E-Paper
Advertisement

కష్టపడ్డా అమన్ కి దక్కని ఫలితం.. కంటెస్టెంట్స్ సపోర్టు కూడా లేదా?

కష్టపడ్డా అమన్ కి దక్కని ఫలితం.. కంటెస్టెంట్స్ సపోర్టు కూడా లేదా?
Advertisement

BIGG BOSS 10: బిగ్ బాస్ సీజన్ 10 ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ముఖ్యంగా కంటెస్టెంట్స్ మధ్య ఆట తీరు, మాటల యుద్ధం హద్దులు దాటుతుంటే.. ఆడియన్స్ కి కాస్త చిరాకు కలిగించినా.. నెక్స్ట్ ఎపిసోడ్ పై ఆసక్తి మాత్రం విపరీతంగా పెరుగుతోంది అనే చెప్పాలి. ముఖ్యంగా కామనర్స్, కంటెస్టెంట్స్, వైల్డ్ కార్డు ఎంట్రీస్ మధ్య జరుగుతున్న ఈ పోరు షోపై మరింత ఆసక్తిని పెంచేసిందని చెప్పవచ్చు. ఇకపోతే తాజాగా ప్రతి వారం ప్రతి టాస్క్ లో ఏదో ఒక కొత్తదనం ఆడియన్స్ కి మరింత ఇంట్రెస్ట్ కలిగిస్తోంది. అల్టిమేట్ గోట్ గా మారడానికి కంటెస్టెంట్స్ మధ్య పెట్టిన టాస్కులు కాస్త వినోదంతో పాటు గొడవలకు కూడా దారితీసాయి. ఇకపోతే తాజాగా 54వ రోజుకు సంబంధించిన మొదటి ప్రోమో విడుదల చేయగా.. అందులో అందరూ కలసి అమన్ కి అన్యాయం చేస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

కష్టపడ్డా అమన్ కి దక్కని ఫలితం..

తాజా ప్రోమో విషయానికి వస్తే.. గోట్ అవతారంలో భాగంగా గ్రీన్ లెవెల్ కి వెళ్లి గోట్ గా మారడానికి మీరంతా ఎంత కష్టపడ్డారో అందరూ చూశారు. అయితే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ కెప్టెన్ గా మారి అల్టిమేట్ గోట్ గా మారడానికి మీరు చివరి పోరాటం చేయాల్సి ఉంటుంది అంటూ చెప్పిన బిగ్ బాస్.. అమన్ తో మాట్లాడుతూ.. మీపై ఉన్న కెప్టెన్సీ కంటెండర్ కాలేని పనిష్మెంట్ ఇంకా పూర్తి కాలేదు. కాబట్టి ఈ పోరాటంలో మీరు ముందుకు వెళ్లలేరు అంటూ చెప్పి షాక్ ఇచ్చాడు. మొత్తానికైతే గోట్ గా మారడానికి ఎంతో కష్టపడ్డ అమన్ కి ఇప్పుడు కెప్టెన్ అయ్యే అవకాశం లేకుండా చేయడంతో ఆయన అభిమానులు బిగ్ బాస్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొదటినుంచి కష్టపడుతున్న అమన్ కి బిగ్ బాస్ కావాలని అన్యాయం చేస్తున్నాడా అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

ALSO READ: “బాసింగ బలాలు” పాటకి 11 లక్షలు ఖర్చుపెడితే ఎంత వచ్చిందో తెలుసా?

నీతూ, వర్షిణి మీరేమైనా చిన్న పిల్లలా?

దీనికి తోడు కంటెస్టెంట్స్ కూడా అమన్ కి సపోర్ట్ గా నిలవకపోవడం గమనార్హం. అయితే చివర్లో ఒక ట్విస్ట్ ఇచ్చాడు. బిగ్ బాస్ మీరు టాస్క్ లో పోటీ చేయాలి అంటే ముగ్గురు సపోర్టర్స్ ని ఎంచుకోవాలి అని చెబుతాడు. ఇక అందరూ డిస్కషన్స్ చేస్తుండగా.. నీతూ నటరాజ్.. వంశీ ఆడితే తాను ఆడనని చిన్నపిల్లలా మొండికేసింది. ఒకదానితో వంశీ,నీతూపై మండిపడ్డాడు. మీరు హౌస్ లో ఉన్నారు.. ఇక్కడ ఆడకపోతే బయటకు వెళ్లిపోండి అంటూ గొడవపడ్డాడు. నీతూ కూడా టాస్క్ లో జరిగిన విషయాన్ని పర్సనల్ గా తీసుకొని అతనితో ఆడడానికి ఇష్టపడలేదు. ఇక మరొకవైపు దేబ్జానీ తమ టీం సభ్యుల గురించి చెబుతుండగా ఆ టీంలో ఉన్న వర్షిణి మాకు అమన్ అక్కర్లేదు అంటూ చెప్పింది. మధ్యలో డిస్కషన్ జరుగుతుండగా.. రోహిత్ వచ్చి అమన్ ను తీసేసి ఝాన్సీ ని పెట్టండి అంటూ కామెంట్ చేశాడు.

అమన్, రోహిత్ మధ్య ముదిరిన వాగ్వాదం..

Advertisement

దీంతో ఫైర్ అయిన అమన్ అసలు నువ్వెలా చెబుతావు అంటూ మండిపడ్డాడు. అలా ఇద్దరి మధ్య వాగ్వాదం ఏకంగా పర్సనల్ కి వెళ్ళిపోయింది. ఏది ఏమైనా కంటెస్టెంట్స్ కూడా అమన్ కి సపోర్టు ఇవ్వడం లేదు ఆడియన్స్ మండిపడుతున్నారు.

Related News

“బాసింగ బలాలు” పాటకి 11 లక్షలు ఖర్చుపెడితే ఎంత వచ్చిందో తెలుసా?

ఈ వారం కూడా వర్షిణి సేఫ్.. డేంజర్ జోన్ లో ఎవరున్నారంటే?

‘బ్రహ్మముడి’ అప్పు సీరియల్స్ కు గుడ్ బై చెప్పేసిందా..?

Podarillu Today Episode : చక్రీ ని తిట్టిన కన్నా.. కన్నీళ్లు తెప్పించే సీన్.. నారాయణ పై కొడుకులు ప్రేమ..

Gundeninda GudiGantalu Today episode: గుడిలో బాలు కుటుంబం సందడి.. అత్తా vs కోడలు.. గుణకు మైండ్ బ్లాక్..

Karthika Deepam 2 Serial Today Episode October 30th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సుమిత్ర దశరథ ను వదిలేసి వెళ్లిపోతుందా..?     

Intinti Ramayanam Today Episode: భరత్ పై భానుమతి సీరియస్..అయ్యో రమ్య.. పల్లవికి వార్నింగ్..

Big Stories

Advertisement
×