BigTV English

Pappu yadav crying: పప్పుయాదవ్ కంటతడి.. ఏమైంది?

Pappu yadav crying: పప్పుయాదవ్ కంటతడి.. ఏమైంది?

pappu yadav crying on purnea seat issue


Pappu yadav crying: బీహార్ రాజకీయాలు అనగానే ముందుగా పప్పుయాదవ్ అలియాస్ రాజేష్ రంజన్ గుర్తుకొస్తారు. టికెట్ రాలేదన్న కారణంగా చిన్నపిల్లాడి మాదిరిగా కంటతడి పెట్టారు. పట్టరాని కోపంతో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఈ క్రమంలో ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్‌తోపాటు తేజస్వీపై విమర్శలు గుప్పించారు.

లోక్‌సభ ఎన్నికల్లో బీహార్‌లోని పూర్నియా నుంచి పోటీ చేయాలని పప్పుయాదవ్ ఎన్నో ఆశలు పెట్టు కున్నారు. ఈ క్రమంలో పలుమార్లు ఆర్జేడీ అధినేత లాలూ, తేజస్వీతో చర్చలు జరిపారు. తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు కూడా. కానీ ప్రయోజనం లేకపోయింది. ఆర్జేడీ-కాంగ్రెస్ పొత్తులో భాగంగా పూర్నియా సీటు ఆర్జేడీకి వెళ్లింది. అక్కడి నుంచి ఆ పార్టీకి చెందిన భీమా భారతి నామినేషన్ దాఖలు చేశారు.


దీనిపై పప్పుయాదవ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తనకు పదేపదే టికెట్‌ను నిరాకరిస్తున్నారని, తనకేం తక్కువంటూ మండిపడ్డారు. తాను ఏడాదిగా పూర్నియా కోసం పని చేశానని గుర్తు చేశారు. పొత్తులో భాగంగా అభ్యర్థులు ఖరారయ్యారని బీహార్ కాంగ్రెస్ తెలిపింది. పప్పుయాదవ్ తమకు పోటీదారుడు కాదని, ఆయన మద్దతు ఆర్జేడీ అభ్యర్థికేనని తెలిపారు.

బీహార్‌‌‌లో ప్రముఖ రాజకీయ నాయకుడు పప్పూయాదవ్. కాకపోతే తరచూ వివాదాల్లో చిక్కుకుంటారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా అనేకసార్లు పని చేశారు. 1980ల్లో జనతాదళ్‌తో రాజకీయ జీవితం ప్రారంభించిన పప్పూయాదవ్, స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. ఆ తర్వాత ఆర్జేడీ తరపున చట్ట సభల్లో అడుగుపెట్టారు. కానీ మారుతున్న రాజకీయాలకు పప్పూయాదవ్‌కు మొండిచేయి మిగిలింది.

Tags

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×