BigTV English

PM Modi Tejas | తేజస్‌ ఫైటర్‌‌లో మోదీ ప్రయాణం.. తొలి ప్రధానిగా చరిత్ర!

PM Modi Tejas | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పైలట్ అవతారమెత్తారు. అది కూడా సాధారణ విమాన పైలట్ కాదు.. యుద్ధ విమాన పైలట్‌గా. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారత్‌ డెవలప్ చేసిన తేజస్‌ ఫైటర్‌ జెట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రయాణించారు. తేజస్‌లో ప్రయాణించేందుకు ఆయన పూర్తిగా యుద్ధ విమాన పైలట్ వేషధారణలో కనిపించారు.
ఇలా ఒక యుద్ధ విమానంలో ప్రయాణించిన ప్రధాన మంత్రిగా ఆయన చరిత్ర సృష్టించారు.

బెంగుళూరులోని హిందూస్థాన్‌ ఏరోనాటికల్స్‌ లిమిటెడ్ కేంద్రాన్ని ఆయన శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఈ ఫైటర్‌ జెట్‌లో ప్రయాణించారు. అంతకుముందు ర‌క‌ర‌కాల ఫైట‌ర్ జెట్ల త‌యారీ గురించి తెలుసుకున్నారు. యుద్ధ విమానాల ఉత్పత్తి కేంద్రాన్ని ఆయ‌న ప‌రిశీలించారు. తేజ‌స్ త‌యారీ గురించి కూడా ఆయ‌న తెలుసుకున్నారు.

హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ.. తేజ‌స్ యుద్ధ విమానాల‌ను త‌యారు చేస్తున్నది. లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌గా వాటికి గుర్తింపు ఉంది. తేజ‌స్ విమానాల‌కు చెందిన‌ మాక్‌-3 ఇంజిన్ల‌ను హెచ్ఏఎల్ ఉత్పత్తి చేస్తోంది.

తేజ‌స్ యుద్ధ విమానంలో స‌క్సెస్‌ఫుల్‌గా ప్రయాణించినట్టు ప్రధాని మోదీ తెలిపారు. ఆయ‌న త‌న ఎక్స్ అకౌంట్‌లో ఈ విష‌యాన్ని పోస్టు చేశారు. ఈ ఎక్స్‌పిరియన్స్‌ అద్భుతంగా ఉందంటూ రాసుకొచ్చారు. స్వదేశీ సామ‌ర్థ్యాన్ని పెంచాల‌న్న త‌న న‌మ్మకానికి బ‌లం చేకూరిన‌ట్లు ఉంద‌న్నారు. భార‌త స‌త్తా ప‌ట్ల గ‌ర్వంగా ఉంద‌న్నారు.

Related News

Supreme Court: లక్షల వీధి కుక్కలను షెల్టర్లకు తరలించండి.. సుప్రీం సంచలన ఆదేశాలు

Delhi Politics: ఢిల్లీలో రాహుల్, ప్రియాంక అరెస్ట్, భగ్గుమన్న విపక్షాలు, ప్రజాస్వామ్యం కోసమే పోరాటం-సీఎం రేవంత్

Air India: మరో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. ఫ్లైట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Big Stories

×