BigTV English

PM Narendra Modi:ప్రధాని మోదీకి పాకిస్తాన్ ప్రత్యేక ఆహ్వానం..ఎందుకో తెలుసా?

PM Narendra Modi:ప్రధాని మోదీకి పాకిస్తాన్ ప్రత్యేక ఆహ్వానం..ఎందుకో తెలుసా?

Pakistan Invites PM Modi to Attend SCO Meeting: భారత ప్రధాని నరేంద్ర మోదీకి పాకిస్తాన్ రావాల్సిందిగా ఆహ్వానం అందింది. ప్రతిష్టాత్మక ‘షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్’ అత్యున్నత భేటీని పాకిస్తాన్ ఈ ఏడాది అక్టోబర్ 15, 16 తేదీలలో నిర్వహించనుంది.


రాజధాని ఇస్లామాబాద్ ఈ సమ్మిట్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సమావేశానికి ఎస్‌సీఓలో సభ్యత్వం ఉన్న దేశాల అధ్యక్షులు, ప్రధాన మంత్రులు లేదా విదేశాంగ శాఖ మంత్రులు హాజరవుతారు.

ఈ ఆర్గనైజేషన్ 2001లో ఏర్పాటైంది. ఇందులో భారత్, చైనా, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, రష్యా, పాకిస్తాన్, తజకిస్తాన్, ఉజ్జెకిస్తాన్ దేశాలకు సభ్యత్వం ఉంది. అఫ్ఘనిస్తాన్, బెలారస్, ఇరాన్, మంగోలియా, అబ్జర్వర్, స్టేట్స్ హోదాలో కొనసాగుతున్నాయి.


అలాగే, ఆర్మేనియా, అజర్ బైజాన్, కాంబోడియా, నేపాల్, శ్రీలంక, టర్కీలకు డైలాగ్ పార్ట్‌నర్‌షిప్ ఉంది. ఈ సమ్మిట్ లో సభ్యదేశాల మధ్య ధ్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలనేది ముఖ్య ఉద్ధేశం.

గతేడాది ఈ సమ్మిట్ ను భారత్‌లోని గోవాలో నిర్వహించింది. ఈ ఏడాది పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఇందులో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీకి పాకిస్తాన్ అధికారికంగా ఆహ్వాన పత్రాలను పంపించింది.

Also Read:  ‘చెప్పుతో కొట్టు’.. శివాజీ విగ్రహ వివాదంపై మహారాష్ట్రలో వింత నిరసన

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×