E-Paper
Advertisement

Parliament Winter Season 2024: రెండోరోజు పార్లమెంట్‌ సమావేశాలు.. అదానీపై చ‌ర్చ జ‌ర‌గాల్సిందే.. ప‌ట్టువీడ‌ని విప‌క్షాలు

Parliament Winter Season 2024: రెండోరోజు పార్లమెంట్‌ సమావేశాలు.. అదానీపై చ‌ర్చ జ‌ర‌గాల్సిందే.. ప‌ట్టువీడ‌ని విప‌క్షాలు
Advertisement

Parliament Winter Season 2024: పార్ల‌మెంట్ శీతాకాల‌ స‌మావేశాలు నిన్న ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. కాగా ఈరోజు రెండో రోజు పార్ల‌మెంట్ స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయి. ఈ స‌మావేశాల్లో రాజ్య‌స‌భ ముందు భార‌తీయ వాయుయాన్ విధేయ‌క్ బిల్లును ప్ర‌వేశపెట్ట‌నున్నారు. ఈ బిల్లును కేంద్ర విమాన‌యాన మంత్రి రామ్మోహ‌న్ నాయుడు ప్ర‌వేశ‌పెట్ట‌బోతున్నారు. అంతే కాకుండా అదానీ కేసు, మ‌ణిపూర్ అల్ల‌ర్ల అంశాల‌పై స‌మావేశంలో చ‌ర్చించాల‌ని విప‌క్షాలు ప‌ట్టుబ‌డుతున్న సంగ‌తి తెలిసిందే. నిన్న అదానీ లంచం ఆరోప‌ణ‌లపై చ‌ర్చ జ‌ర‌పాల్సిందేన‌ని ఇండియా కూట‌మి నేత‌లు డిమాండ్ చేశారు.

Also read: తాజ్ హోటల్‌లో.. ఎంపీలకు దావత్ ఇస్తున్న ఏపీ డిప్యూటీ సీఎం

Advertisement

రాజ్య స‌భ‌, లోక్ స‌భ‌లో చ‌ర్చ జ‌ర‌గాల‌ని అన్నారు. కానీ లోక్ స‌భ స్పీక‌ర్, రాజ్య‌స‌భ చైర్మ‌న్ చ‌ర్చ‌కు అనుమ‌తించ‌లేదు. దీంతో విప‌క్ష ఎంపీలు సైతం త‌గ్గేదే లే అన్నారు. అదానీని మోడీ కాపాడుతున్నాడంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో స‌భ‌లో గంద‌ర‌గోళం నెల‌కొంది. స‌భ‌ను నేటికి వాయిదా వేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. అయితే ఇవాళ కూడా అదానీ లంచం ఆరోప‌ణ‌ల‌పై చ‌ర్చ జ‌ర‌గాల్సిందేన‌ని ఇండియా కూట‌మి నేత‌లు డిమాండ్ చేస్తున్నారు. నేడు ఇండియా కూటమికి చెందిన భాగస్వామ్యపక్షాల ఫ్లోర్‌ లీడర్ల సమావేశం అయ్యారు. పార్లమెంట్‌ భవన్‌లో కూటమి భాగస్వామ్యపక్షాల ఫ్లోర్‌ లీడర్లు భేటీ అయ్యారు.

అదానీపై అమెరికా చేసిన నేరారోపణలపై విచారణ జరిపేందుకు ‘సంయుక్త పార్లమెంటరీ కమిటీ’ని ఏర్పాటు చేయాలంటున్నారు. ఈ అంశంపై కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న చేయాల్సిందేన‌ని ప‌ట్టుప‌డుతున్నారు. ఇదిలా ఉంటే అదానీ లంచం వ్య‌వ‌హారం వెలుగులోకి రావ‌డంతో ప్ర‌ధాని మోడీపై ఆరోప‌ణ‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. మోడీ ప్రాజెక్టుల‌న్నీ అదానీకి క‌ట్ట‌బెట్టి ఆయ‌న‌ను కుభేరుడిని చేస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అర్హ‌త లేకున్నా అదానీ కంపెనీల‌కు రుణాలు ఇస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. దీంతో అమెరికాలో లంచం కేసులో అదానీ అరెస్ట్ అయితే మోడీ రాజీనామా చేయాల‌ని ఇండియా కూట‌మి నేత‌లు డిమాండ్ చేస్తున్నారు.

Tags

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×