Big Stories

CM Revanth Reddy: సింగరేణి కార్మికలకు తెలంగాణ సర్కార్ భరోసా.. రూ. కోటి ప్రమాద బీమా పథకాన్ని పారంభించిన సీఎం

CM Revanth Reddy
CM Revanth Reddy

CM Revanth Reddy Started one Crore Accidental Insurance Scheme to Singareni Employees: సింగరేణి కార్మికలకు రూ. కోటి ప్రమాద బీమా పథకాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. బీమా పథకం ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖ పాల్గొన్నారు.

- Advertisement -

తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులు కీలక పాత్ర పోషించారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో సింగరేణి కార్మికులకు సరైన న్యాయం జరగలేదని గుర్తుచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణి సంస్థను ప్రైవేటు పరం చేయడానికి చర్యలు చేపట్టిందని తెలిపారు.

- Advertisement -

2014లో మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారని సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. కేసీఆర్ తెలంగాణలో పరిపాలనను గాలికొదిలేసారని తెలిపారు. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్ధను భ్రష్టు పట్టించారని పేర్కొన్నారు. గత ప్రభుత్వ తప్పులను ప్రజలకు వివరిస్తున్నామన్నారు. ఇప్పటికే రెండు గ్యారంటీలను అమలు చేశామని తెలిపారు. మరో రెండు గ్యారంటీలకు రంగం సిద్ధమైందని స్పష్టం చేశారు.

Read More: Teegala Krishna Reddy: బీఆర్‌ఎస్‌కు మరో షాక్‌.. కాంగ్రెస్‌లో చేరిన తీగల కృష్ణా రెడ్డి

బీఆర్ఎస్ నాయకులు ఇంకా అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారన్నారు. ఇక మోదీపై కూడా సీఎం విమర్శలు చేశారు. తెలంగాణకు మోదీ చేసిందేమీలేదని పేర్కొన్నారు. మద్ధతు ధర అడిగిన రైతులను కాల్చి చంపిన వారికి ఎందుకు ఓటెయ్యాలని ప్రశ్నించారు.

కోటి ప్రమాద బీమా పథకం ఇప్పటివరకు కేవలం సైనికులకు మాత్రమే ఉండేదని సింగరేణి ఎండీ బలరామ్ స్పష్టం చేశారు. ఔట్ సోర్సింగ్ సిబ్బందికి కూడా రూ. 40 లక్షల బీమా పథకం అమలు చేయడం గొప్ప నిర్ణయం అని పేర్కొన్నారు.

43 వేల మందికి ఈ బీమా పథకం వర్తిస్తుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News