E-Paper
Advertisement

Modi : వైట్ హౌస్ లో మోదీకి ఘన స్వాగతం.. విందు వంటకాలివే..!

Modi : వైట్ హౌస్ లో మోదీకి ఘన స్వాగతం.. విందు వంటకాలివే..!

PM Modi schedule today(Telugu news live today): అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ వెళ్లేందుకు మోదీ వాషింగ్టన్‌ డీసీకి చేరుకునే సమయానికి వర్షం కురుస్తోంది. అయినాసరే ఇండో-అమెరికన్లు భారత ప్రధాని కోసం వేచి చూశారు. మోదీ రాగానే ఘన స్వాగతం పలికారు. ఈ విషయంపై మోదీ ట్విటర్‌లో స్పందించారు. భారతీయుల ఆత్మీయ స్వాగతం ఇంద్రదేవత ఆశీర్వాదం మరింత స్పెషల్‌గా ఉన్నాయన్నారు.

వైట్‌హౌస్‌ చేరుకున్న భారత ప్రధాని మోదీకి అగ్రరాజ్య అధ్యకుడు జోబైడెన్ ఘన స్వాగతం పలికారు. వైట్‌హౌస్‌లోకి మోదీ రాగానే సతీసమేతంగా కారు దగ్గరికి వెళ్లిన బైడెన్… ఆయన్ని ఆప్యాయంగా పలకరించారు. బైడెన్ దంపతులతో మోదీ కూడా ఆత్మీయంగా మాట్లాడారు. ముగ్గురూ కలిసి కాసేపు అక్కడే ముచ్చటించుకున్నారు. ఆ తర్వాత మోదీని వైట్‌హౌస్‌ లోపలికి తీసుకెళ్లారు బైడెన్ దంపతులు.

వైట్‌హౌస్‌లో మోదీకి ఇచ్చే విందును ప్రత్యేకంగా సిద్ధం చేయించారు అమెరికా అధ్యకుడు బైడెన్. భారత జాతీయ పక్షి నెమలి ద్వారా ప్రేరణ పొందిన డిన్నర్ థీమ్ నుంచి, త్రివర్ణ పతాకాన్ని సూచించే డెకర్ వరకు విందులో భారతీయ టచ్ ఉండేలా ఏర్పాట్లు చేశారు. ప్రధాని మోదీ శాకాహారి కావడంతో.. అద్భుతమైన శాకాహార మెనూను రూపొందించారు. మెరినేట్‌ చేసిన మిల్లెట్‌ కేకులు, టాంగీ అవకాడో సాస్, గ్రిల్డ్ కార్న్ కెర్నెల్ సలాడ్‌, కంప్రెస్‌డ్‌ వాటర్‌ మెలన్‌ను మెనూలో చేర్చారు. స్టఫ్డ్ పోర్టోబెల్లో మష్రూమ్స్… క్రీము, కుంకుమపువ్వుతో కలిపిన రిసోట్టో, సీ బాస్, నిమ్మకాయ-మెంతులు కిలిపిన పెరుగు సాస్, సమ్మర్‌ స్క్వాష్‌లను కూడా మోదీకి వడ్డించనున్నారు.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×