E-Paper
Advertisement

Marriage: షాంపూ బాలేదని.. పెళ్లి క్యాన్సిల్! ఇదేమి చోద్యం!!

Marriage: షాంపూ బాలేదని.. పెళ్లి క్యాన్సిల్! ఇదేమి చోద్యం!!
Advertisement

Marriage: ఓ చిన్న షాంపూ.. ఏకంగా పెళ్లినే క్యాన్సిల్ చేయించింది. విషయం పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లేలా చేసింది. షాంపూనే కదా అని లైట్ తీసుకుంటే.. రెండు కుటుంబాల్లో పెద్ద చిచ్చే పెట్టింది. లేటెస్ట్ జనరేషనల్ మైండ్ సెట్ ఎలా ఉందో.. చిన్నచిన్న విషయాలకే వారెంత విపరీత నిర్ణయాలు తీసుకుంటున్నారో చెప్పేందుకు ఈ సంఘటన ఓ బెస్ట్ ఎగ్జాంపుల్ గా నిలుస్తోంది.

ఆ ఇద్దరికి పెళ్లి కుదిరింది. మర్నాడు వివాహం జరగాల్సి ఉంది. ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి. పెళ్లికి ముందు కార్యక్రమాలు జోరందుకున్నాయి. వాళ్ల సంప్రదాయం ప్రకారం.. పెళ్లికొడుకు ఇంటి నుంచి పెళ్లి కూతురుకు కొన్ని కానుకలు పంపించారు. అందులోని ఓ కానుకే కొంపముంచింది. వారి పెళ్లి క్యాన్సిల్ కావడానికి కారణమైంది.

Advertisement

వరుడు పంపించిన కారుకలో ఓ షాంపు కూడా ఉందట. అయితే, అది మరీ తక్కువ ధర షాంపు కావడంతో.. వధువుకు చిర్రెత్తుకొచ్చింది. మరీ ఇంత చీప్ షాంపూ పంపిస్తారా అనుకొని.. ”నీ స్థాయి ఇంతేనా?” అంటూ కాబోయే వాడికి వాట్సాప్ లో మెసేజ్ చేసింది. ఇక అంతే. అతగాడు షాక్.

వామ్మో.. ఇప్పుడే ఇలా ఉంటే.. షాంపూకే ఇంత స్ట్రాంగ్ మెసేజ్ పెడితే.. ముందుముందు ఆమెతో మరింత ఇబ్బంది తప్పదేమోనని భయపడిపోయాడు. కాస్త ఆలోచించి.. పెళ్లి క్యాన్సిల్ అనేశాడు. తనకీ పెళ్లి ఇష్టం లేదంటూ.. అమ్మాయి తరఫు వాళ్లకు చెప్పేశాడు. ఈసారి వాళ్లు షాక్.

Advertisement

అదేంటి. షాంపూ బాలేదు అన్నందుకే పెళ్లి రద్దు చేసుకుంటారా? అంటూ వధువు తరఫు వాళ్లు వరుడి ఇంటికి రాయబారానికి వెళ్లారు. పెళ్లికొడుక్కి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే, అతను ఒక్కసారి కమిట్ అయితే తనమాట తానే విననన్నాడు. ఆమెను ఎట్టిపరిస్థితుల్లోనూ పెళ్లి చేసుకోవద్దని.. చేసుకుంటే తన బతుకు బస్టాండే అవుతుందని.. చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడు. అదే విషయం వధువు కుటుంబ సభ్యులకు తేల్చి చెప్పాడు. వాళ్లు ఎంత నచ్చజెప్పాలని చూసినా అతను తగ్గేదేలే అన్నాడు. దీంతో, మేటర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. అక్కడా వరుడు పెళ్లికి ససేమిరా అన్నాడు.

ఈ ఘటన ఈనెల 14న.. అస్సోం రాష్ట్రంలో జరిగింది. విషయం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది. పెళ్లి కొడుకు నిర్ణయానికి చాలామంది నెటిజన్లు మద్దతు పలుకుతున్నారు. రైట్ డెసిషన్ బ్రో.. బతికిపోయావుపో.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. షాంపూ కోసమే పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటావా.. ఆ అమ్మాయి ఏమైపోవాలి? నీ నిర్ణయం తప్పు.. అంటూ మరికొందరు వరుడిని తప్పుబడుతున్నారు.

Tags

Related News

పిల్లలకు పుట్టినరోజు బహుమతులు ఇవ్వడమే కాదు.. జీవితాంతం గుర్తుండిపోయేలా ఈ 7 అలవాట్లు నేర్పండి

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Big Stories

Advertisement
×