E-Paper
Advertisement

PM ModI: కొత్త చరిత్రకు రెడీ.. కచ్చితంగా మహిళా రిజర్వేషన్ బిల్లు వస్తోంది.. తేల్చి చెప్పిన ప్రధాని మోదీ

PM ModI: కొత్త చరిత్రకు రెడీ.. కచ్చితంగా మహిళా రిజర్వేషన్ బిల్లు వస్తోంది.. తేల్చి చెప్పిన ప్రధాని మోదీ
Advertisement

PM ModI: ఈనెల 16న మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటు ఉభయసభల ముందుకు వస్తుందని తేల్చిచెప్పారు ప్రధాని నరేంద్రమోదీ. 21వ శతాబ్దంలో అతి కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నామని తేల్చిచెప్పారు. పార్లమెంటు కొత్త చరిత్రను లిఖించేందుకు దగ్గరలో ఉందన్నారు. ఢిల్లీలో సోమవారం నిర్వహించిన నారీ శక్తి వందన్ సమ్మేళన్ కార్యక్రమం నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

కచ్చితంగా మహిళా రిజర్వేషన్ బిల్లు వస్తోంది-ప్రధాని మోదీ

Advertisement

మహిళా రిజర్వేషన్ సవరణ చట్టం బిల్లు నేపథ్యంలో దేశ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. దీనిపై అధికార బీజేపీ-విపక్ష కాంగ్రెస్ మధ్య మాటల దాడి తీవ్రమైంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ క్లారిటీ ఇచ్చారు. సోమవారం ఢిల్లీలో జరిగిన నారీ శక్తి వందన సమ్మేళనం పేరిట ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి సదస్సులో ఆయన మాట్లాడారు.

గత ఆశయాలను సాకారం చేస్తూ నూతన చరిత్రను సృష్టించేందుకు పార్లమెంట్ చేరువలో ఉందన్నారు. చర్చలు, సహకారం, భాగస్వామ్యం ద్వారా సవరణ బిల్లును ఆమోదింపజేయడం మా ప్రాధాన్యత అని తేల్చిచెప్పేశారు. మూడేళ్ల కింద నారీ శక్తి వందన అధినియమ్‌ బిల్లు ప్రవేశ పెట్టినప్పుడు అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించాయని గుర్తు చేశారు.

Advertisement

21వ శతాబ్దంలో అతి కీలకమైన నిర్ణయం- ప్రధానమంత్రి

మహిళా రిజర్వేషన్ చట్టంతో ముడిపడిన ఈ సవరణ బిల్లు పార్లమెంటు ప్రత్యేక సమావేశాల ముందుకు వస్తోందని తేల్చిచెప్పారు. రిజర్వేషన్ బిల్లు మహిళలకు సమర్పిస్తున్నట్లు మనసులోని మాట బయటపెట్టారు. 2029 లోక్‌సభ ఎన్నికలను కచ్చితంగా మహిళా రిజర్వేషన్లతో నిర్వహిస్తామని తేల్చేశారు. అందుకోసం రాజకీయ పార్టీలు ఏకతాటిపైకి వచ్చి సవరణ బిల్లును ఆమోదించాలని కోరారు.

ఇప్పటికే ప్రధాని మోదీ.. వివిధ పార్టీల నాయకులకు లేఖలు రాసిన విషయం తెల్సిందే. మహిళల భాగస్వామ్యం ప్రజాస్వామ్యాన్ని బలపరుస్తుందన్నారు ప్రధాని. స్వాతంత్ర్య పోరాటం నుంచి దేశ నిర్మాణంలో మహిళల కీలక పాత్ర పోషించారన్నారు. రాష్ట్రపతి నుంచి ఆర్థికమంత్రి వరకు కీలక పదవుల్లో మహిళలు ఉన్నారని తెలిపారు.

ALSO READ: అసెంబ్లీ ఎన్నికల వేళ.. బిల్లుల గోలేంటి? భగ్గుమన్న కాంగ్రెస్, రాజ్యాంగంపై దాడేనన్న సోనియా గాంధీ

గ్రామీణ స్థాయిలో మహిళలు రాణిస్తున్నారని, దేశంలో 14 లక్షలకు పైగా మహిళలు స్థానిక సంస్థల్లో పని చేస్తున్నారని వివరించారు. 21 రాష్ట్రాల్లో పంచాయతీల్లో 50 శాతం వరకు మహిళల భాగస్వామ్యం ఉందని, మహిళల పాల్గొనడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం అయ్యాయని తేల్చిచెప్పారు. మహిళల సాధికారతకు ప్రభుత్వ కీలక చర్యలు చేపట్టిందన్నారు.

బేటీ బచావో- బేటీ పడావో, మాతృ వందన, సుకన్య సమృద్ధి వంటి పథకాలు తీసుకొచ్చామన్నారు. ఉజ్జ్వల, హర్ ఘర్ జల్, ఆయుష్మాన్ భారత్ ద్వారా జీవన ప్రమాణాల పెరిగాయని గుర్తు చేశారు. జనధన్ ద్వారా కోట్ల మహిళలకు బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేశారని, ఆర్థిక-సామాజిక పురోగతి ముద్రా లోన్స్‌లో 60 శాతం మహిళలకు, స్టార్టప్‌లలో 42 శాతం మహిళలను భాగస్వామ్యం చేశామన్నారు.

 

Related News

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

Big Stories

Advertisement
×