BigTV English

NEET UG 2024: నీట్‌ నోటిఫికేషన్‌ విడుదల.. దరఖాస్తులు ప్రారంభం! ఎలా అప్లై చేసుకోవాలంటే..?

NEET UG 2024: నీట్‌ నోటిఫికేషన్‌ విడుదల.. దరఖాస్తులు ప్రారంభం! ఎలా అప్లై చేసుకోవాలంటే..?
NEET UG 2024 Applications

NEET UG 2024 Applications (news paper today):


వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నీట్‌ (యూజీ)-2024 పరీక్షకు నోటిఫికేషన్‌ విడుదలైంది. 13 భాషల్లో జరిగే ఈ పరీక్షకు దరఖాస్తులు శుక్రవారం నుంచి ప్రారంభం అయ్యాయి.

దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ (నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌) యూజీ (NEET UG 2024) పరీక్షకు నోటిఫికేషన్‌ విడుదలయ్యింది. ఈ పరీక్షను మే 5న నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) శుక్రవారం అధికారికంగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది.


ఫిబ్రవరి 9 నుంచి మార్చి 9 రాత్రి 9 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇంగ్లిష్‌, హిందీ, తెలుగుతో పాటు మొత్తం 13 భాషల్లో పెన్ను, పేపర్‌ విధానంలో ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు ఎన్టీఏ వెల్లడించింది. దరఖాస్తు చేసుకునేందుకు https://neet.nta.nic.in/ ను సంప్రదించవచ్చు.

జనరల్‌ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుం రూ.1700 ఉండగా.. జనరల్‌ ఈడబ్ల్యూఎస్‌/ఓబీసీ-ఎన్‌సీఎల్‌ అభ్యర్థులకు రూ.1600, ఎస్సీ, ఎస్టీ/దివ్యాంగులు/థర్డ్‌ జండర్‌ అభ్యర్థులు రూ.1000 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్‌, పరీక్ష కేంద్రాలకు సంబంధించిన సమాచారాన్ని తర్వాత వెల్లడించనున్నారు. నీట్ పరీక్ష మే 5న (ఆదివారం) మధ్యాహ్నం 2 గంటల నుంచి 5.20 గంటల మధ్య జరగనుంది. ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, బీఎస్‌ఎంఎస్‌, బీయూఎంఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా NTA ఈ పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×