Passengers jump: ప్రమాదాలు ఎప్పుడు, ఎలా జరుగుతాయో తెలీవు. ఆ రోజు మన అదృష్టం బాగా లేకుంటే అస్సలు ఊహించలేము. సరిగ్గా పైన కనిపిస్తున్న బస్సులో అదే జరిగింది. ముందుకు వెళ్తన్న బస్సుకు ఒక్కసారి బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. కంగారు పడిన ప్రయాణికులు తమ ప్రాణాలకు తెగించి బస్సు నుంచి జంప్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది.
ప్రకృతి అందాలకు నెలవు జార్ఖండ్. అక్కడ ప్రయాణం చాలామంది అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే ఎటు చూసినా పొడవైన చెట్లు కనిపిస్తుంటాయి. దీనికి మైనింగ్‌కు ఫేమస్ ఆ ప్రాంతం. కతికుడ్ ఏరియాలో 30 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సుకు బ్రేకులు ఫెయిలయ్యాయి. డ్రైవర్ సమయ స్ఫూర్తితో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది.
గురువారం ఉదయం సుమారు 10.45 గంటలకు దుమ్కా నుంచి పాకూర్‌కు 30 మంది టూరిస్టులతో ఓ బస్సు వెళ్తోంది. అయితే నైరా ప్రాంతంలోని ఓ పెట్రోల్ పంపు వద్దకు రాగానే బస్సు బ్రేకులు అకస్మాత్తుగా విఫలమయ్యాయి. ముందుకు వెళ్లాల్సిన బస్సు కాస్త వెనక్కి వెళ్లింది. పరిస్థితి గమనించిన డ్రైవర్ బస్సులోని టూరిస్టులను అప్రమత్తం చేశాడు. బస్సును నియంత్రించడానికి డ్రైవర్ తీవ్ర ప్రయత్నాలు చేశారు. బస్సు వెనక్కి వెళ్లడం గమనించిన ప్రయాణికులు పురుషులు-మహిళలు బస్సులో నుంచి దూకేయడం మొదలుపెట్టారు.
చాలామంది రోడ్ల మీద పడిపోవడంతో గాయాలు అయ్యాయి. వెనుకాల ముళ్ల డొంక ఉండడంతో కండక్టర్ కూడా బస్సు నుంచి దూకి రాళ్లు తీసుకొచ్చి బస్సు టైర్ల కింద పెట్టడంతో అది కాస్త ఆగింది. అప్పటికి ప్రయాణికులంతా బస్సు నుంచి దూకేశారు. ఈ సంఘటన జరిగిన తర్వాత ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు తరలించడానికి మరో బస్సును ఏర్పాటు చేశారు. డ్రైవర్ బస్సును అదుపులో ఉంచకుంటే పెను ప్రమాదం జరిగేదని అన్నారు టూరిస్టులు.
ALSO READ: భూటాన్‌లో బద్దలైన హిమానీనద సరస్సు.. అస్సాం- బెంగాల్‌కు బిగ్ అలర్ట్, సురక్షిత ప్రాంతాలకు ప్రజలు
ఆ ప్రాంతంలో మైనింగ్ జరుగుతుండడంతో బస్సుకు అపోజిట్‌గా భారీ టిప్పర్లు వెళ్తున్నాయి. ఈ సన్నివేశాన్ని గమనించిన టిప్పరులోని వ్యక్తి దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ఈ వీడియో నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు.
झारखंड के दुमका जिले के काठीकुंड में बस के ब्रेक फेल होने की खबर से हड़कंप मच गया! 🚌
इसके बाद जो हुआ, वो देखकर किसी की भी साँसें थम जाएँ!#Jharkhand #sanatandharma #GodMorningFriday #RoadSafety #ViralVideo pic.twitter.com/pM6p43W0xy— Swagatika (@swagatika995) October 30, 2026