E-Paper
Advertisement

దేశంలో ఘోరం.. భార్య, ముగ్గురు కూతుళ్లను.. రాయితో కొట్టిచంపిన కిరాతకుడు!

దేశంలో ఘోరం.. భార్య, ముగ్గురు కూతుళ్లను.. రాయితో కొట్టిచంపిన కిరాతకుడు!
Advertisement

Family Murder: రాజస్థాన్ జైపూర్‌లోని కర్ధాని ప్రాంతంలో అత్యంత ఘోరమైన సంఘటన చోటుచేసుకుంది. ఇవాళ (సెప్టెంబర్ 11) తెల్లవారుజామున ఒక వ్యక్తి తన భార్య, ముగ్గురు కుమార్తెలపై కిరాతకంగా బండరాయితో దాడి చేసి హత్య చేశాడు. గోవింద్ వాటికలోని ఓ ఇంట్లో ఈ ఘటన జరిగింది. కుటుంబ కలహాలే ఈ దారుణానికి ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

నిద్రలో ఉండగానే దాడి..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడిని రాహుల్ ఝాగా గుర్తించారు. నిందితుడు తన భార్య గీతా ఝా (40), పెద్ద కుమార్తె నందిని (22), రెండో కుమార్తె రాధిక (17), చిన్న కుమార్తె గౌరి (14) లపై వారు నిద్రిస్తున్న సమయంలో దాడి చేశాడు. బండరాయితో తలపై తీవ్రంగా బాది చంపేశాడు. అనంతరం కింద పడ్డ రక్తపు మరకలను ఒక గుడ్డతో తుడిచేసి.. ఇంటి నుంచి పరారయ్యాడు.

వేర్వేరు గదుల్లో మృతదేహాలు

Advertisement

స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఉదయం 10 గంటల ప్రాంతంలో పోలీసులు గోవింద్ వాటికలోని ఇంటికి చేరుకున్నారు. వేర్వేరు గదుల్లో పడి ఉన్న మృతదేహాలను గుర్తించారు. హత్యలు జరిగిన సమయంలో రాహుల్ తండ్రి లక్ష్మీనాథ్ ఝా ఇంట్లోనే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మరోవైపు ఫోరెన్సిక్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని నమూనాలను సేకరించింది. హత్యకు ఉపయోగించిన రాయిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Also Read: పాత ఫోన్ నెంబర్ మార్చేశారా? తక్షణమే ఈ 4 పనులు చేయకపోతే రిస్కే!

నిందితుడి కోసం గాలింపు

Advertisement

ఘటనపై మీడియాతో మాట్లాడిన వెస్ట్ డిస్ట్రిక్ట్ DCP ప్రశాంత్ కిరణ్.. కుటుంబ కలహాల వల్లే ఈ ఘోరం జరిగినట్లు వెల్లడించారు. పరారీలో ఉన్న రాహుల్ ఝాను పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించామని పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల్లో అతడి కోసం తనిఖీలు జరుగుతున్నట్లు స్పష్టం చేశారు. మరోవైపు కుటుంబ సభ్యులు, బంధువులు, పొరుగువారితో మాట్లాడి గొడవకు గల కారణాలను ఆరా తీస్తున్నట్లు డీసీపీ వివరించారు.

Also Read: బంగ్లాదేశ్‌లో హిందూ సాధువు తీవ్ర భావోద్వేగం.. దేవుడి పాదాలు తాకి కన్నీటి పర్యంతం!

Tags

Related News

5G సిగ్నల్ సరిగ్గా రాలేదని.. జియో ఎంప్లాయ్‌ని టవర్‌కే కట్టేశారు!

వాహనదారులకు గుడ్‌న్యూస్.. టోల్‌ ప్లాజాల వద్ద ఆగకుండానే నేరుగా, ఫిబ్రవరి నుంచే అమల్లోకి!

‘చిన్నారిని బెదిరిస్తే చూస్తూ ఊరుకోం’.. ఇన్‌ఫ్లుయెన్సర్ వేధింపులపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

ఉత్కంఠకు చెక్.. భారత్‌లో చైనా అధ్యక్షుడి పర్యటన ఖరారు.. బ్రిక్స్ సదస్సుకు హాజరు

గుజరాత్ ఒమ్ని vs ఇటలీ బార్.. 80s ఏఐ ట్రెండ్‌తో.. రచ్చకెక్కిన బీజేపీ, కాంగ్రెస్!

సీఎం విజయ్‌కు స్టాలిన్ స్ట్రాంగ్ కౌంటర్.. అవును విజయ్.. నా దవడ విరిగింది?

జంతర్ మంతర్ కేసులను రద్దు చేసినా నోటీసులా.. సుప్రీం కోర్టు ఫైర్!

Big Stories

Advertisement
×