Big Stories

Brain Aging : బ్రెయిన్ ఏజ్‌ను తగ్గించే డైట్.. శరీర బరువుతో కనెక్షన్..

Brain Aging : ఒక్కొక్కసారి మనుషుల ఏజ్.. వారి శరీర ఆకృతికి చాలా భిన్నంగా ఉంటుంది. వారి వయసు చిన్నగానే ఉన్నా.. ఆకారంలో కొంచెం పెద్దగా కనిపిస్తుంటారు. అలా జరగకుండా ఉండడం కోసం మార్కెట్లో ఎన్నో కాస్మటిక్ ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. వాటితో పాటు అనేక చికిత్సలు కూడా ఉన్నాయి. అయితే శరీరానికి ఏజింగ్ ఉన్నట్టుగానే బ్రెయిన్‌కు కూడా ఏజింగ్ కూడా ఉంటుంది. ఆ ఏజ్‌ను తగ్గించడం కోసమే శాస్త్రవేత్తలు ఒక కొత్త ప్రయోగం చేశారు.

- Advertisement -

బ్రెయిన్ ఏజింగ్‌ను తగ్గించే డైరెక్ట్ ప్లస్ అనే ప్రయోగం కోసం శాస్త్రవేత్తలు 18 నెలలు కష్టపడ్డారు. దీనికోసం 300 మందిని ఎంపిక చేసుకున్నారు. బ్రెయిన్ ఏజింగ్‌కు కారణమయ్యే అంశాల్లో ఒబిసిటీ కూడా ఒకటి. బ్రెయిన్ ఏజ్‌ను కనుక్కోవడం కోసం ప్రత్యేకమైన స్కానింగ్ ఉంటుంది. మనిషి ఏజ్‌కు , బ్రెయిన్ ఏజ్‌కు చాలావరకు సంబంధం ఉండదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. లైఫ్‌స్టైల్ లాంటి ఎన్నో విషయాలు బ్రెయిన్ ఏజింగ్‌పై ప్రభావం చూపిస్తాయని అన్నారు.

- Advertisement -

డైరెక్ట్ ప్లస్ ప్రయోగం కోసం శాస్త్రవేత్తలు ముందుగా ఒబిసిటీ పేషెంట్లను ఎంపిక చేసుకున్నారు. ముందుగా వారికి బ్రెయిన్ స్కానింగ్‌ను చేపట్టారు. దీన్ని బట్టి చూస్తే.. శరీర బరువు 1 శాతం తగ్గితే.. బ్రెయిన్ ఏజ్ దాదాపు 9 నెలలు తగ్గిపోతుందని ఈ పరిశోధనల్లో తేలింది. ఇది లివర్ ఫ్యాట్ తగ్గడం వంటి వాటిపై కూడా ప్రభావం చూపిస్తుందని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. మామూలుగా లివర్ ఎంజైమ్స్‌పై ప్రభావం పడితే.. అల్జీమర్స్‌ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయని శాస్త్రవేత్తలు ఎప్పుడో నిర్ధారించారు. అంటే ఒబిసిటీ అనేది మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపిస్తుందని అర్థం.

ఈ ప్రయోగాలు అనేవి ఫైనల్‌గా ఒబిసిటీ అనేది తగ్గితే.. బ్రెయిన్ ఏజ్ కూడా తగ్గుతుంది అని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అందుకే లైఫ్‌స్టైల్ మార్చుకోవడం, తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవడం, స్వీట్స్, ఫుడ్, లాంటివి డైట్‌లో తీసుకోవడం ద్వారా బ్రెయిన్ ఏజ్ కూడా ఆటోమేటిక్‌గా తగ్గుతుందని వారు చెప్తున్నారు. శరీర బరువు తగ్గడం అనేది ఎన్నో ఇతర విషయాలను మెరుగుపరచడంతో పాటు బ్రెయిన్ ఏజింగ్‌ను కూడా తగ్గిస్తుందని తెలిసి వారు సంతోషం వ్యక్తం చేశారు.

బ్రెయిన్ ఏజింగ్‌ను, శరీర బరువును ఒకేసారి తగ్గించడం కోసం మెడిటెర్రానియన్ డైట్ అనేది ఉపయోగపడుతుందని డైరెక్ట్ ప్లస్ ప్రయోగంలో తేలింది. ఇప్పటికే మెడిటెర్రానియన్ డైట్ అనేది మెడికల్ రంగంలో అందుబాటులో ఉంది. కానీ డైరెక్ట్ ప్లస్ ప్రయోగం తర్వాత ఈ డైట్‌లో పలు మార్పులు చేర్పులు జరిగాయి. ఈ మార్పులను గమనించి ఒబిసిటీ ఉన్నవారితో పాటు.. ఇతరులు కూడా ఈ డైట్‌ను ఫాలో అవ్వడం వల్ల బ్రెయిన్ ఏజింగ్ అనేది చాలావరకు తగ్గిపోతుందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News