BigTV English

Ginkgo Biloba Tree : ఒక్కరోజులో ఆకులన్నీ రాల్చే చెట్టు

Ginkgo Biloba Tree : ఒక్కరోజులో ఆకులన్నీ రాల్చే చెట్టు

Ginkgo Biloba Tree : శిశిరంలో చెట్లన్నీ ఆకులను రాలుస్తాయి. ఈ విషయం తెలిసిందే. మరి ఒక్క రోజులోనే ఆకులన్నింటినీ రాల్చేసే చెట్టు ఒకటుంది తెలుసా? అదే గింకో(Ginkgo). చైనా, జపాన్, కొరియా దేశాల్లో విరివిగా పెరుగుతుంది. మన్‌హటన్, వాషింగ్టన్ డీసీ వీధుల్లో, సియోల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో, పారిస్‌లోని పార్కుల్లోనూ ఈ వృక్షాలను చూడొచ్చు.


ఫాసిల్ ట్రీ, జపనీస్ సిల్వర్ ఆప్రికాట్, మెయిడెన్ హెయిర్ ట్రీ, ఇన్సింగ్ పేర్లతోనూ పిలుస్తారు. మన దేశంలో అక్కడక్కడా గింకో చెట్లు కనిపిస్తాయి. వీటిని గింకో బిలోబా అని వ్యవహరిస్తారు. ఈ చెట్లు ఆకులను రాల్చే దృశ్యం ఎంతో మనోహరంగా, విచిత్రంగా ఉంటుంది. ఫ్యాన్ ఆకారంలో ఉండే ఈ చెట్టు ఆకులన్నీ ఒక్క రోజులోనే రాలిపోవడం విశేషం.

తొలుత నిదానంగా ఒక్కో ఆకు రాలుతూ.. కొద్ది సేపటికి కుండపోత వర్షం కురిసినట్టుగా పసుపు వర్ణపు ఆకులన్నీ జలజలా రాలిపోతాయి. దాంతో నేలపై స్వర్ణ తివాచీ పరిచినట్టు ఉంటుంది. గింకో చెట్లు ఆకులను రాల్చే రోజు కోసం అందరూ ఎదురు చూస్తుంటారు. వాతావరణంలో మార్పుల కారణంగా ఆకులు రాలే రోజు ప్రతి సంవత్సరం మారిపోతూ వస్తోంది.


రుతువులతో పాటే గింకో ఆకులు రాలే సమయం కూడా ఆలస్యమవుతుండటం విశేషం. వాతావరణంలో వేడి తగ్గే సమయంలో.. అంటే శీతాకాలం సమీపిస్తున్న తరుణంలో ఆకులు రంగు మారడం ఆరంభమవుతుంది. సాధారణంగా అక్టోబర్ చివరి వారంలో లేదంటే నవంబర్ మొదటి వారంలో ఈ చెట్లు ఆకులను రాలుస్తాయని యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియాకు చెందిన డేవిడ్ కేర్ తెలిపారు.

1997 నుంచీ ఆయన గింకో వనాన్ని పెంచుతున్నారు. గింకో వృక్ష జాతికి 200 మిలియన్ల సంవత్సరాల చరిత్ర ఉంది. డైనోసార్లు సంచరించిన కాలంలోనే వీటి మనుగడ మూలాలు ఉన్నట్టు నార్త్ డకోటాలో బయటపడిన శిలాజాల ద్వారా వెల్లడైంది. ఇప్పుడీ వృక్ష జాతి అంతరించే దశకు చేరింది. పర్యావరణ మార్పుల ఫలితంగా గింకో ఆకులు రాలే కాలం కూడా గతి తప్పింది. దీనికి సంబంధించి యూనివర్సిటీ ఆఫ్ న్యూహాంప్‌షైర్ పరిశోధన చేసింది.

వర్సిటీ ఆవరణలో ఉన్న 90 ఏళ్ల నాటి గింకో చెట్టు నుంచి ఆకులు రాలే సమయాన్ని, తేదీలను ఏటా పరిశీలిస్తూ వచ్చారు. 2002 నుంచి ఆ వివరాలను నమోదు చేస్తున్నారు. 1970లలో ఆకులు రాలే ప్రక్రియ అక్టోబర్ 25న లేదా అంత కన్నా ముందుగానే జరిగేది. గత పదేళ్లుగా నవంబరు 1వ తేదీ తర్వాత ఆకులు రాలాయి.

ఈ సంవత్సరం ఆ తేదీ నవంబర్ 12కి చేరింది. గత 46 ఏళ్లలో ఇంత ఆలస్యంగా ఆకులు రాలడం ఇప్పుడేనని వర్సిటీలోని నేచరుల్ రిసోర్సెస్ విభాగం ప్రొఫెసర్ సెరిటా ఫ్రే చెప్పారు. న్యూహాంప్‌షైర్‌లో శీతాకాలంలోనూ ఉష్ణోగ్రతలు అధికంగానే నమోదవుతున్నాయి. మొత్తంగా గింకో చెట్ల ఆకులు రాలే సమయాలు.. పర్యావరణ మార్పులు, గతి తప్పుతున్న రుతువులకు ప్రతీకగా మారాయని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.

Related News

Bald Head Regrowth: బట్టతల సమస్యకు చెక్.. ఇలా చేస్తే జుట్టు పెరగడం ఖాయం

Munagaku Benefits: మునగాకుతో మామూలుగా ఉండదు.. దీని బెనిఫిట్స్ తెలిస్తే..

Fenugreek Seeds Sprouts: మొలకెత్తిన మెంతులు తింటే.. ఈ సమస్యలు దూరం !

Avocado For Hair: అవకాడోతో మ్యాజిక్.. ఇలా వాడితే ఒత్తైన జుట్టు

Priyanka Tare: ఘనంగా SK మిస్సెస్ ఇండియా యూనివర్స్ ఇంటర్నేషనల్ అందాల పోటీలు.. విజేత ఎవరంటే?

Chia Seeds: నానబెట్టిన చియా సీడ్స్ తింటే.. ఇన్ని లాభాలా ?

Big Stories

×