Big Stories

Amaravati as AP Capital: అమరావతీ.. ఊపిరి పీల్చుకో.. బాబు వచ్చాడు.. ఐదేళ్ల పోరాటానికి ముగింపు!

Amaravati as a Capital for Andhra Pradesh: అమరావతికి కొత్త ఊపిరి వచ్చినట్టే. టీడీపీ విజయంతో తమ ప్రాంతానికి పునరుజ్జీవం వస్తుందని.. రాజధానికి పొలాలిచ్చిన రైతులు భావిస్తున్నారు. కానీ నిర్థిష్టమైన హామీ కోరుతున్నారు. ఏంటది? చంద్రబాబు నుంచి వాళ్లు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? తమ పోరాటం కొనసాగుతోందని చెప్పుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది?

- Advertisement -

ఏపీ ఎన్నికల ఫలితాలతో కూటమి ప్రభుత్వం విజయం సాధించింది. కానీ ఆ విజయాన్ని అందరి కంటే ఎక్కువగా సెలబ్రేట్‌ చేసుకున్నది అమరావతి రైతులే. ఎందుకంటే అమరావతి రైతులు కోరుకున్నదే జరిగింది. వారి ఐదేళ్ల పోరాటానికి ముగింపు పలికే సమయం వచ్చింది. కానీ సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశాక.. అమరావతిపై ప్రకటన చేస్తారు. అప్పుడు 5ఏళ్లుగా ధర్నా చేస్తున్న అమరావతి రైతులు.. ఆందోళనకు స్వస్తి పలుకుతారు.

- Advertisement -

టీడీపీ గెలిచిన వెంటనే అమరావతికి పూర్వ వైభవం వస్తుంది. అమరావతినే ఏకైక రాజధానిగా అభివృద్ధి చేస్తామని.. రాష్ట్రాన్ని యువతకు ఉపాధి కేంద్రంగా మారుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ మేరకు పనులు కూడా ప్రారంభమయ్యాయి. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయక ముందే అమరావతి ప్రాంతంలో ఐదేళ్లుగా పెరిగిన పిచ్చి మొక్కల్ని తీసేయడం ప్రారంభించారు. దాదాపుగా వంద జేసీబీలతో జంగిల్ క్లియరెన్స్ ప్రారంభమయింది. అమరావతి నిర్మాణం పీక్స్ లో ఉన్నప్పుడు టీడీపీ ఓడిపోయింది. జగన్‌ ఐదేళ్లు పనులు ఆపేసాడు.

Also Read: ఏపీ నేతలకు బీజేపీ హైకమాండ్ షాక్, ఇప్పుడేం చేద్దాం..

చంద్రబాబు మొదటి విడతలో అమరావతిని ఖరారు చేసి.. భూ సమీకరణ చేసి.. ఎన్జీటీలో పిటిషన్లను అధిగమించి పనులు ప్రారంభించే సరికి చాలా కాలం గడిచిపోయింది. ఈ సారి ఎలాంటి సమస్యలు లేవు. ఆల్రెడీ పడిన పునాదుల మీద నిర్మాణాలు చేయడమే మిగిలింది. అందుకే రెండు, మూడేళ్లలో మొత్తం నిర్మాణాలు పూర్తవుతాయని అంచనా వేస్తున్నారు. అయితే పరిపాలన చేతకాకనే జగన్‌.. మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారన్నారు అమరావతి రైతులు. అందుకే ఇప్పుడు రైతులు ఆయనకు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇచ్చారని చెబుతున్నారు. తమ పోరాట ఫలితంగానే జగన్‌ దారుణంగా ఓడిపోయారన్నారు.

అన్ని పార్టీల మద్దతుతోనే చంద్రబాబు అమరావతిని రాజధానిగా ప్రకటించారన్నారు మహిళ రైతులు. కానీ జగన్‌ మాత్రం అందుకు విరుద్ధంగా మూడు రాజధానుల ప్రకటన చేసి తమ గుండెళ్లో గునపాలు దింపారని ఆవేదన వ్యక్తం చేశారు.

అమరావతి ప్రాంతంలో మెట్ట, జరి రకం భూములు ఉన్నాయి. ఆ భూముల్లో బంగారం లాంటి మూడు పంటలు పండేవంటున్నారు రైతులు. రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు భూములు అడిగిన వెంటనే ఇచ్చామని.. కానీ.. జగన్‌ తమను రోడ్డుపై కర్చోబెట్టాడని రైతులు బిగ్‌టీవీతో తమ గోడు వెళ్లబోసుకున్నారు.

Also Read: వైసీపీపై ఆపరేషన్ లోటస్ ఇలా.. టార్గెట్ ఆ నేతలే..!

రాజధాని కోసం భూములు ఇచ్చిన తాము ధర్నాలు చేస్తుంటే కావాలనే డబ్బులు ఇచ్చి ఫేక్‌ ధర్నాలు చేయించారని అమరావతి రైతులు జగన్‌ తీరుపై మండిపడుతున్నారు. ఆడవాళ్లు అని చూడకుండా పోలీసులు చిత్రహింసలు పెట్టారని వారు వాపోయారు.

జగన్‌ ప్రభుత్వం తమను అన్ని రకాలుగా ఇబ్బందులకు గురిచేసింది అంటున్నారు రైతులు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చిందని.. తమకు ఇన్నాళ్లుగా రావాల్సిన కౌలును వెంటనే చెల్లించాలని కోరుతున్నారు. అమరావతి ఉద్యమం సందర్భంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలంటున్నారు.

చంద్రబాబుకు పేరు వస్తుందనే భయంతోనే జగన్‌ అమరావతిని అణిచివేయాలని చూశారని రైతులు మండిపడుతున్నారు. వైజాగ్‌.. వైజాగ్‌ అన్న జగన్‌కు.. అక్కడి ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చారో ఇప్పటికే అర్థమై ఉంటుందన్నారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన ప్రజావేదికను కూల్చడం కరెక్ట్‌ కాదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: Chiranjeevi received invitation: చిరంజీవికి ప్రత్యేకంగా చంద్రబాబు ఇన్విటేషన్, సాయంత్రం విజయవాడకు..

2014 నుంచి 2019 వరకు చంద్రబాబు చేసిన డెవలప్‌మెంట్‌ను జగన్‌ వెనక్కి నెట్టారన్నారు. చంద్రబాబుకు తోడుగా మోడీ నిలబడితే అమరావతి అద్భుతమైన నగరంగా తయారు కావడంలో సందేహం ఉండదంటున్నారు రైతులు.

చంద్రబాబు ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా స్పష్టమైన మద్దతు ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రెండు, మూడేళ్లలో అమరావతికి ఓ రూపు వస్తుందని.. అభివృద్ధికి హద్దే ఉండదన్న ఓ నమ్మకం బలపడుతోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News