Big Stories

BJP First List : టార్గెట్ 400 .. 125 మంది అభ్యర్థులతో బీజేపీ ఫస్ట్ లిస్ట్ రెడీ..

bjp first list ready for lok sabha elections
bjp first list ready for lok sabha elections

BJP First List For Lok Sabha Elections(Politics news today India): లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో బీజేపీ 125 మంది అభ్యర్థులతో తొలిజాబితా విడుదల చేసేందుకు కసరత్తు దాదాపు పూర్తి చేసింది. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన నిన్న రాత్రి 10.30 గంటలకు సమావేశమైన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ శుక్రవారం తెల్లవారుజామున 4.30 గంటల వరకూ తర్జనభర్జనలు జరిపింది. బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షా, రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక చర్చలు కొనసాగించారు. దాదాపు 16 రాష్ట్రాల నుంచి లోక్ సభ అభ్యర్థుల పేర్లను చర్చించి ఖరారు చేశారు.

- Advertisement -

తొలి జాబితాను ప్రధాని మోడీ ఆమోదం తర్వాత శుక్రవారం ఏ సమయంలోనైనా వెల్లడించే అవకాశాలున్నాయని తెలిసింది. ఈ భేటీలో యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, చత్తీస్ గఢ్ సీఎం విష్ణు డియో సాయ్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, గోవా సీఎం ప్రమోద్ సావంత్, పలువురు కేంద్రమంత్రులు, పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు.

- Advertisement -

Read More : బిల్.. మీ సేవలు అద్భుతం: మోదీ

బీజేపీ తొలిజాబితాలో దక్షిణాది రాష్ట్రాల అభ్యర్థులతో పాటు యూపీ,ఎంపీ, పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాల అభ్యర్థులకు చోటు కల్పించనున్నారు. తెలంగాణ సహా మొత్తం 16రాష్ట్రాల లోక్ సభ అభ్యర్థులపై కేంద్ర ఎన్నికల కమిటీ కసరత్తు చేసింది. తొలిజాబితాలో ఖరారైన అభ్యర్థుల పేర్లను ప్రధాని ఆమోదానికి ఇవ్వనున్నట్టు తెలిసింది. ఎన్నికల కమిటీ భేటీకి ముందు ప్రధాని నరేంద్రమోదీ తన నివాసంలో హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో సమావేశమయ్యారు.

బీజేపీ సీఈసీ భేటీలో తొలుత యూపీ, బెంగాల్ స్థానాల ఖరారుపై చర్చలు జరిగాయి. ఆతర్వాత చత్తీస్ గఢ్ లోక్ సభ స్థానాలపై చర్చించారు. ఇక్కడ నాలుగు సీట్లకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. తెలంగాణకు సంబంధించి జరిపిన చర్చల్లో ఈసారి ముగ్గురు సిట్టింగులకు మళ్లీ టికెట్లు ఇవ్వాలని నిర్ణయించారు. రాజస్థాన్ సీట్లకు సంబంధించి జరిగిన భేటీలో ఆ రాష్ట్ర సీఎం, డిప్యూటీ సీఎం పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లడించారు. అనంతరం మధ్యప్రదేశ్ లోని అన్ని లోక్ సభ స్థానాలపై చర్చించారు. ఇక్కడ చింద్వారా సీటుకోసం ప్రత్యేక వ్యూహాన్ని రూపొందించారు. ఈ భేటీలో సీఎం, మాజీ సీఎంలతో పాటు కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా కూడా పాల్గొన్నారు.

Read More : సోలార్‌ ప్యానళ్ల ఏర్పాటుకు భారీ సబ్సిడీ.. పీఎం సూర్యఘర్ స్కీమ్ కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్..

గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి జరిగిన చర్చల్లో సీఎం భూపేంద్ర పటేల్, కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ పాల్గొన్నారు. ఇక్కడ అన్ని సీట్లపై కసరత్తు పూర్తయింది. అనంతరం జార్ఖండ్, ఉత్తరాఖండ్, అసోం, గోవా, ఢిల్లీలపై చర్చలు ముగిశాయి. అసోంలో ఈసారి 40 శాతం మంది అభ్యర్థులు మారనున్నారు. జమ్మూ కాశ్మీర్‌లో, జమ్మూ ప్రాంతంలోని సీట్లపై మాత్రమే చర్చ జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్ర రైనా రాజౌరి లేదా అనంతనాగ్ స్థానం నుంచి పోటీ చేయవచ్చు.

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 400 సీట్లు సాధించాలనే సంకల్పంతో ప్రధాని నరేంద్రమోదీ సరికొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు. బీజేపీ స్వతహాగా 370 సీట్లు గెలుచుకునేందుకు వ్యూహరచన చేస్తున్నారు. బీజేపీ ఈ టార్గెట్ సాధిస్తే, తొలిప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తర్వాత మూడోసారి ప్రధాని అయ్యే అవకాశం మోడీకి దక్కుతుంది. దీనికోసం ఆ పార్టీ ఈసారి వినూత్న వ్యూహాలకు తెరలేపనుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా బలహీనంగా ఉన్న స్థానాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. దాదాపు 160 స్థానాల్లో బలహీనంగా ఉన్నట్టు బీజేపీ అధిష్ఠానం గుర్తించింది. ఈ సీట్లను కూడా తమ ఖాతాలో వేసుకునేందుకు కొత్త వ్యూహాలను అమలుపరచనున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News