E-Paper
Advertisement

ఆ వాహనదారులకు రిలీఫ్.. ఆ యాప్ ద్వారా రాజ్‌మార్గ్, ఏ విధంగా చేయాలంటే..

ఆ వాహనదారులకు రిలీఫ్.. ఆ యాప్ ద్వారా రాజ్‌మార్గ్, ఏ విధంగా చేయాలంటే..
Advertisement

Toll Gate Local Pass: జాతీయ రహదారులపై ప్రయాణించేవారికి టోల్ ఫ్లాజాల వద్ద ఇబ్బందులు లేకుండా రకరకాల మార్గాలను అన్వేషిస్తోంది నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. తాజాగా టోల్ ప్లాజాల సమీపంలో ఉండే వాహనదారులకు లోకల్ పాస్ జారీ చేయనుంది. రాజ్‌మార్గ్ యాత్రా యాప్ ద్వారా లోకల్ పాస్ కొనుగోలు చేయవచ్చు. నెలంతా ఎన్నిసార్లు అయినా టోల్ గేట్లు దాటవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే సిటీ బస్సుల్లో ఉపయోగించే బస్సు పాసుల మాదిరిగా అన్నమాట.

జాతీయ రహదారులపై ఆ వాహనదారులకు రిలీఫ్-జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు మరొక శుభవార్త. టోల్ ప్లాజాల వద్ద ఎదురయ్యే ఇబ్బందులను తొలగించేందుకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా-NHAI కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యంగా టోల్ ప్లాజాలకు సమీపంలో నివసించే వాహనదారులకు తీపి కబురు. టోల్ ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే వాహనదారులు రాయితీతో కూడిన నెలవారీ లోకల్ పాస్ కొనుగోలు చేయవచ్చు. ఈ పాస్ వారు తమ మొబైల్‌లో రాజ్‌మార్గ్ యాత్ర యాప్ ద్వారానే కొనుగోలు చేయవచ్చు.

Advertisement

లోకల్ పాస్ ఏ విధంగా చేయాలి? అలాగే దాన్ని ప్రతి నెలా రెన్యూవల్ చేసుకోవచ్చు. దీనివల్ల టోల్ ఆఫీసుల చుట్టూ తిరిగే ఇబ్బందులకు చెక్ పడనుంది. అందుకోసం వాహనదారులు రాజ్‌మార్గ్ యాత్ర యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. లోకల్ పాస్ ఆప్షన్ ద్వారా వివరాలను నమోదు చేయాలి. దీని కోసం టోల్ ప్లాజా ప్లాంట్ డిప్యూటీ ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. టోల్ ప్లాజాకు 20 కిలో మీటర్ల లోపు ఉన్నవారు అడ్రస్ ప్రూఫ్, వాహన రిజిస్ట్రేషన్ పత్రాలను యాప్‌లో అప్లోడ్ చేయాలి. వాటిని ఎన్‌హెచ్ఏఐ వ్యవస్థ వాటిని ఆటోమేటిక్‌గా వెరిఫై చేయనుంది. మీ అప్లికేషన్ అప్రూవ్ కాగానే మీ వాహనానికి ఉన్న ఫాస్టాగ్ కు లోకల్ పాస్ లింక్ అవుతుంది. దీనివల్ల టోల్ ప్లాజా దాటుతున్నప్పుడు స్థానికులకు ప్రభుత్వం నిర్ణయించిన రాయితీ ధర కట్ అవుతుంది.

ALSO READ: NEET లీకేజీ పై పోరుబాట.. రాహుల్ ముక్కు నుంచి రక్తం.. రంగంలోకి దిగిన సోనియా!

Advertisement

రాజ్‌మార్గ్ యాప్ ద్వారా లోకల్ పాస్-ఈ కొత్త ఫీచర్ వల్ల కాగితపు పనిని తగ్గించడం, సేవల పంపిణీని వేగవంతం అవుతుంది. రహదారికి సంబంధించిన అనేక సేవలను ఒకే డిజిటల్ వేదిక కిందకు తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆ సంస్థ తెలిపింది. ప్రస్తుతానికి డిజిటల్ లోకల్ పాస్ సదుపాయాన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా ఢిల్లీలోని బక్కర్‌వాలా టోల్‌ప్లాజా వద్ద అందుబాటులోకి తెచ్చింది. అక్కడ వచ్చిన స్పందనను పరిశీలించిన తర్వాత దేశవ్యాప్తంగా అన్ని జాతీయ రహదారుల టోల్‌ప్లాజాల వద్ద ఆ వ్యవస్థను విస్తరిస్తామని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది.

Related News

NEET లీకేజీ పై పోరుబాట.. రాహుల్ ముక్కు నుంచి రక్తం.. రంగంలోకి దిగిన సోనియా!

భార్య-పిల్లల నోటికి ప్లాస్టర్‌ అంటించి, ఆ తర్వాత వ్యాపార‌వేత్త ఆత్మహత్య, వెలుగులోకి షాకింగ్ నిజాలు

NEET Protest: ప్రధాని మోదీ ఇంటి వద్ద హై టెన్షన్.. రాహుల్ గాంధీ అరెస్ట్!

Sonam Bail: హనీమూన్​ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. నిందితురాలికి కోర్టు రెండు ఆప్షన్లు..?

రణరంగంగా దేశ రాజధాని.. కదంతొక్కిన విద్యార్థులు, రైతులు.. వెలుగులోకి షాకింగ్ వీడియోలు!

మమ్మల్ని లాగొద్దు.. తక్షణమే విచారించలేం.. బొద్దింకలకు దిల్లీ హైకోర్టు ఝలక్!

ఢిల్లీలో హైటెన్షన్.. ప్రధాని ఇల్లు ముట్టడించిన రాహుల్, ప్రియాంక.. రోడ్డుపైనే ఖర్గే బైఠాయింపు!

Big Stories

Advertisement
×