E-Paper
Advertisement

Death Threat : ముకేష్ అంబానీకి మరోసారి బెదిరింపులు.. రూ.20 కోట్లు డిమాండ్

Death Threat : ముకేష్ అంబానీకి మరోసారి బెదిరింపులు.. రూ.20 కోట్లు డిమాండ్
Advertisement

Death Threat : దేశీయ పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీని చంపేస్తామంటూ బెదిరింపు మెయిల్ రావడం తీవ్ర కలకలం రేపుతోంది. 20 కోట్ల రూపాయలు ఇవ్వాలని, లేకపోతే చంపేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు ముఖేష్ అంబానీకి ఈ-మెయిల్ పంపించారు. దేశంలో మంచి షూటర్లకు కొదవలేదని, ఆయన్ని కాల్చి చంపుతామంటూ బెదిరించారు. ఈ ఘటనపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. బెదిరింపు మెయిల్‌ పంపిన అజ్ఞాత వ్యక్తుల కోసం గాలిస్తున్నారు.

రిలయన్స్ ఫౌండేషన్ ఆధీనంలో నడుస్తోన్న ఆసుపత్రికి బెదిరింపు ఫోన్ కాల్ అందిన కొద్దిరోజుల్లోనే ముకేష్ అంబానీకి డెత్ మెయిల్ రావడం కలకలం రేపుతోంది. ఈ రెండు ఘటనలతో ముంబై పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఆయన నివాసానికి అదనపు భద్రతను కల్పించారు.

Advertisement

ఇంతకుముందు కూడా ముకేష్ అంబానీకి బెదిరింపులు వచ్చాయి. 2021లో ఆయన నివాసం అంటాలియాకు అత్యంత సమీపంలో కారును పార్క్ చేసిన ఉదంతం అనేక మలుపులు తిరిగింది. ఆ కారులో 20 జిలెటిన్ స్టిక్స్ లభించాయి. ఇది కేవలం గ్లింప్స్ మాత్రమే అనే బెదిరింపు లేఖనూ పోలీసులు ఆ కారు నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు తాజాగా మళ్లీ ఆయనకు బెదిరింపు మెయిల్ రావడం టెన్షన్‌ రేపుతోంది. తాము అడిగిన 20 కోట్ల రూపాయలను ఇవ్వకపోతే షూట్ చేసి చంపుతామని శుక్రవారం ఈ-మెయిల్ వచ్చింది. దీనిపై రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గమ్‌దేవి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×