BigTV English

Rajiv Gandhi 33rd Death Anniversary: రాజీవ్ గాంధీ 33వ వర్థంతి.. నివాళులు అర్పించిన ప్రధాని, కాంగ్రెస్ నేతలు!

Rajiv Gandhi 33rd Death Anniversary: రాజీవ్ గాంధీ 33వ వర్థంతి.. నివాళులు అర్పించిన ప్రధాని, కాంగ్రెస్ నేతలు!

PM Modi Pays Tribute to Rajiv Gandhi: భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మరణించి రోజు ఇది. ఆయన 33వ వర్థంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ రాజీవ్ గాంధీకి నివాళులు అర్పించారు. ఈ మేరకు X వేదికగా ఆయన.. “మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్థంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను” అని పేర్కొన్నారు.


ఢిల్లీలోని వీర్ భూమిలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీ మంగళవారం ఉదయం రాజీవ్ గాంధీకి నివాళులు అర్పించారు. పి. చిదంబరం, సచిన్ పైలట్ కూడా ఢిల్లీలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి నివాళులు అర్పించారు.

1984లో రాజీవ్ గాంధీ తల్లి, అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హత్యానంతరం రాజీవ్ గాంధీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టారు. 1984లో పదవీ బాధ్యతలు చేపట్టిన ఆయన.. 40 సంవత్సరాల అతి చిన్న వయసులో దేశ ప్రధానమంత్రి అయ్యారు. డిసెంబర్ 2 1989 వరకూ భారత ప్రధానమంత్రిగా పనిచేశారు. 1944 ఆగస్టు 20న జన్మించిన ఆయన.. 1991 మే 21న తమిళనాడులోని శ్రీ పెరంబుదూర్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. అక్కడ ఆత్మాహుతి బాంబర్ తో హత్య చేయబడ్డారు.


Also Read: Kharge comments on PM Modi: మోదీపై హాట్ కామెంట్స్, చేసింది చాలు, ప్రజా జీవితం నుంచి..

Related News

Delhi Terrorists Arrested: ఢిల్లీలో ఐదుగురు ఉగ్రవాదులు అరెస్ట్

Traffic Challans: వాహనదారులకు గుడ్ న్యూస్.. ఈ తేదీన ట్రాఫిక్ చలాన్ల మాఫీ? ఇలా చెయ్యండి

Prostitution Case: వ్యభిచారం కేసులో విటులు కూడా నేరం చేసినట్టే.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Kerala Court Judgment: తల్లికి భరణం చెల్లించని వ్యక్తికి జైలు శిక్ష

Malaria vaccine: మలేరియాకు మందు.. భారత తొలి వ్యాక్సిన్‌కు హైదరాబాద్ నుంచే శ్రీకారం

Milk Prices: శుభవార్త.. తగ్గనున్న పాల ధరలు.. లీటర్‌కు ఎంత తగ్గిస్తారంటే

Big Stories

×