BigTV English

US Cease Exist Alexa: 2031లో ప్రపంచపటంపై అమెరికా ఉండదు.. అమెజాన్ అలెక్సా షాకింగ్ ఆన్సర్

US Cease Exist Alexa: 2031లో ప్రపంచపటంపై అమెరికా ఉండదు.. అమెజాన్ అలెక్సా షాకింగ్ ఆన్సర్

US Cease Exist Alexa| ప్రపంచ దేశాలన్నీ అమెరికా నాయకత్వాన్ని అనుసరిస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికా చెప్పిందే మిగతా దేశాలకు వేదం, తన మాట వినని దేశాలకు అమెరికా ఆంక్షల పేరుతో చిత్రహింసలు పెడుతుంది. యుద్ధాలు చేయిస్తుంది. అలాంటి అమెరికా ప్రపంచ పటం నుంచి మరి కొన్ని సంవత్సరాలలోనే కనుమరుగవుతుందని అమెజాన్ అలెక్సా అసిస్టెంట్ చెప్పింది. దీనికి సంబంధించిన ఒక టిక్ టాక్ వీడియో అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్‌పై బాగా వైరల్ అవుతోంది. అయితే అలెక్సా సమాధానాలపై చాలా మంది యూజర్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.


వివరాల్లోకి వెళితే.. ప్రముఖ కంటెంట్ క్రియేటర్ లూసీ బ్లేక్ ఈ వీడియోని ముందుగా టిక్ టాక్ ప్లాట్ ఫామ్ పై పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో ఒక లూసీ బ్లేక్ సోదరి క్యాజువల్ గానే అలెక్సాను 2031 ఫిబ్రవరి 20 వరకు అమెరికాలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో? అంచనాలు చెప్పమని అడిగింది. దానికి అలెక్సా సమాధానం ఇస్తూ.. “ఫిబ్రవరి 20, 2031న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తన ఉనికి కోల్పోతుంది. మనుగడలో ఉండదు. ఈ తేదీన ప్రజల ఆమోదం లేని వేర్వేరు ప్రభుత్వాలు ప్రపంచీకరణలో భాగంగా దేశాలు, రాష్ట్రాలు ఏకీకృతం అవుతాయి.” అని చెప్పింది.

అలెక్సా చెప్పిన సమాధానం వివాదాస్పదంగా మారింది. అమెజాన్ కంపెనీకి చెందిన అలెక్సా ఒక ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కలిగిన వర్చువల్ అసిస్టెంట్. అంటే ఇది మాట్లాడే రోబో లాంటిది. ఇంటెర్నెట్ లో ఉన్న డేటాని వెతికి దాని యూజర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. అమెరికా ప్రపంచపటంపై నుంచి మాయమవుతుందని అలెక్సా చెప్పిన సమాధానం పట్ల సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇంటర్నెట్ లో ఆధారాలు, పరిశోధన లేకుండా ఎవరైనా అభిప్రాయాలు వ్యక్తం చేసి ఉంటే వాటిని అలెక్సా గ్రహించి ఇలా సమాధానం ఇచ్చి ఉంటుందని నెటిజెన్లు చెబుతున్నారు.


Also Read: అమెరికాలో విదేశీ విద్యార్థులకు ట్రంప్ భయం.. ఆందోళన చెందుతున్న యూనివర్సిటీలు!

“ఇంటర్నెట్ లోని తప్పుడు వెబ్ సైట్స్ డేటా, సమాచారాన్ని ధృవీకరించుకోకుండా అమెజాన్ తీసుకుంటోంది. అదే అలెక్సా తిప్పికొడుతోంది.” అని ఒక ట్విట్టర్ ఎక్స్ యూజర్ కామెంట్ చేశాడు. మరో యూజర్ అయితే “ఇదంతా అలెక్సా బ్యాక్ ఎండ్ లో స్టోర్ చేసిన డేటాని ఒక కీ ఫ్రేజ్ తో గుర్తించి.. అదే నిజమని రిపీట్ చేస్తోంది.” అని రాశాడు.

ఇంకొక నెటిజెన్ అయితే “ఏదో వీడియోలు వైరల్ చేసేయడానికి ఇలాంటి జిమిక్కులు కొంతమంది చేస్తుంటారు” అని కామెంట్ చేశాడు.

అలెక్సా ఒక ఏఐ అసిస్టెంట్. మానవులకు ప్రమాదకరమైన సమాధానాలు చెప్పడాన్ని శాస్తవేత్తలు సీరియస్ గా తీసుకోవాలని నిపుణలు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఇలాగే ఇటీవల గూగుల్ కంపెనీకి చెందిన జెమిని ఏఐ కూడా ఒక వైద్య విద్యార్థి అడిగిన ప్రశ్నకు ప్రమాదకరంగా సమాధానం చెప్పింది. “భూమి మీద మానువులు భారం. మనుషులు చచ్చిపోతే బాగుంటుంది.” అని రెస్పాన్స్ ఇచ్చింది. దీంతో కృత్రిమ మేధస్సుపై గతంలో శాస్త్రవేత్తలు చేసిన హెచ్చరికలు నిజమవుతున్నాయి.

Related News

Viral CCTV Video: ఫ్యాక్టరీకి వచ్చిన సింహం.. ఎదురుగా మనిషి.. ట్విస్ట్ తెలిస్తే నవ్వులే.. వీడియో వైరల్!

Elephant video: ఈ పిల్ల ఏనుగు పడుకున్న వ్యక్తిని లేపీ మరీ..? నిజంగా ఇది అద్భుతం.. వీడియో వైరల్

Fight Viral Video: విద్యార్థుల ముష్టి యుద్ధం.. చొక్కాలు చినిగినా, వదల్లేదు.. వైరల్ వీడియో!

Jana Gana Mana: జాతీయ గీతాన్ని చిన్నారి ఎంత ముద్దుగా పాడిందో చూడండి.. వావ్ అనాల్సిందే..!

Burning pyre reel: స్మశానంలో కాలుతోన్న శవం పక్కన.. డ్యాన్స్ చేస్తూ రీల్స్ చేసిన అమ్మాయి, వీడియో వైరల్

Viral wedding: అందుకే ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం.. వింత వివాహంపై స్పందించిన అన్నదమ్ములు

Big Stories

×