ఇండియన్ రైల్వే రోజు రోజుకు మరింత అభివృద్ధి చెందుతోంది. గత దశాబ్ద కాలంగా మరింత ఊపందుకుంది. టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ అత్యాధునిక రైళ్లు, రైల్వే లైన్లు, రైల్వే వంతెననలు, రైల్వే టన్నెల్స్ అందుబాటులోకి వస్తున్నాయి. రీసెంట్ గా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ రైల్వే వంతెన అందుబాటులోకి వచ్చింది. ఇది పారిస్ లోని ఈఫిల్ టవర్ కంటె ఎత్తుగా ఉండటం విశేషం. కాశ్మీర్ కు నేరుగా రైల్వే కనెక్టివిటీని అందించంలో ఈ వంతెన కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు మనం దేశంలోనే అత్యంత పొడవైన రైల్వే టన్నెల్ గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
దేశంలో అత్యంత పొడవైన రైల్వే టన్నెల్ గా పిర్ పంజాల్ రైల్వే టన్నెల్ (Pir Panjal Railway Tunnel) గుర్తింపు తెచ్చుకుంది. ఇది జమ్మూ కాశ్మీర్ లో పిర్ పంజాల్ పర్వత శ్రేణులలో ఉంది. జమ్మూకాశ్మీర్ కు ఎలాంటి ఆటంకం లేకుండా రైల్వే కనెక్టివిటీని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్ల రైల్వే లైన్ లో భాగంగా దీనిని నిర్మించారు. ఇది జమ్మూ కాశ్మీర్‌ను భారతదేశ ఇతర భాగాలతో స్థిరమైన రైల్వే కనెక్టివిటీ అందించడానికి నిర్మించబడింది.
Read Also: సికింద్రాబాద్ స్టేషన్ లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ప్రారంభం.. ప్రత్యేకతలు తెలిస్తే పరేషాన్ కావాల్సిందే!
పిర్ పంజాల్ రైల్వే టన్నెల్ ఏకంగా 11.55 కిలో మీటర్లు ఉంటుంది. పిర్ పంజాల్ పర్వతాల మధ్యలో నుంచి బనిహార్, కాజిగుండ్ ప్రాంతాల మధ్య దీనిని నిర్మించారు. సముద్ర మట్టానికి సగటున 1,760 మీటర్ల ఎత్తులో అంటే 5, 570 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ టన్నెల్ 8.40 మీటర్ల వెడల్పు, 7.39 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ టన్నెల్ నిర్మాణ పనులు నవంబర్ 2005లో ప్రారంభం అయితే, జూన్ 2013 వరకు కొనసాగాయి. అత్యంత కఠిన పరిస్థితులలో డ్రిల్ అండ్ బ్లాస్ట్, రోగ్ హెడర్ లాంటి న్యూ ఆస్ట్రియన్ టన్నెలింగ్ మెథడ్ ను ఉపయోగించి నిర్మించారు. భారతదేశంలో మొదటిసారి NATM ఉపయోగించి టన్నెల్ ను తవ్వారు. ప్రస్తుతం ఈ రైల్వే టన్నెల్ దేశంలోనే అతి పొడవైనదిగా గుర్తింపు తెచ్చుకోగా, ఆసియాలో రెండో అతిపెద్ద రైల్వే టన్నెల్ గా రికార్డుకెక్కింది.
పిర్ పంజాల్ రైల్వే టన్నెల్ బనిహాల్-కాజిగుండ్ మధ్య దూరాన్ని 35 కి.మీ నుంచి 17.5 కి.మీకి తగ్గిచింది. ఈ టన్నెల్ జవ్హర్ రోడ్ టన్నెల్ (2,194 మీటర్లు) కంటే 440 మీటర్లు కింద ఉండటం విశేషం. ఈ రైల్వే లైన్ కారణంగా వర్షాకాలం, చలికాలంలో కూడా ఎలాంటి ఆటంకం లేకుండా రైలు ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. ఇది ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్ల (USBRL) ప్రాజెక్ట్ లో కీలక భాగంగా కొనసాగుతుంది. ఈ ప్రాజెక్టు పూర్తి పొడవు 202 కి.మీ ఉంటుంది. ప్రయాణీకులు, పర్యాటకులు ఈజీగా కాశ్మీర్ చేరుకోవడానికి ఈ టన్నెల్ సహాయపడుతుంది. అంతేకాదు, భారత రైల్వే సాంకేతికతకు ఒక మైలురాయిగా నిలిచింది.
Read Also: రైళ్లలో వీరు ఉచితంగా ప్రయాణించవచ్చు.. సాధారణ ప్రజలు కూడా, కానీ..