Big Stories

Odisha : ఒడిశా రైలు ప్రమాదం లేటెస్ట్ అప్ డేట్స్..

Odisha : ప్రమాదంపై ప్రధాని నరేంద్రమోదీ సమీక్ష నిర్వహించారు. రైల్వే శాఖ ఉన్నతస్థాయి అధికారులతో సమావేశమై పరిస్థితిపై ఆరా తీశారు. ఒడిశా వెళ్లి తొలుత బాలాసోర్‌లో ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. ఆ తర్వాత కటక్‌లోని ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శిస్తారు.

- Advertisement -

ప్రమాదానికి గురైన కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఏపీ చెందిన 178 మంది ప్రయాణికులు ఉన్నారని తెలిపింది. 1AC – 9, 11 AC – 17, 3A – 114, స్లీపర్ క్లాస్‌లో 38మంది ప్రయాణించారని పేర్కొంది. విజయవాడలో 33 మంది, ఏలూరులో ఇద్దరు, తాడేపల్లి గూడెంలో ఒకరు, రాజమండ్రిలో 12 మంది దిగాల్సి ఉందని రైల్వే శాఖ అధికారులు తెలిపారు. ఏపీకి చెందిన ప్రయాణికుల ఫోన్ నంబర్లు, ప్రయాణించిన కోచ్, బెర్తుల వివరాలను విజయవాడ స్టేషన్‌లోని హెల్ప్‌ లైన్‌ కేంద్రానికి అధికారులు పంపారు.కర్ణాటక ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని రైల్వే డీఐడీ సాయికుమార్‌ ప్రకటించారు.

- Advertisement -

మరోవైపు ఒడిశా రైలు ప్రమాద నేపథ్యంలో విజయవాడ మీదుగా శనివారం, ఆదివారం నడిచే 21 రైళ్లును అధికారులు రద్దు చేశారు. మరో 11 రైళ్లను దారి మళ్లించారు. దీంతో విజయవాడ రైల్వే స్టేషన్‌ రద్దీగా మారింది. రైళ్ల రద్దు, దారి మళ్లింపుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సికింద్రాబాద్- భువనేశ్వర్ విశాఖ ఎక్స్‌ప్రెస్ శనివారం 4 గంటల ఆలస్యంగా బయలుదేరుతుంది. సాయంత్రం 4.50 బదులు రాత్రి 8.50 గంటలకుకు రైలు బయలుదేరుతుందని అధికారులు తెలిపారు.

ఒడిశా రైలు ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు కేంద్రం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. బాధిత కుటుంబాలకు త్వరగా అందేలా చర్యలు తీసుకుంటున్నామని రైల్వేబోర్డ్‌ సమాచార విభాగ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అమితాబ్‌ శర్మ తెలిపారు. తొలుత 100 మందికి పైగా మృతులకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించామని తెలిపారు. మిగిలిన వారి వివరాలు సేకరించి పరిహారం అందేలా చూస్తామన్నారు. ఒడిశా రైలు ప్రమాదంలో మృతిచెందినవారి కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడినవారికి రూ.50 వేల చొప్పున పరిహారం ఇస్తామని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ప్రకటించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News