Intinti Ramayanam Today Episode November 20th : మీరందరూ బాధపడకండి ముందు అన్నం తినండి అని కమల్ అందరికీ అన్నం వడ్డించి వదినా అని అవనితో చెప్తాడు. అయితే అప్పుడే రమ్య చాలా సంతోషంగా ఉన్న సమయంలో ఫోన్ చేసి అర్జెంటుగా నేను కలవాలి ఒక లొకేషన్ పంపిస్తాను రండి అని అంటుంది. రమ్యకి ఏదో కష్టం వచ్చినట్లుంది అర్జెంటుగా రమ్మని ఫోన్ చేసింది అని కమల్ చెప్పగానే ఇంట్లోని వాళ్ళందరూ కూడా టెన్షన్ పడిపోతూ ఉంటారు. అయితే ప్రమ్యూని కలవడానికి కమల్ నేను ఒక్కడినే వెళ్తాను అని చెప్పినప్పుడు ఇంట్లోని వాళ్ళందరూ కూడా చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. నేను ఏదైనా సమస్య ఉంటే ఫోన్ చేస్తాను మీరు అప్పుడు రండి అని కమల్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు..
రమ్య ఫోన్ చేసినా లొకేషన్ కి కమల్ వెళ్తాడు. ఏమైంది ఎందుకు నన్ను అర్జెంట్ కదా మనో ఏదైనా సమస్యలో ఉన్నావా అని కమల్ అడుగుతాడు. అయితే కమల్ నేను పిలిస్తే రావు కదా నీకు సర్ప్రైజ్ ఇద్దామని నేను వచ్చాను అని అనగానే కమల్ మొదట షాక్అయిన కూడా తనిచ్చిన బొకేతో సర్ప్రైజ్ గా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత రమ్య కేక్ కట్ చేయించడంతో కమల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కమల్ వెళ్లి చాలాసేపు అయింది ఇంకా రాలేదు అని ఇంట్లోని వాళ్ళందరూ కంగారు పడిపోతుంటారు. అప్పుడే కమల్ ఇంట్లోకి చాలా సంతోషంగా రావడం చూసి అందరూ చాలా హ్యాపీగా ఉంటారు.
రమ్యకి ఏదో అయిపోయిందని వెళ్ళిన కమల్ ఇంకా రాలేదేంటి అని అటు అక్షయ్ అవని ఇద్దరూ టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇక అప్పుడే కమల్ ఇంట్లోకి రావడం చూసి కమల్ వచ్చేసాడండి అసలేం జరిగిందో అతనే అడిగి తెలుసుకుందాం పదండి అని అంటుంది. కానీ కమల్ మాత్రం చాలా సంతోషంగా ఇంటికి రావడం చూసి ఏంట్రా అంత సంతోషంగా ఉన్నావు అని అక్షయ్ అడుగుతాడు. అయితే అక్షయ్ అలా అడగ్గానే నేను చాలా సంతోషంగా ఉన్నాను అన్నయ్య అని కమల్ అంటాడు ఆ మాట వినగానే అవని అక్షి ఇద్దరు కూడా షాక్ అవుతారు ఏంటి కన్నయ్య నువ్వు చెప్పేది రమ్యకేదో ప్రాబ్లం అని వెళ్లావు కదా.. ఇప్పుడు సంతోషంగా ఉన్నాను అని అంటున్నావు ఏం జరిగింది అని అవని అడుగుతుంది. రమ్య నాకు మర్చిపోలేని సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది వదిన నా బర్త్ డే ని సెలబ్రేట్ చేసింది అని చెప్పగానే చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది అవని..
