BigTV English

Operation Sindoor : చచ్చాడు చెత్త వెదవ.. మసూద్ అజార్ సోదరుడు హతం..

Operation Sindoor : చచ్చాడు చెత్త వెదవ.. మసూద్ అజార్ సోదరుడు హతం..

Pakistan : ఆపరేషన్‌ సిందూర్‌‌ నెక్స్ట్‌ లెవల్‌కు చేరింది. ఏకంగా పాకిస్తాన్ ప్రధాన నగరాలనే డ్రోన్లతో దెబ్బ కొట్టింది ఇండియన్ ఆర్మీ. లాహోర్‌, రావల్పిండిలను పిండిపిండి చేసింది. పాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను ధ్వంసం చేసింది. ఇండియాపై పాక్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను కూల్చేసింది. అన్ని అంశాల్లో దాయాదిపై అప్పర్ హ్యాండ్ మనదే. ఇదే సమయంలో మరో గుడ్ న్యూస్ కూడా తెలిసింది. ఉగ్ర స్థావరాలపై జరిగిన ఆపరేషన్ సిందూర్‌లో జైషే మహ్మద్ కీలక నేత, కాందహార్ విమాన హైజాక్ మాస్టర్ మైండ్ అబ్దుల్ రవూఫ్ అజహర్ హతమయ్యాడు. ఆ నరరూప రాక్షసుడిని లేపేయడం.. ఇండియన్ ఆర్మీ సాధించిన అతిపెద్ద విజయమనే చెప్పాలి.


రవూఫ్ అజహార్ హతం

ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా.. బహావల్‌పుర్‌లోని మర్కజ్‌ సుబాన్‌ కాంప్లెక్‌పై భారత్‌ అటాక్ చేసింది. ఆ దాడిలో జైషే మహ్మద్ చీఫ్‌ మసూద్‌ అజర్‌ కుటుంబ సభ్యులు, సన్నిహితులు 14 మరణించారు. వీరిలో మసూద్ సోదరుడు రవూఫ్‌ అజహర్‌ కూడా ఉన్నట్టు నిర్ధారణైంది. ఈ దాడిలో అజహర్‌ సోదరి, ఆమె భర్త, మేనల్లుడు, అతడి భార్య సహా పలువురు మృతి చెందినట్లు చెబుతున్నారు.


వాడెంత కిరాతకుడంటే..

1999లో జరిగిన విమానం హైజాక్‌లో రవూఫ్‌ అజహర్‌ హస్తం ఉంది. ఐదుగురు పాక్‌ ఉగ్రవాదులు నేపాల్‌లో ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానాన్ని హైజాక్‌ చేసి కాందహార్‌కు తీసుకెళ్లారు. భారత జైళ్లలో ఉన్న మసూద్‌ అజహర్‌, అహ్మద్‌ ఒమర్‌ సయీద్‌ షేక్‌, ముస్తాక్‌ అహ్మద్‌ జర్గర్‌ అనే కరుడుగట్టిన ఉగ్రవాదులను విడుదల చేస్తేనే.. విమాన ప్యాసింజర్లను రిలీజ్ చేస్తామని, లేదంటే చంపేస్తామని బెదిరించారు. ఉగ్రవాద డిమాండ్లకు తలొగ్గిన కేంద్రం.. ఆ ముగ్గురు టెర్రరిస్టులను వాళ్లకు అప్పగించింది. వారిలో ఒకడే మసూద్ అజార్. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థను స్థాపించింది అతనే. అన్న కోసం విమానాన్ని హైజాక్ చేసింది అతని తమ్ముడు రవూఫ్ అజహర్. ఆనాటి నుంచి పాకిస్తాన్‌లో మకాం వేసి.. ఉగ్రవాదులను తయారు చేస్తూ.. కశ్మీర్‌లో కల్లోలం సృష్టిస్తున్నారు ఆ సోదరులు. 2001లో జరిగిన పార్లమెంట్‌పై దాడి, 2016లో పఠాన్‌ కోట్‌ దాడి, 2019లో పుల్వామా బాంబింగ్‌ వంటి ఉగ్ర ఘటనల్లో వాళ్ల ప్రమేయం ఉంది. రవూఫ్ ప్రస్తుతం జైషే మహ్మద్ సంస్థలో కీలక కమాండర్‌గా ఉన్నాడు. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా బహవల్‌పూర్‌లో జరిగిన బాంబింగ్‌లో అతడు హతమయ్యాడు.

Related News

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

MP News: పట్టించుకోని వాహనదారులు.. పెట్రోల్ కష్టాలు రెట్టింపు, ఏం జరిగింది?

Big Stories

×