BigTV English

Nagpur Blast : సోలార్ కంపెనీలో భారీ పేలుడు.. 9 మంది మృతి..

Nagpur Blast : సోలార్ కంపెనీలో భారీ పేలుడు.. 9 మంది మృతి..

Nagpur Blast : మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఈరోజు తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందారు. ఉదయం బజార్ గావ్‌లోని సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్ కంపెనీలో ఈ ఘోరం జరిగింది. కంపెనీలోని క్యాస్ట్ బూస్టర్ ప్లాంట్ లో ప్యాకింగ్ సమయంలో సడెన్ గా భారీ పేలుడు సంభవించింది. దీంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న తొమ్మిది మంది కార్మికులు స్పాట్ లోనే చనిపోయారు. మరికొంతమంది కార్మికులకు గాయాలయ్యాయి.


పేలుడు సమాచారం అందగానే ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌లు వెంటనే కంపెనీ వద్దకు చేరుకున్నాయి. గాయపడిన కార్మికులను వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఎందుకు జరిగిందనే వివరాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద సమయంలో మొత్తం 12 మంది ఆ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్నారు.

కాస్ట్ బూస్టర్ ప్లాంట్‌లో ప్యాకింగ్ చేస్తుండగా.. కెమికల్ లిక్విడ్‌లో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా పేలుడు సంభవించి చుట్టుపక్కలున్న కార్మికులు చెల్లాచెదురయ్యారు. ఈ కంపెనీ పేలుడు పదార్థాలు, రక్షణశాఖకు కావాల్సిన పరికరాలను తయారు చేస్తోందని తెలుస్తోంది.


Tags

Related News

Odisha Crime: బీజేపీ లీడర్‌ను కాల్చి చంపేశారు.. ఒడిశాలో దారుణ ఘటన

Breaking News: ఘోర ప్రమాదం.. 15 మంది స్పాట్ డెడ్, పలువురి పరిస్థితి విషమం

Srikakulam Quarry Blast: విషాదం.. క్వారీ బ్లాస్ట్‌లో ముగ్గరు మృతి

Guntur Crime: గుంటూరులో దారుణం.. సోదరి ప్రేమ పెళ్లి.. యువకుడిని హత్య చేసిన సోదరుడు

Visakha Tragedy: రూ.3 లక్షలు అప్పు చేసి బైక్ కొనిచ్చిన తల్లిదండ్రులు.. 5 రోజుల్లోనే ప్రాణం తీసిన ప్రమాదం

AC explosion: బాచుపల్లిలో దారుణం.. ఏసీ పేలి ఇంట్లో ..

Nellore: నెల్లూరు జిల్లాలో దారుణం.. ఇద్దరు యువకులను హత్య చేసి పెన్నానదిలో పడేసిన దుండగులు

Nalgonda Student Murder: ఫ్రెండ్‌ రూమ్‌‌కి తీసుకెళ్లి.. చిన్న గొడవకు చంపేసి.. నల్గొండలోదారుణం

Big Stories

×