ఉదయం తనని కాపాడినందుకు ఇప్పుడు నా బర్త్ డే అని తెలుసుకుంది కాబట్టి సర్ప్రైజ్ గా కేక్ కటింగ్ కోసమని పిలిచింది ఉదయం నేను ఎంత బాధ పడిపోదు ఉన్నానో ఇప్పుడు ఆ బాధంతా పోయి నేను చాలా సంతోషంగా ఉన్నాను అదంతా రమ్య వల్లే చాలా సింపుల్గా బర్త్డేని సెలబ్రేట్ చేసినా కూడా తన అలా ఎగురుతూ బర్త్డే చెప్పడం నాకు చాలా బాగా నచ్చిందని కమల్ అంటాడు.. నిజంగానే రమ్య వల్ల కన్నయ్య చాలా సంతోషంగా ఉన్నాడు అని అవని కూడా సంతోషపడుతుంది. ఇక అక్షయ్ నా తమ్ముడు సంతోషంగా ఉన్నాడు అంటే నేను కూడా సంతోషంగా ఉండాలి కదా అని అవని లోపలికి తీసుకొని వెళ్తాడు వీళ్లిద్దరి రొమాన్స్ ఎపిసోడ్ కి హైలైట్ గా నిలుస్తుంది.
ఉదయం లేవగానే అవని అందరికీ కాఫీ ఇస్తూ ఉంటుంది. అయితే శ్రీకర్ కి కాఫీ అడిగితే లేదు వదినా కోర్టుకు వెళ్లాలి అని చెప్తాడు. ఏమైంది ఎందుకు అని అడిగితే కమల్ కేసు ఇవాళ ఇయర్ కి వచ్చింది.. నాకు ముందే తెలుసు అయితే వాడి బర్త్డే మూడు పాడవుతుంది అని నేను చెప్పలేదు అని శ్రీకర్ అంటాడు. సరే మనం పల్లవి వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డామో ఇకమీదట ఎలాంటి ఇబ్బందులు పెడుతుంది అని నాకు కంగారుగా ఉంది అని పార్వతి కంగారు పడిపోతూ ఉంటుంది. కానీ కమల్ మాత్రం మీరు ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇవాళ విడాకులు తీసుకుని వస్తాను అని అందరితో చాలెంజ్ చేస్తాడు అయితే ఇంకా అందరూ కలిసి కోర్టుకు వెళ్తారు. ఇకపోతే అటు పల్లవి కూడా కోర్టులో నాకు ఏ రంగు ఉంది అని చెప్పిన ఎవరు పట్టించుకోరు. మొత్తానికి పల్లవి ఎలాగైనా సరే విడాకులు తీసుకోకుండా ఇంట్లో మళ్ళీ అడుగు పెట్టాలని ప్లాన్ చేస్తుంది.
ఇక అందరూ కొట్టుకు వెళ్తారు. పల్లవి కూడా నా కోసం ఎవరు రావాల్సిన అవసరం లేదు నేనే వెళ్తాను అని అందరితో ఆవేశంగా మాట్లాడి వెళ్లిపోతుంది మీనాక్షి మాత్రం తన కూతురికి విడాకులు రాకూడదు అని దేవుడిని మొక్కుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఏది ఏమైనా కూడా పల్లవి ఇక మీదట ఉండకూడదు అని అందరూ అనుకుంటూ ఉంటారు. నీ కోర్టు దగ్గరికి వెళ్ళగానే అక్కడ జడ్జ్ గా రావడం చూసి పల్లవి నాటకం మొదలు పెడుతుంది.. సడన్గా అక్కడికి వెళ్లి అవని కాళ్లు పట్టుకొని నా కాపురం నిలబెట్టక్క నేను నీకు ఏమి అన్యాయం చేశాను.. అక్క అంటూ మాట్లాడడంతో జడ్జ్ గారు పల్లవి నిజంగానే బాధపడుతుంది అని అనుకుంటారు.. కానీ అవని వాళ్ళు మాత్రం ఏదో జరుగుతుంది అని అనుకుంటారు.. మొత్తానికి పల్లవి ప్లాన్ అయితే సక్సెస్ అయ్యేలా కనిపిస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..
Also Read :సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. అస్సలు ఊహించని ట్విస్ట్..