Kamran Akmal On Abhishek Sharma: న్యూజిలాండ్ వర్సెస్ టీమిండియా (New Zealand vs Team India) మధ్య జరిగిన మూడవ టి20 సందర్భంగా అభిషేక్ శర్మ ( Abhishek Sharma) సూపర్ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సెంచరీ నేపథ్యంలో అభిషేక్ శర్మపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. లేటెస్ట్ గా పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ (Kamran Akmal) కూడా అభిషేక్ శర్మను మెచ్చుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
టీ20 క్రికెట్ లో అత్యంత ప్రమాదకరమైన ఆటగాడిగా అభిషేక్ శర్మ నిలిచాడని వెల్లడించాడు. ఇతను గనుక వన్డేల్లో ఆడితే, 500 పరుగులు సులభంగా కొడతాడని షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. కనీసం 20 ఓవర్ల వరకు నిలబడితే.. సులభంగా 500 కొట్టేస్తాడని ప్రశంసించాడు. ఇలాంటి వాడిని వన్డేల్లోకి టీమిండియా తీసుకురావాలని డిమాండ్ చేశాడు. ఆ దిశగా టీమిండియా క్రికెట్ యాజమాన్యం అడుగులు వేయాలని కోరాడు. దీంతో అభిషేక్ శర్మ పై కమ్రాన్ అక్మల్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
న్యూజిలాండ్ పై అభిషేక్ శర్మ సెంచరీ చేయడంపై పాకిస్తాన్ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన బ్యాటర్ గా అభిషేక్ శర్మ కనబడుతున్నాడని వెల్లడించాడు. ప్రతి మ్యాచ్ లోను అత్యంత క్రూరంగా ఎలాంటి భయం లేకుండా అతడు షాట్లు ఆడుతున్నాడని ప్రశంసించాడు. ఒకవేళ అభిషేక్ శర్మ వన్డే క్రికెట్ లోకి వస్తే.. ప్రత్యర్థులకు నరకమే అంటూ వ్యాఖ్యానించాడు. మంచినీళ్లు తాగినంత ఈజీగా 500 పరుగుల మార్పు దాటేస్తాడని అభిప్రాయపడ్డాడు కమ్రాన్ అక్మల్.
ఔట్ అవుతాడనే భయం ఏ మాత్రం అతనికి లేదని.. అందుకే మొదటి బంతి నుంచి ఎటాకింగ్ చేస్తాడంటూ ప్రశంసించాడు. అందుకే చాలా సార్లు అభిషేక్ శర్మ సెంచరీలు చేయడమే కాకుండా డకౌట్స్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయని గుర్తు చేశాడు. డక్ అవుట్ అయినా పర్వాలేదని షాట్లకు వెళ్లేవాడే అసలు సిసలు మొనగాడు అంటూ మెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఉన్న టీ20 బ్యాటర్ల అందరిలో అభిషేక్ శర్మ (Abhishek Sharma) చాలా ముందు వరుసలో ఉన్నాడని వివరించాడు. అతను ఓ ప్రత్యేకమైన ప్రతిభావంతుడు అంటూ కితాబు ఇచ్చాడు. కానీ కొంతమంది అభిషేక్ శర్మపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యాడు. తమ పాకిస్తాన్ మాజీలే ఇందులో ఉన్నారంటూ ఆగ్రహించాడు. దీంతో కమ్రాన్ అక్మల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.