Triple murder in Lucknow: యూపీ రాజధాని లక్నోలో దారుణం జరిగింది. పార్కింగ్ వివాదం తీవ్రంకావడంతో ముగ్గురి ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ షూటర్.. పొరుగింటిలో ఉండే ఓ కుటుంబానికి పట్టపగలు కాల్చి చంపిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు నెట్టింటో గిరగిరా తిరిగేస్తున్నాయి.
లక్నోలోని సాదత్‌గంజ్ ప్రాంతంలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. అక్టోబర్ 26న అంటే సోమవారం ఉదయం 10.30 గంటలకు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి శివాజీ తివారీ, ఆయన సోదరుడు శంభు, కొడుకు సుయాశ్ దారుణంగా హత్యకు గురయ్యారు. శివాజీ తివారీకి ఇంటి పక్కన నివాసం ఉన్న రిషభ్ శుక్లాతో పార్కింగ్ స్థలంపై కొన్నాళ్లుగా వివాదం నడుస్తోంది. ఘటన జరిగిన రోజు ఉదయం తివారీ ఫ్యామిలీ మెంబర్ ఒకరు వివాదాస్పద స్థలంలో కారు పార్క్ చేయడంతో ఈ ఘటనకు కారణమైంది.
శివాజీ-రిషబ్ మధ్య మాటల వివాదం కాస్త ముదిరిగింది. అది కాస్త తీవ్రరూపం దాల్చడంతో ఆగ్రహానికి గురయ్యాడు రిషభ్ శుక్లా. పట్టరాని కోపంతో తన వద్దన్న పిస్టల్‌తో ఏకంగా శివాజీ ఫ్యామిలీపై కాల్పులకు దిగాడు. కేవలం 22 సెకన్లలో 5 రౌండ్లు కాల్పులు జరిపాడు. ఘటనకు మధ్యలో పిస్టల్ రీలోడ్ చేసి మరో మూడుసార్లు కాల్పులు జరిపినట్లు వీడియోలో కనిపించింది. ఈ కాల్పుల ఘటనలో శివాజీ, అతడి బ్రదర్ శివేంద్ర, కొడుకు సుయాశ్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానికులు వెంటనే ట్రామా సెంటర్‌కు తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ ముగ్గురు మరణించారు. నవంబర్ వివాహానికి రెడీ అవుతున్న సుయాశ్, ఆయన తండ్రి మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. నిందితుడు రిషభ్ శుక్లా గతంలో మర్చంట్ నేవీలో అధికారిగా పని చేశాడు. అంతేకాదు రాష్ట్రస్థాయి షూటర్ కూడా. వివిధ పోటీల్లో పాల్గొని పతకాలు సాధించాడు కూడా. ఈ ఘటన గురించి తెలియగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. నిందితుడ్ని అరెస్ట్ చేసి పిస్టల్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై బాధితుల కుటుంబం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ALSO READ: ఆ బస్సులో బ్రేకులు ఫెయిల్.. బస్సు నుంచి దూకేసిన ప్రయాణికులు, షాకింగ్ వీడియో
నిందితుడిపై పలుమార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ వ్యవహారంపై పైస్థాయి అధికారుల వరకు వెళ్లడంతో ఎస్‌హెచ్‌వో సహా ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిందితుడు కాల్పులు జరపడం, బాధితులు సాయం కోసం ఆర్తనాలు అందులో కనిపిస్తున్నాయి. వారు నన్ను ఇటుకతో కొట్టారని, అందుకే నేను కాల్పులు జరిపానని వీడియోలో వాయిస్ వినబడుతోంది. వీడియో డిజిటల్ ఆధారాలు భావించి కేసు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
Live Video Viral लखनऊ के सआदतगंज थाना क्षेत्र के नौबस्ता में 26 अक्टूबर को कार पार्किंग और चबूतरे के विवाद में ताबड़तोड़ फायरिंग हुई। इस घटना में एक ही परिवार के शिवाजी तिवारी, उनके भाई शंभू तिवारी और बेटे सुयश तिवारी की मौत हो गई। पुलिस ने मुख्य आरोपी ऋषभ शुक्ला को गिरफ्तार कर… pic.twitter.com/A2gACTMTY3
— UttarPradesh.ORG News (@WeUttarPradesh) October 29, 2026