E-Paper
Advertisement

5G సిగ్నల్ సరిగ్గా రాలేదని.. జియో ఎంప్లాయ్‌ని టవర్‌కే కట్టేశారు!

5G  సిగ్నల్ సరిగ్గా రాలేదని.. జియో ఎంప్లాయ్‌ని టవర్‌కే కట్టేశారు!
Advertisement

Jio Technician: అబ్బా.. ఎంత కోపం వస్తే మాత్రం మరీ మనిషిని తీసుకెళ్లి టవర్‌కే కట్టేస్తారా? మనం రోజువారీ లైఫ్‌లో ఇంటర్నెట్ స్లో అయితేనే ఊగిపోతుంటాం, కానీ యూపీలోని ఒక గ్రామంలో జనాలు చేసిన పని చూస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే. సరిగ్గా సిగ్నల్ రావడం లేదన్న ఆక్రోశంతో పనిమీద వచ్చిన ఒక నెట్‌వర్క్ ఉద్యోగిని ఏకంగా మొబైల్ టవర్‌కే కట్టేసి తమ నిరసన తెలిపారు.

అసలేం జరిగింది?

Advertisement

ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లా, హరదౌలి గ్రామంలో గత రెండేళ్లుగా జియో 5G సిగ్నల్ సరిగ్గా అందడం లేదు. రోజువారీ డిజిటల్ పనుల నుంచి ఆన్‌లైన్ పేమెంట్ల వరకు నెట్‌వర్క్ లేక ఊరి జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా ఫలితం లేకపోవడంతో గ్రామస్తుల్లో తీవ్ర అసహనం నెలకొంది. ఈ క్రమంలోనే నెట్‌వర్క్ సమస్యను పరిశీలించి, సరిచేయడానికి ఒక జియో టెక్నీషియన్ గ్రామానికి వచ్చాడు. ఇక అంతే.. అతడిని చూసిన వెంటనే కోపంతో రగిలిపోతున్న ఊరి జనాలు ఒక్కసారిగా చుట్టుముట్టారు. మాట మాట పెరగడంతో, అతనిపై కోపాన్ని ప్రదర్శిస్తూ నిమిషాల్లోనే టవర్‌కు తాడుతో కట్టేశారు.

పోలీసుల ఎంట్రీ, కేసు నమోదు

Advertisement

అలా ఆ టెక్నీషియన్ దాదాపు రెండు గంటల పాటు టవర్‌కే బంధీగా ఉండిపోయాడు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు వెంటనే గ్రామానికి చేరుకుని, గ్రామస్తులకు నచ్చజెప్పి అతడిని సురక్షితంగా విడిపించారు. తనకు జరిగిన ఈ అనుభవంపై సదరు టెక్నీషియన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు గుర్తుతెలియని గ్రామస్తులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. నెట్‌వర్క్ సరిగ్గా రాకపోతే కంపెనీపై కోపం చూపించాలి గానీ, కష్టపడి పనిచేసే ఉద్యోగిని ఇలా బంధించడం ఏంటని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: బీఆర్ఎస్‌పై ఫ్లాష్ సర్వేలో ఏం తేలింది?.. సీఎల్పీ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

Tags

Related News

దేశంలో ఘోరం.. భార్య, ముగ్గురు కూతుళ్లను.. రాయితో కొట్టిచంపిన కిరాతకుడు!

వాహనదారులకు గుడ్‌న్యూస్.. టోల్‌ ప్లాజాల వద్ద ఆగకుండానే నేరుగా, ఫిబ్రవరి నుంచే అమల్లోకి!

‘చిన్నారిని బెదిరిస్తే చూస్తూ ఊరుకోం’.. ఇన్‌ఫ్లుయెన్సర్ వేధింపులపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

ఉత్కంఠకు చెక్.. భారత్‌లో చైనా అధ్యక్షుడి పర్యటన ఖరారు.. బ్రిక్స్ సదస్సుకు హాజరు

గుజరాత్ ఒమ్ని vs ఇటలీ బార్.. 80s ఏఐ ట్రెండ్‌తో.. రచ్చకెక్కిన బీజేపీ, కాంగ్రెస్!

సీఎం విజయ్‌కు స్టాలిన్ స్ట్రాంగ్ కౌంటర్.. అవును విజయ్.. నా దవడ విరిగింది?

జంతర్ మంతర్ కేసులను రద్దు చేసినా నోటీసులా.. సుప్రీం కోర్టు ఫైర్!

Big Stories

Advertisement
×