Tanveer Ahmed On Asia Cup 2026 Finals: ఉమెన్స్ ఆసియా కప్ 2026 టోర్నమెంట్ (Women’s Asia Cup 2026 Tournament) చివరి దశకు వచ్చేసింది. రేపు టీమిండియా ఉమెన్స్ వర్సెస్ శ్రీలంక ఉమెన్స్ (Team India Women vs. Sri Lanka Women) మధ్య ఫైనల్స్ కూడా జరగనుంది. అయితే నిన్న పాకిస్తాన్ ఉమెన్స్ వర్సెస్ శ్రీలంక మధ్య రెండో సెమీ ఫైనల్ జరిగింది. తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ప్లేయర్లు చేతులెత్తేశారు. ఈ క్రమంలో నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించిన ఉమెన్స్ శ్రీలంక… నేరుగా ఫైనల్స్ చేరింది. ఇక రేపు టీమిండియాతో ఫైనల్ ఉండనుంది.
ఆసియా క ప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో (Women’s Asia Cup 2026 Tournament) టీమిండియా వర్సెస్ ఉమెన్స్ శ్రీలంక మధ్య ఫైనల్స్ ఉన్న నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ (Tanveer Ahmed) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆసియా కప్ మొత్తం ఫిక్సింగే అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఫిక్సింగ్ చేసి, టీమిండియా ఫైనల్స్ కు చేరిందని బాంబు పేల్చారు. అటు శ్రీలంకను కూడా ఫైనల్ కు చేరేలా బీసీసీఐ కుట్రలు చేసిందని ఫైర్ అయ్యారు. పాకిస్తాన్ ఫైనల్స్ కు వస్తే ఓడిపోతామన్న భయం టీమిండియాలో నాటుకుందని వ్యాఖ్యానించారు.
ఈ క్రమంలోనే రెండో సెమీఫైనల్స్ సందర్భంగా ఫీల్డ్ అంపైర్స్ ను బీసీసీఐ కొనుగోలు చేసినట్లు ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ ఓడిపోయి… శ్రీలంక గెలిచేసిందని వ్యాఖ్యానించారు. ఇక ఇప్పుడు శ్రీలంకతో టీమిండియా ఫైనల్స్ ఆడనున్న నేపథ్యంలో… ఇందులో ఇండియన్స్ సులభంగా గెలిచే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. అవసరమనుకుంటే పిచ్ , బ్యాట్లు లేదా బంతుల్లో చిప్స్ పెట్టైనా శ్రీలంకను ఓడించి ఆసియా కప్ ను టీమిండియా ఎగరేసుకు వెళ్తుందని షాకింగ్ కామెంట్స్ చేశారు. నేరుగా గెలిచే దమ్ము ధైర్యం టీమిండియాకు లేదంటూ పరువు తీశారు.
ఉమెన్స్ ఏషియా కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఫైనల్స్ బరిలో టీమిండియా వర్సెస్ శ్రీలంక తలపడనున్నాయి. రేపు అంటే ఆదివారం రోజున రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. సోనీ లివ్, సోనీ స్పోర్ట్స్ వేదికగా ఈ మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ మేరకు ఇప్పటికే ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. అయితే టైటిల్ టీమిండియా గెలిస్తే… తీసుకుంటారా ? లేదా అనే చర్చ మొదలైంది. మొహ్సిన్ నఖ్వీ అందజేస్తాడు అన్న ఒక్క కారణంతో సూర్యకుమార్ యాదవ్ తరహాలోనే హార్మన్ ప్రీత్ కౌర్ కూడా టైటిల్ వదిలేసే చాన్సులు కనిపిస్తున్నాయి.