్యులర్‌ ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోవాలని సీఐడీ చెబుతోంది. కానీ.. 2017లోనే స్కిల్ స్కాం జరిగిందని.. కేసు కూడా అంతకంటే ముందే నమోదైందని తెలిపింది. అంటే.. సర్క్యూలర్ వచ్చిన తర్వాత నమోదైన కేసులకు, వెలుగుచూసిన స్కాములకు మాత్రమే ఈ నిబందనలు వర్తిస్తాయని ప్రభుత్వం తరుఫు న్యాయవాదులు చెబుతున్నారు. ఏదేమైనా.. ఈ కేసులో తీర్పు కోసం దేశవ్యాప్తంగా రాజకీయ నేతలు ఉత్కంఠగా ఎందురు చేస్తున్నారు. ఈ కేసులో తీర్పు ప్రభావం భవిష్యత్ లో మరిన్ని కేసులపై పడనుంది.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×