Engineer Caught: ఒడిశాలోని భువనేశ్వర్‌లో అవినీతి తిమింగలం చిక్కింది. ఆయన ఇంట్లో దొరికిన రెండు కోట్ల రూపాయలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అధికారులు సోదాలకు వస్తున్నారని తెలుసుకున్న ఆయన, ఇంట్లో ఉన్న డబ్బులను కిటికీలో నుంచి విసిరేశాడు. చివరకు డబ్బుతోపాటు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పట్టుబడిన డబ్బు లెక్కింపు చేపడుతున్నారు.
ఒడిషాలో ప్రభుత్వం ఉద్యోగి పేరు బైకుంత నాథ్ సారంగి. ఆ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖలో చీఫ్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. చీఫ్ ఇంజనీర్ అంటే చెప్పనక్కర్లేదు. హోదాకి హోదా ఉంటుంది. ఇక ముడుపుల గురించి చెప్పనక్కర్లేదు. ఆ తరహా ఇంజనీర్లు ఈ మధ్యకాలంలో పట్టుబడుతున్నారు. ఆయనపై విపరీతమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి.
ఆయన రెండ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన సందర్భాలు రాలేదు, సారంగి ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ఆయన ఇంట్లో నోట్ల కొద్దీ నోట్ల కట్టలు ఉన్నట్లు అధికారులకు సమాచారం అందింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా విజిలెన్స్ అధికారులు ఆయనతోపాటు బంధువుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలకు దిగారు.
తనిఖీలకు అధికారులు తన ఇంటికి వస్తున్న విషయం వేగుల ద్వారా తెలుసుకున్నారు సారంగి. ఇంట్లో ఉన్న నోట్ల కట్టలను కిటికీలోంచి బయటపడేసే ప్రయత్నం చేశాడు. అప్పటికే ఆయన ఇంటి చుట్టూ అధికారులు నాలుగు వైపులా మోహరించారు. నోట్ల కట్టలతోపాటు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. పెద్ద బిల్డింగ్ నుంచి కరెన్సీ కట్టలు కిందపడడంతో చుట్టుపక్కల వాసులు ఒక్కసారిగా షాకయ్యారు.
ALSO READ: మోదీ కేవలం మాటల మనిషేనా? క్రెడిట్ మాత్రం కొట్టేస్తారా?
ఒడిశాలోని అంగుల్, భువనేశ్వర్, పూరీలోని పిపిలితోపాటు ఏడు ప్రదేశాలలో ఏకకాలంలో దాడులు చేశారు విజిలెన్స్ అధికారులు. దాదాపు రెండు కోట్ల పైచిలుకు నగదును స్వాధీనం చేసుకున్నారు. అంగుల్‌లో ఇంటిలో రూ.1.1 కోట్లు, భువనేశ్వర్ ఫ్లాట్‌లో మరో కోటి రూపాయలు అధికారులు సీజ్ చేశారు.
ఎనిమిది మంది డీఎస్పీలు, 12 మంది ఇన్స్పెక్టర్లు, ఆరుగురు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లు సహా 26 మంది ఈ సోదాల్లో పాల్గొన్నారు. వీడియోలో అధికారులు నగదును లెక్కిస్తున్నట్లు కనిపించింది. ముఖ్యంగా రూ. 500, రూ. 200, రూ. 100, రూ. 50 నోట్ల కట్టలు కనిపించాయి.
ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలు సారంగిపై ఉన్నాయి. ఈ క్రమంలో సోదాలకు అంగుల్‌లోని విజిలెన్స్ ప్రత్యేక న్యాయమూర్తి సెర్చ్ వారెంట్లు జారీ చేశారు. దీంతో ఏక కాలంలో దాడులు చేపట్టారు. ఆయన ఆస్తులు ఇంకా ఏ రేంజ్‌లో ఉంటాయోనని చర్చించుకుంటున్నారు.
Today , on the allegation of possession of disp. assets by Sri Baikuntha Nath Sarangi, Chief Engineer, RW Division, Odisha, house searches are on by #Odisha #Vigilance at 7 locations. Approx Rs 2.1 Crore cash recovered so far from his house at Bhubaneswar (1 Cr) & Angul (1.1 Cr). pic.twitter.com/j0H344OiqA
— Odisha Vigilance (@OdishaVigilance) May 30, 2025