E-Paper
Advertisement

Masood Azhar: 1000 మందికి పైగా సూసైడ్ బాంబర్లతో మేం దాడికి సిద్ధం.. ఇండియాకు మసూద్ వార్నింగ్

Masood Azhar: 1000 మందికి పైగా సూసైడ్ బాంబర్లతో మేం దాడికి సిద్ధం.. ఇండియాకు మసూద్ వార్నింగ్
Advertisement

Masood Azhar:  ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య గొడవలు కాస్త చల్లబడ్డాయి. ఇప్పుడిప్పుడే బార్డర్ లో పరిస్థితులు మెరుగు పడుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ ప్రమాదకరమైన తీవ్రవాది, జైషే మహమ్మద్ సంస్థ చీఫ్‌ మసూద్ అజర్ ( Masood Azhar ) సంచలన వార్నింగ్ ఇచ్చాడు. ఇండియాపై దాడి చేయబోతున్నట్లు వార్నింగ్ బెల్స్ పంపించాడు. ఒకరిద్దరూ కాదు, వందలు కాదు.. వేల మంది మానవ బాంబర్లు సిద్ధంగా ఉన్నారని ఇండియాకు హెచ్చరికలు పంపాడు తీవ్రవాది మసూద్ అజర్. ఈ మేరకు ఈ పాకిస్తాన్ దుర్మార్గుడు మసూద్ అజర్ మాట్లాడిన మాటలకు సంబంధించిన ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇండియా పై దాడికి సిద్ధమవుతున్నట్లు మసూద్ అజర్ ఈ ఆడియోలో మాట్లాడినట్లు స్పష్టంగా ఉంది. ఈ ఆడియో బయటకు రావడంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయినట్లు తెలుస్తోంది.

Also Read: Lizelle Lee: 100 కేజీల బ‌రువు, ద‌క్షిణాఫ్రికాకు రిటైర్మెంట్‌..కానీ WPL 2026లో క‌ళ్లు చెదిరే క్యాచ్‌..ఎవ‌రీ లిజెల్ లీ

వేలమంది మానవ బాంబ‌ర్లు సిద్ధం..మసూద్ అజర్ ఆడియో లీక్

Advertisement

పహల్గాం సంఘటన జరిగిన తర్వాత ఆపరేషన్ సిందూర్‌ పేరుతో పాకిస్తాన్ దేశానికి చుక్కలు చూపించింది ఇండియన్ ఆర్మీ. అయితే ఈ సంఘటన జరిగి దాదాపు 7 నెలలు కావస్తోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అల్లర్లు ఇండియాలో లేవు. ఇలాంటి నేపథ్యంలో రిపబ్లిక్ డే వస్తోన్న‌ నేపథ్యంలో షాకింగ్ ఆడియో బయటకు వచ్చింది. 1000 మంది కంటే ఎక్కువ మానవ బాంబర్లతో ఇండియా పై దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు మసూద్ అజర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తమ దగ్గర 1000 కంటే ఎక్కువ మానవ బాంబర్లు ఉన్నారని.. ఆ సంఖ్య చెబితే ప్రపంచ మీడియా కూడా గజగజ వణికి పోతుందని బాంబు పేల్చాడు మసూద్ అజర్. తమ లక్ష్యం నెరవేర్చుకునేందుకు.. ఎంతమందైనా ఆత్మ బలిదానం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నాడు.

వాళ్లను చాలా కష్టపడి సిద్ధం చేసినట్లు కూడా వివరించాడు మసూద్ అజర్. ఏ క్షణమైన ఇండియా పైన దాడి చేస్తామని వార్నింగ్ ఇచ్చాడు మసూద్ అజర్. అయితే ఈ ఆడియో బయటకు రావడంతో రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. ఇది నిజమైన ఆడియో నా ? లేదా గతంలో మసూద్ అజర్ మాట్లాడిన ఆడియోను ఇప్పుడు వైరల్ చేస్తున్నారా ? తాజాగా మాట్లాడినవా ? అనే కోణంలో భారత సర్కార్ ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. 2019 నుంచి మసూద్ అజర్ బయట అస్సలు కనిపించలేదు. అసలు వాడు ఎక్కడ ఉన్నది కూడా.. తెలియదు. ఉన్నాడా ? లేక ఆపరేషన్ సిందూర్‌ సమయంలో చనిపోయాడా ? అనే విషయంపై క్లారిటీ లేదు. కానీ ఆడియో మాత్రం బయటకు వచ్చింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయి, విచారణ చేయిస్తోంది.

పార్ల‌మెంట్‌, ముంబై దాడుల‌కు సూత్ర‌ధారి

Advertisement

జైషే మహమ్మద్ సంస్థ చీఫ్‌ మసూద్ అజర్ ( Masood Azhar ) అంతర్జాతీయ ఉగ్రవాది అన్న సంగతి తెలిసిందే. 2001 సంవత్సరంలో ఇండియాలోని పార్లమెంట్ పై దాడి జరిగిన సంగతి గుర్తుండే ఉంటుంది. అలాగే 2008లో ముంబై దాడులు జరిగాయి. ఈ రెండు సంఘటనలకు సూత్రధారి మసూద్ అజర్. జైషే మహమ్మద్ సంస్థను వీడే నడిపిస్తున్నాడు. అంతేకాదు ఇటీవల కాలంలో ఇండియాలో జరిగిన బ్లాస్టింగ్స్ కు కూడా వీడే కారణమని చెబుతున్నారు పోలీసులు.

Also Read: BCCI-Bangladesh: బంగ్లాదేశ్ జ‌ట్టులో చీలిక‌, శ‌త్రువులో జ‌ట్టులో “ఇండియన్ ఏజెంట్”..త‌ల‌ప‌ట్టుకుంటోన్న BCB

 

 

Related News

ఆసుపత్రి నుంచే సోనమ్ వాంగ్‌చుక్ సంచలన లేఖ.. ఢిల్లీ హైకోర్టులో ఊరట దక్కకపోవడంతో కీలక మలుపు!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

వానల కోసం సరికొత్త పూజ.. వర్షాలు కురవాలని గాడిదలకు స్వీట్లు తినిపించిన స్థానికులు!

జపాన్‌లో వర్క్ కల్చర్.. ఓ భారతీయుడి కీలక వ్యాఖ్యలు, వీకెండ్స్‌లో అయితే

అమర్‌నాథ్-వైష్ణోదేవి యాత్రలకు తాత్కాలికంగా బ్రేక్.. బేస్ క్యాంపుల ఆగిన యాత్రికులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×