Zomato mehmaan mode: ప్రస్తుత ఫాస్ట్ లైఫ్‌లో వంట చేసే పని తగ్గించుకుని ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేయడం రోజువారీ అలవాటుగా మారిపోయింది. వీకెండ్స్ అయినా, ఇంట్లో చిన్నపాటి పార్టీలైనా జొమాటో, స్విగ్గీ వంటి యాప్స్ మన ముందుకు వచ్చేస్తాయి. అయితే.. ఇంట్లో బంధువులు లేదా గెస్టులు ఉన్నప్పుడు అందరం కలిసి కూర్చుని ఏ ఐటమ్ కావాలనేది ఫోన్‌లో సెలెక్ట్ చేసుకుంటాం. ఆ సమయంలో కార్ట్‌లో యాడ్ అయ్యే ఫుడ్ ఐటమ్స్ ధరలు స్క్రీన్‌పై కనిపిస్తుండటంతో గెస్టులు ఖరీదైన ఐటమ్స్ ఆర్డర్ చేయించడానికి వెనకాడతారు. ఈ చిన్న మొహమాటాన్ని తొలగించడానికే.. జొమాటో సంస్థ సరికొత్తగా “మెహమాన్ మోడ్” ఫీచర్‌ను తీసుకురాబోతోంది.
ఇది కేవలం ఒక ప్రైవసీ ఫీచర్ లాంటిది. మీ ఇంట్లో గెస్టులు ఉన్నప్పుడు జొమాటో యాప్‌లో ఈ మోడ్‌ను ఆన్ చేసుకోవచ్చు. ఒక సారి ఈ మోడ్ యాక్టివేట్ అయితే..యాప్‌లో ఉన్న వివిధ రెస్టారెంట్లు, ఫుడ్ ఐటమ్స్ కనిపిస్తాయి కానీ వాటి రేట్లు మాత్రం కనిపించవు. గెస్టులు తమకు నచ్చిన బిర్యానీ, పిజ్జా, స్టార్టర్స్ వంటి వంటకాలను ఎలాంటి టెన్షన్ లేకుండా స్వేచ్ఛగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆర్డర్ చేసే సమయంలో.. బిల్లు మొత్తం మీకు మాత్రమే కనిపిస్తుంది.
మన సంస్కృతిలో అతిథి దేవో భవ అంటాం. గెస్టులు ఇంటికి వస్తే కావలసినంత రుచికరమైన భోజనం పెట్టాలని చూస్తాం. కానీ ఆన్‌లైన్ ఫుడ్ యాప్‌లలో ఒక్కో సారి రేట్లు ఎక్కువగా ఉండటం చూసి గెస్టులు “వద్దులే, వేరేది చూద్దాం” అంటుంటారు. ఈ మొహమాటాన్ని పూర్తిగా తొలగించడానికి జొమాటో ఈ ట్రెండీ ఆలోచన చేసింది. దీని వల్ల గెస్టులు ఎలాంటి సంకోచం లేకుండా తమకు ఇష్టమైన ఫుడ్‌ను హ్యాపీగా ఆర్డర్ చేయెచ్చు.
ఈ మెహమాన్ మోడ్ ఫీచర్ జొమాటో యాప్‌లో పూర్తిగా ఉచితంగా అందుబాటులోకి రానుంది. దీని కోసం యూజర్లు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే.. మీరు ఆర్డర్ చేసే ఫుడ్ ఐటమ్స్ ధరలు రెస్టారెంట్‌ను బట్టి మారుతుంటాయి. సాధారణంగా జొమాటోలో ఒక వ్యక్తికి సరి పోయే మీల్స్ లేదా స్నాక్స్ ధర సుమారు రూ. 250 నుంచి రూ. 600 వరకు ఉంటుంది. అలాగే ఫ్యామిలీ ఆర్డర్లు లేదా పార్టీ ఆర్డర్ల కోసం అయ్యే సగటు ఖర్చు సుమారు రూ. 1,200 నుంచి రూ. 3,000 వరకు ఉండొచ్చు. ఈ ఫీచర్ ద్వారా కేవలం ధరలు మాత్రమే హైడ్ అవుతాయి కానీ డెలివరీ చార్జీలు లేదా ప్లాట్‌ఫారమ్ ఫీజులు సాధారణంగానే వర్తిస్తాయి.
Also Read: తక్కువ ధరలో..సినిమా థియేటర్ మజా,టాప్ 5 బడ్జెట్ స్మార్ట్ టీవీలివే!
1. జొమాటో యాప్‌ను లేటెస్ట్ వర్షన్‌కు అప్‌డేట్ చేసుకోండి.
2.ప్రొఫైల్ సెక్షన్ లేదా కార్ట్ పేజీలో “Mehmaan Mode” ఆప్షన్ కనిపిస్తుంది.
3.దానిని టోగుల్ చేసి ఆన్ చేయగానే ఫుడ్ ప్రైసెస్ అన్నీ హైడ్ అయిపోతాయి.
4.గెస్టులు ఆర్డర్ సెలెక్ట్ చేశాక మోడ్ ఆఫ్ చేసి మీరు బిల్లు చెల్లించొచ్చు.
కస్టమర్ల మనస్తత్వాన్ని అర్థం చేసుకుంటూ జొమాటో తెస్తున్న ఈ ‘మెహమాన్ మోడ్’ సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. గెస్టుల రాకను మరింత ఆనందంగా, ఎలాంటి మొహమాటాలు లేకుండా గడపడానికి ఈ ఫీచర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈసారి మీ ఇంటికి బంధువులు వస్తే ఫీచర్‌ను తప్పకుండా ట్రై చేయండి!