Big Stories

PM Modi-Amit Shah: వేకువజాము వరకు అభ్యర్థుల కసరత్తులో మోదీ,అమిత్ షా..!

PM Modi latest news

- Advertisement -

PM Modi Leads BJP’s Midnight Meeting to finalise first list(Telugu breaking news): వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మరోమారు గెలిచి సత్తా చాటాలనే ప్రయత్నంలో ఉన్న ప్రధాని మోదీ.. లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘంగా కసరత్తు చేస్తున్నారు. గురువారం రాత్రి మొదలైన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాలు రాష్ట్రాల వారీగా జాబితాల మీద చర్చించారు. రాత్రి మొదలైన ఈ భేటీ శుక్రవారం ఉదయం 4.30 వరకు సుదీర్ఘంగా సాగింది. తెల్లవారుజామున 3.20 వరకు భేటీలో పాల్గొన్న ప్రధాని మోదీ ఆ తర్వాత వెళ్లిపోయారు.

- Advertisement -

ఈసారి 2019లో గెలిచిన సిట్టింగ్‌ ఎంపీల్లో మూడో వంతు మందికి సీటు నిరాకరించారనీ, వారి స్థానంలో యువతకు అవకాశం కల్పించాలని కమిటీ భావిస్తోంది. ముఖ్యంగా 70 ఏళ్లు దాటిన, ఇప్పటికే మూడుసార్లు పోటీ చేసిన వారికి నో చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త నియమం కారణంగా ఒక్క అస్సాంలోనే 40 శాతం మంది కొత్త ముఖాలు రానున్నాయని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

రాత్రి జరిగిన భేటీలో గుజరాత్‌, జార్ఖండ్, ఉత్తరాఖండ్, అస్సాం, గోవా, ఢిల్లీ, మధ్యప్రదేశ్, జమ్మూ కశ్మీర్, రాజస్థాన్‌తో సహా 16 రాష్ట్రాలకు చెందిన అభ్యర్థుల మీద ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కాగా.. వీటిలో సుమారు 9 రాష్ట్రాలకు చెందిన అన్ని సీట్ల మీద కసరత్తు పూర్తైందని, తెలంగాణ, కేరళ వంటి కొన్ని రాష్ట్రాల్లోని కొన్ని సీట్ల మీద కమిటీ ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమచారం.

read more: బిల్.. మీ సేవలు అద్భుతం: మోదీ

అత్యధిక సీట్లున్న ఉత్తర ప్రదేశ్ మీద అత్యధిక సమయం కేటాయించారనీ, అనంతరం పశ్చిమ బెంగాల్ మీద ప్రత్యేక చర్చ జరిగిందని, ఛత్తీస్ ఘడ్‌లోని నాలుగు ఎంపీ సీట్ల మీద కూడా క్లారిటీ వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నేడు తొలిజాబితా విడుదల కానుందనీ, ఇందులో 9 రాష్ట్రాలకు చెందిన 125 సీట్లకు పైగా అభ్యర్థులను ప్రకటిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. మార్చి 10 లోగా 300 స్థానాలకు అభ్యర్థులను కమిటీ ప్రకటించనుంది.

ఇక.. తెలంగాణ విషయానికొస్తే.. ఇప్పటికే ఉన్న నలుగురు బీజేపీ సిట్టింగ్ ఎంపీల్లో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావుకు తప్ప మిగిలిన ముగ్గురికీ సీటు ఖరారైంది. మిగిలిన స్థానాలకు సంబంధించి ఇప్పటికే.. కిషన్ రెడ్డి, బండి సంజయ్, డాక్టర్ కే లక్ష్మణ్, డీకే అరుణ, ఈటల రాజేందర్, జితేందర్ రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి వంటి సీనియర్ నేతలతో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సభ్యులు మాట్లాడారు. నేడు తెలంగాణకు చెందిన తొలి జాబితా రానుందని సమాచారం.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News