Big Stories

PM Kisan Samman Yojana 16th Installment: పీఎం కిసాన్ సమ్మాన్ యోజన .. ఫిబ్రవరి 28న రైతుల ఖాతాల్లో రూ. 2 వేలు జమ!

 

- Advertisement -

PM Kisan Samman Yojana 16th Installment

- Advertisement -

PM Kisan Samman Yojana 16th Installment: ఫిబ్రవరి నెలాఖరులోగా డీబీటీ ద్వారా రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 16వ విడత నిధులను కేంద్ర ప్రభుత్వం జమ చేయనుంది. ఈ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. పేద రైతులకు పెట్టుబడి సాయం అందించడమే ఈ స్కీమ్ లక్ష్యం. ఈ పథకం ద్వారా రైతులకు ఏటా రూ.6 వేలు ఆర్థిక సహాయం అందజేస్తున్నారు.  రూ.2 వేల చొప్పున 3 విడతల్లో అందిస్తున్నారు. ఈ మొత్తాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు.  సాగు భూమి ఉన్న రైతులకు ఈ పథకం వల్ల ప్రయోజనం కలుగుతుంది. అదే సమయంలో పన్ను చెల్లింపుదారులు ఈ పథకానికి అర్హులు కారు.

పీఎం కిసాన్ 16వ విడత నిధులు ఎప్పుడు విడుదల అవుతాయంటే?
పీఎం కిసాన్ కింద ఆర్థికసాయం మొత్తం 2024 ఫిబ్రవరి 28న విడుదలవుతుంది. ఆ రోజు రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా రూ.2 వేలు జమ చేస్తారు. పీఎం కిసాన్ సమ్మాన్ యోజనకు నమోదు చేసుకున్న రైతులకు ఈ-కేవైసీ తప్పనిసరి. ఓటీపీ ఆధారిత ఈ-కేవైసీ పీఎం కిసాన్ పోర్టల్‌లో అందుబాటులో ఉంది. బయోమెట్రిక్ ఆధారిత ఈ-కేవైసీ కోసం సమీపంలోని సీఎస్సీ కేంద్రాలను సంప్రదించవచ్చు.

ఈ-కేవైసీ ఎందుకు ముఖ్యమైంది?
పీఎం కిసాన్ పథకం ప్రయోజనాలు ఏ మధ్యవర్తుల ప్రమేయం లేకుండా చేయడం కోసమే ఈ-కేవైసీ తీసుకొచ్చారు. లబ్ధిదారుల ఆధార్ లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ అవుతుంది.

Read More: ఉచిత విద్యుత్ పథకం సబ్సిడీ వివరాలివే.. అర్హులెవరో తెలుసుకోండి..

ఈ-కేవైసీ పద్ధతులు ఏంటి?
పీఎం కిసాన్ పథకం కింద రైతులకు ఈ-కేవైసీకి మూడు పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. ఓటీపీ ఆధారిత ఈ- కేవైసీ .. పీఎం- కిసాన్ పోర్టల్ , మొబైల్ యాప్‌లో అందుబాటులో ఉంది. బయోమెట్రిక్ ఆధారిత ఈ-కేవైసీ కామన్ సర్వీస్ సెంటర్, స్టేట్ సర్వీస్ సెంటర్ లో అందుబాటులో ఉంది. లక్షలాది మంది రైతులు ఉపయోగించే పీఎం కిసాన్ మొబైల్ యాప్‌లో ఫేస్ అథెంటికేషన్ ఆధారిత ఈ-కేవీసీ అందుబాటులో ఉంది.

పీఎం కిసాన్ 16వ విడత వివరాల కోసం..
కేంద్ర ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ pmkisan.Gov.In ను సందర్శించాలి.
మీ స్క్రీన్‌పై చూపించిన లింక్‌పై క్లిక్ చేయాలి.
మీ నంబర్ లేదా రిజిస్ట్రేషన్ ఐడీ ద్వారా తనిఖీ చేయాలనుకుంటున్నారా? స్క్రీన్‌పై రెండు ఎంపికల మధ్య ఎంచుకోవాలి. అడిగిన సంబంధిత, సరైన వాస్తవాలతోపాటు స్క్రీన్‌పై కనిపించే కోడ్‌ను నమోదు చేయాలి.

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 15వ విడతను 2023 నవంబర్ 15న జమ చేశారు. అప్పుడు 8 కోట్ల మందికిపైగా రైతుల ఖాతాలకు రూ.18 వేల కోట్లకుపైగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేరుగా బదిలీ చేశారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News