Big Stories

Terror Attack on Bus: జమ్మూకాశ్మీర్‌లో ఉగ్ర దాడి.. 10కి చేరిన మృతుల సంఖ్య.. ఖండించిన ప్రధాని!

10 Killed in Terrorist Attack on Bus in Jammu and Kashmir: ఉగ్రవాదులు మరోసారి దారుణానికి పాల్పడ్డారు. జమ్మూ కాశ్మీర్‌లోని రియాసీ జిల్లాలో ఓ యాత్ర బస్సుపై విచక్షణారహితంగా దాడులు చేశారు. ఈ ఘటనలో 10 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో దాదాపు 30 మంది ప్రయాణికులు గాయలపాలయ్యారు. ఆదివారం సాయంత్రం 6.10 గంటలకు జమ్మూలోని రాయసీ జిల్లాలో ఉన్న శివఖోడి గుహను సందర్శించుకొని తిరిగి వస్తుండగా యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగపడ్డారు.

- Advertisement -

లోయలో పడిన బస్సు..

- Advertisement -

ఉగ్రవాదాలు ఒక్కసారిగా కాల్పులు చేశారు. ఈ కారణంగా డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు అదుపుతప్పి పక్కనే ఉన్న ఓ లోయలో పడిపోయింది. ఈ దాడిలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. పారామిలటరీ, సైన్యం సహాయ చర్యలలో పాల్గొన్నాయి. ఉగ్రదాడుల నేపథ్యంలో రియాసీ జిల్లాతోపాటు పరిసర ప్రాంతాల్లో భద్రతా దళాలు విస్తృత్తంగా తనిఖీలు చేపడుతున్నాయి.

Also Read: నమో 3.0.. ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ లైఫ్ జర్నీ

ఖండించిన ప్రధాని..

యాత్రికులపై ఉగ్రవాదుల దాడి ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు. అక్కడ పరిస్థితులను పర్యవేక్షించాలని, బాధితులు, వారి కుటుంబాలకు సాయం అందించాలని మోదీ అందించారు. కాాగా ప్రజలకు భద్రత కల్పించాలని కాంగ్రెస్ నేత మల్లిఖార్జున్ ఖర్గే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే జమ్మూకాశ్మీర్ లెఫ్ట్ నెంట్ గవర్నర్ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన కలచివేసిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎక్స్ వేదికగా స్పందించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News