BigTV English

Fire Accidents : వరుస అగ్నిప్రమాదాలు..11 మంది మృతి

Fire Accidents : వరుస అగ్నిప్రమాదాలు..11 మంది మృతి

Fire Accidents : దేశంలోని మహానగరాల్లో వరుస అగ్ని ప్రమాదాలు సంభవించాయి. ముంబై, అమృత్‌సర్‌తోపాటు కాన్పూర్‌లోనూ భారీ అగ్ని ప్రమాదాలు జరిగాయి. ముంబై ప్రమాద ఘటనలో ఏడుగురు మృతి చెందగా.. అమృత్‌సర్‌ లో జరిగిన అగ్ని ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడ్డారు.


అమృత్‌సర్‌ లోని ఓ ఫార్మాస్యూటికల్‌ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రసాయనాలు పెద్ద ఎత్తున ఉండటంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. మరి కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. భారీ అగ్ని ప్రమాదంతో అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడి భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. కాగా.. ప్రమాదంలో ఫ్యాక్టరీలోని లక్షలాది రూపాయల విలువైన యంత్రాలు దగ్ధమయ్యాయి. దీంతో భారీగా ఆస్తి నష్టం కూడా సంభవించింది.

యూపీలోని కాన్పూర్‌ భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆర్మీ గోదాంలో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసినప్పటికీ గోదాం పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు.


Related News

Air India: మరో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. ఫ్లైట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Big Stories

×