E-Paper
Advertisement

Mana Shankara Vara Prasad Garu Movie Review : మన శంకర వరప్రసాద్ గారు రివ్యూ : ఇదో మిక్స్డ్ జ్యూస్

Mana Shankara Vara Prasad Garu Movie Review : మన శంకర వరప్రసాద్ గారు రివ్యూ : ఇదో మిక్స్డ్ జ్యూస్
Advertisement

Mana Shankara Vara Prasad Garu Movie Review : భోళా శంకర్ వంటి అల్ట్రా డిజాస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర చేశారు. అది బిజినెస్ అవ్వక రిలీజ్ కి నోచుకోలేదు. దీంతో హిట్ మిషన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ అనే ఫ్యామిలీ అండ్ మాస్ ఎంటర్టైనర్ చేశారు. ఇది హిట్ అయితే విశ్వంభర సినిమాకి కూడా మంచి బిజినెస్ జరిగి రిలీజ్ చేసుకోవచ్చు అనేది చిరు ప్లాన్. మరి ఆయన స్కెచ్ ఎంత వరకు వర్కౌట్ అయ్యిందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ :

శంకర వర ప్రసాద్( చిరంజీవి) ప్రధాన మంత్రి దగ్గర పనిచేసే నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్. ఎంత పెద్ద ప్రమాదం వచ్చినా ఎదురెళ్లి ఫైట్ చేసి.. తనను నమ్ముకున్న వాళ్ళను కాపాడుకుంటాడు. అయితే అతని మనసులో ఒక బాధ ఉంటుంది. అదే అతని ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అవ్వడం. భార్య శశిరేఖ( నయనతార) శంకర్ కి విడాకులు ఇచ్చేసి.. పిల్లలకి కూడా అతన్ని దూరం చేస్తుంది. దీంతో అతను తన తల్లి దగ్గరే ఉంటాడు.

Advertisement

వీళ్లిద్దరూ విడిపోవడానికి కారణం అతని మామగారు జీవీఆర్( సచిన్ కేడేకర్). ఒకరోజు అనుకోకుండా జీవీఆర్ పై పెద్ద ఎటాక్ జరుగుతుంది. దీంతో హై ఎండ్ సెక్యూరిటీ కావాలని సెంట్రల్ గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేస్తుంది శశిరేఖ. దీంతో శంకర్ వరప్రసాద్ అండ్ టీమ్ ను అపాయింట్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. అసలు శంకర్ ప్రసాద్, శశిరేఖ ఎందుకు విడిపోయారు.? జీవిఆర్ పై ఎటాక్ చేసింది ఎవరు? చివరికి శశి , శంకర్ కలిసారా? ఈ ప్రశ్నలకి సమాధానమే మిగిలిన సినిమా.

విశ్లేషణ :

దర్శకుడు అనిల్ రావిపూడికి ఒక సెపరేట్ స్టైల్ ఉంటుంది. అలా అని హీరో ఇమేజ్ ని సైడ్ ట్రాక్ చేయడు. హీరోకి ఉన్న ప్లస్సులను తీసుకుని తన మార్క్ తో కథ అల్లడం అతనికి అలవాటు. మన శంకర వరప్రసాద్ విషయంలో కూడా అతను చేసింది అదే. చిరుకి భీభత్సమైన కామెడీ టైమింగ్ ఉంది. చంటబ్బాయ్ వంటి సినిమాలకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. దానినే మన శంకర వరప్రసాద్ లో వాడుకున్నాడు. అలా అని చిరు మాస్ ఇమేజ్ ను సైడ్ చేయలేదు. కాకపోతే ఇలాంటి కథ గతంలో చిరు చేయలేదా? అంటే చేశారు అని నిస్సందేహంగా చెప్పొచ్చు.

Advertisement

డాడీ కథనే అటు తిప్పి .. ఇటు తిప్పి తీశాడు. వాస్తవానికి అదే కథతో వెంకటేష్ తులసి చేశాడు, అజిత్ విశ్వాసం కూడా చేశాడు. ఆ 3 కలిపితే మన శంకర వరప్రసాద్ గారు అనడంలో సందేహం లేదు. ఫస్ట్ హాఫ్ లెంగ్తి గానే ఉంది. ఒకదశలో జబర్దస్త్ లో గెటప్ శీను చిరు స్కిట్లు చేస్తున్నాడు అనే ఫీలింగ్ కలిగినా ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే సెకండాఫ్ లో కొన్ని సీన్లు వర్కౌట్ అయ్యాయి.

ముఖ్యంగా హీరో తల్లి .. కోడలితో ఆప్యాయంగా మాట్లాడుతూ భార్యాభర్తల బంధం గురించి చెప్పే సన్నివేశాన్ని అనిల్ బాగా రాసుకున్నాడు.సినిమాని సేఫ్ చేసింది ఆ సీనే అనిపించొచ్చు కూడా . ఆ తర్వాత స్క్రీన్ ప్లే డల్ అవ్వకుండా వెంకటేష్ ను దించారు. క్లైమాక్స్ బోర్ కొట్టకుండా వెళ్ళిపోయింది.

నటీనటులు విషయానికి వస్తే.. చిరు లుక్స్ ఈ మధ్యకాలంలో బెటర్ గా ఉన్నది ఈ సినిమాలోనే. నయనతార విశ్వాసం, తులసి సినిమాలో చేసిన పాత్రనే ఈ సినిమాలో కూడా చేసింది. సచిన్ కేడేకర్ తన స్థాయికి తగ్గ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. వెంకీ కేమియో ఓకే. కేథరిన్, హర్షవర్ధన్, అభినవ్ గోమటం వంటి వాళ్లు కొంత కామెడీ పండించారు.

ప్లస్ పాయింట్స్ :

చిరు కామెడీ & గ్రెస్
పర్వలేదు అనిపించే ఫస్టాఫ్‌
మ్యూజిక్ & పాటలు & డ్యాన్స్

మైనస్ పాయింట్స్ :

రన్ టైమ్
రొటిన్ సెకండాఫ్
సాగదీసే కామెడీ సీన్స్
ఇంపాక్ట్ చేయని వెంకీ క్యామియే

మొత్తంగా ‘ మన శంకర వరప్రసాద్ గారు ‘ .. పండక్కి ఫ్యామిలీస్ ఎంజాయ్ చేసే అవకాశం ఉంది. జస్ట్ ఒకే.

Mana Shankara Vara Prasad Garu Rating : 2.25/5

Related News

Romanchakam Review : ‘రోమాంచకం’.. నవ్వుల ప్రయాణం..

సుమంత్ ప్రభాస్ ‘రోమాంచకం’ ట్విట్టర్ రివ్యూ..

‘కికు చిరంజీవి’ మూవీ రివ్యూ.. గుండె కుడివైపు ఉంటే.. రహస్యం ఎటువైపు దారితీసింది?

టాక్సిక్’ రివ్యూ.. గీత దాటలేదు, కానీ ఓపిక మాత్రం దాటింది!”

ది రెడ్ బ్యాగ్ మూవీ రివ్యూ.. క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా?

అమీర్ లోగ్ మూవీ రివ్యూ.. పాతబస్తీ గల్లీ స్నేహం వర్కౌట్ అయ్యిందా?

రవితేజ ‘ఇరుముడి’ రివ్యూ.. అయ్యప్పమాల కలిసొచ్చిందా?

పళ్ళ బురుసు మూవీ రివ్యూ..చిన్న బ్రష్.. పెద్ద గొడవ.. అసలు కథ ఏంటంటే?

Big Stories

Advertisement
×